CM KCR vs Bandi Sanjay: సీఎం కేసీఆర్ రాజీనామా సవాల్, గొర్ల పైసలు కేంద్రమే ఇచ్చిందని నిరూపిస్తే ఒకే నిమిషంలో సీఎం పదవికి రాజీనామా చేస్తానని బండి సంజయ్‌కి సవాల్ విసిరిన తెలంగాణ ముఖ్యమంత్రి
CM KCR vs Bandi Sanjay (Photo-File Image)

Hyd, Nov 8: వరి వేయాలన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వ్యాఖ్యల నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌పై కేసీఆర్‌ ఘాటు వ్యాఖ్యలు (CM KCR vs Bandi Sanjay) చేశారు. బండి సంజయ్‌ విషయం పరిజ్ఞానం లేకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నాడని (Telangana CM KCR Warns BJP Leader) విమర్శించారు. బీజేపీ రెండు స్టాంపులను తయారు చేసి పెట్టుకుందని, ఒకటి దోశద్రోహి, రెండు అర్బన్‌ నక్సలైట్‌ అని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణలో పునాది లేని పార్టీ బీజేపీ. రైతులు సమ్మె చేస్తున్నా కేంద్రం మొండి వైఖరి ప్రదర్శిస్తోంది. తెలంగాణ ఉద్యమంలో నువ్వు ఎక్కడ ఉన్నావ్‌ అని బండి సంజయ్‌ అంటున్నడు. అప్పుడు నీకు కనీసం పార్లమెంట్‌ ఉందని తెలుసా. ఇంధన ధరలపై ప్రశ్నిస్తే అఫ్గనిస్తాన్‌, పాకిస్తాన్‌కు వెళ్లిపోండి అంటున్నరు. ఇదేనా మాట్లాడే పద్ధతి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 107 సీట్లలో బీజేపీ డిపాజిట్‌ కోల్పోయింది. ఎవరిపై తెలంగాణ ప్రజల విశ్వాసం ఉందో దీన్ని బట్టి తెలుస్తోంది కదా అని మండి పడ్డారు.

62 లక్షల హెక్టార్లలో వరి పంట ఎక్కడుంది అంటున్నరు. 6 హెలిక్యాప్టర్లు పెట్టి చూపిస్తా. మీ నాయకులను వెంటేసుకుని రా. రాయలసీమ కరువు ప్రాంతం. వారికి నీళ్లు రావాలని చెప్పా. బేసిన్లు, భేషాజాలు వద్దని చెప్పా. పక్క రాష్ట్రం వెళ్లి చేపల పులుసు తింటే తప్పా. గొర్ల పైసలు కేంద్రమే ఇచ్చిందని నిరూపిస్తే నేను ఒకే నిమిషంలో సీఎం పదవికి రాజీనామా చేస్తా. గొర్ల పథకానికి మేం ఎన్‌సీడీసీ నుంచి అప్పు తెచ్చుకున్నాం. గొర్ల పథకం బీజేపీది అయితే కర్ణాటకలో ఎందుకు లేదు.’ అని సీఎం కేసీఆర్‌ సూటిగా ప్రశ్నించారు.

ఫాంహౌజ్ దున్నడానికి నీవు డ్రైవర్‌వా, ఓ తోకగానివి, నా ఫామ్‌హౌజ్‌లో అడుగుపెడితే ఆరు ముక్కలైతవ్‌, బండి సంజయ్‌పై విరుచుకుపడిన తెలంగాణ సీఎం కేసీఆర్‌

ఈ నేపథ్యంలో కేంద్రంపై సీఎం కేసీఆర్ యాక్ష‌న్ ప్లాన్ ప్ర‌క‌టించారు. వ‌డ్ల కొనుగోలుపై కేంద్రంతో తేల్చుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. తెలంగాణ‌లో 3 కోట్ల ట‌న్నుల ధాన్యం కొన‌ను అని చెబుతున్నావ్. ఇది నీ చేత‌కాని త‌నం కాదా? కేంద్రం వ‌డ్లు కొనాల‌ని వ‌చ్చే శుక్ర‌వారం అన్ని నియోజ‌క‌వ‌ర్గ కేంద్రాల్లో ధ‌ర్నాలు చేప‌డుతాం. ల‌క్ష‌లాది మంది రైతుల‌తో క‌లిసి ధ‌ర్నాలు చేయ‌బోతున్నాం. వ‌డ్లు కొంట‌వా? కొన‌వా? అనేది తేలాలి. రైతుల‌తో క‌లిసి పోరాడుతాం. శుక్ర‌వారం మాతో క‌లిసి నువ్వు కూడా ధ‌ర్నాకు కూర్చుంటావా? తెలంగాణ‌లో పండించిన ధాన్యాన్ని కొనాల్సిందే.

తెలంగాణ రైతుల ప్ర‌యోజ‌నాల కోసం కొట్లాడుతాం. మా ప్రాణం పోయే వ‌ర‌కు తెలంగాణ కోసం, రైతుల ప్ర‌యోజ‌నాల కోసం కొట్లాడుతాం. మీ తాత జేజ‌మ్మ ఎవ‌రున్నా వ‌దిలిపెట్టం. ఈ దేశ ఖ‌జానాలో మా వాటా ఉంది. ఈ దేశం మీ అయ్య సొత్తు కాదు. మిమ్మ‌ల్ని వ‌ద‌లం, వేటాడుతాం. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనే వ‌ర‌కు పోరాడుతాం. మీరు వ‌డ్లు కొనం అంటే మీకు ఓటేయ్యాలా? వ‌ద్దా? అనేది ప్ర‌జ‌లు నిర్ణ‌యించుకుంటారు. తెలంగాణ రైతులు, ప్ర‌జలు కేసీఆర్‌ను న‌మ్ముతున్నారు. మీరు డిపాజిట్లు కోల్పోయారు అని కేసీఆర్ గుర్తు చేశారు.

కేసీఆర్‌ నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే, 40 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం కొంటామని కేంద్రం లేఖ ఇచ్చిందని తెలిపిన బండి సంజయ్

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌వేశ‌పెట్టిన ద‌ళిత బంధు ప‌థ‌కం య‌ధాత‌థంగా అమ‌లు అవుతోంది అని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. ద‌ళిత బంధు ప‌థ‌కం హుజూరాబాద్‌లో సంపూర్ణంగా అమ‌లై తీరుతోంది. ద‌ళిత బంధు ప‌థ‌కంపై క‌నీస అవ‌గాహ‌న లేకుండా మాట్లాడుతున్నారు. హుజూరాబాద్‌లో ఈ ప‌థ‌కం అమ‌లు కోసం రూ. 2 వేల కోట్లు విడుద‌ల చేశాం. ప‌థ‌కంపై అవ‌గాహ‌న క‌ల్పించి, శిక్ష‌ణ ఇస్తున్నాం. ద‌ళితుల‌కు అన్నింట్లో రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తున్నాం.

త్వ‌రలోనే 60 నుంచి 70 వేల ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్లు ఇస్తామ‌ని కేసీఆర్ ప్ర‌క‌టించారు. సోష‌ల్ మీడియాలో వ‌చ్చే వార్త‌ల‌ను న‌మ్మి నిరుద్యోగులు మోస‌పోవ‌ద్దు. నిరుద్యోగుల‌కు నేను చెప్తున్నా.. మంచి ఉద్యోగ క‌ల్ప‌న జ‌రుగుతోంది. ఉద్యోగ నియామ‌కాలకు క్యాలెండ‌ర్ విడుద‌ల చేస్తాం. 95 శాతం ఉద్యోగాలు స్థానికుల‌కు ద‌క్కేలా నిబంధ‌న‌లు రూపొందించాం. నిరుద్యోగుల‌కు టీఆర్ఎస్ ప్ర‌భుత్వం మేలు చేస్తోంది. జోన‌ల్ విధానం ప్ర‌కారం ఉద్యోగుల‌ను స‌ర్దుతున్నాం.

ఒక‌ట్రెండు రోజుల్లో ఉద్యోగ సంఘాల‌తో స‌మావేశం నిర్వ‌హిస్తాం. న‌వంబ‌ర్‌లో ఉద్యోగుల స‌ర్దుబాటు ప‌క్రియ పూర్తి చేసి.. 60 నుంచి 70 వేల ఉద్యోగాల‌కు నోటిఫికేషన్లు ఇస్తాం. ప్ర‌తి సంవ‌త్స‌రం ఉద్యోగ క్యాలెండ‌ర్ విడుద‌ల చేస్తాం. పార‌ద‌ర్శ‌కంగా ఉద్యోగ నియామ‌కాలు జ‌రుపుతాం. ఇంటికో ఉద్యోగం ఇస్తామ‌ని ఎక్క‌డా చెప్ప‌లేదు. బండి సంజ‌య్ ప‌చ్చి అబ‌ద్దాలు మాట్లాడుతున్నాడు అని సీఎం కేసీఆర్ అన్నారు.

మేము 103 మంది ఉన్నాం, దమ్ముంటే టచ్ చేసి చూడు, బండి సంజయ్‌కి సవాల్ విసిరిన సీఎం కేసీఆర్, కేంద్రం చేతకానితనాన్ని రాష్ట్రాలపై రుద్దుతారా అంటూ మండిపాటు, సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ ముఖ్యాంశాలు ఇవే

తెలంగాణ ద‌ళిత జాతిని అభివృద్ధి చేసే బాధ్య‌త నాదే. హుజూరాబాద్‌లో ప్ర‌తి ద‌ళిత కుటుంబానికి ఈ ప‌థ‌కం అమ‌లు చేసి తీరుతాం. మిగ‌తా నాలుగు మండ‌లాల్లో కూడా నేనే స్వ‌యంగా వెళ్లి.. 100 కుటుంబాల చొప్పున అమ‌లు చేస్తాం. మిగ‌తా నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ నియోజ‌క‌వ‌ర్గానికి 100 కుటుంబాల చొప్పున ద‌ళిత బంధు అమ‌లు చేస్తాం. ఈ ప్ర‌క్రియ మార్చి లోపు అమ‌ల‌వుతోంది. వ‌చ్చే మార్చి లోపు 20 ల‌క్ష‌ల కుటుంబాల‌కు అమ‌లు చేస్తాం. ఆర్థిక ప‌రిస్థితి మెరుగుప‌డే కొద్ది అన్ని కుటుంబాల‌కు వ‌ర్తిస్తాం. తెలంగాణ ద‌ళిత‌జాతి అభివృద్ధి ఏడాది, రెండేండ్లో చేసి చూపిస్తాం అని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

బండి సంజయ్‌, ఇతర బీజేపీ నేతలను ఉద్దేశించి సీఎం కేసీఆర్‌ ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి తీవ్ర స్థాయిలో మండిపడ్డ విషయం తెలిసిందే. ఇంకోసారి అడ్డదిడ్డంగా మాట్లాడితే నాలుకలు చీరేస్తామని (Will Cut Your Tongue in Four Pieces) హెచ్చరించారు. తనను జైలుకు పంపుతమని అనడంపై మండిపడుతూ.. దమ్ముంటే టచ్‌ చేసి చూడాలని సీఎం కేసీఆర్‌ సవాల్‌ చేశారు.కేసీఆర్‌ వ్యాఖ్యలపై బండి సంజయ్‌ సోమవారం ధీటుగా బదులిచ్చారు. గంటకో మాట మాట్లాడి రైతులను ఆగం చేస్తున్నది కేసీఆర్‌యేనని, ఆయన నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే ఆడతారని విమర్శించారు. ఈనేపథ్యంలో బీజేపీ నేతల వ్యాఖ్యలపై కౌంటర్‌ ఎటాక్‌గా సీఎం కేసీఆర్‌ వరుసగా రెండో రోజు మీడియా సమావేశం నిర్వహించారు.