Bandi Sanjay vs CM KCR: కేసీఆర్‌ నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే, 40 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం కొంటామని కేంద్రం లేఖ ఇచ్చిందని తెలిపిన బండి సంజయ్
KCR vs Bandi Sanjay (File Image)

Hyd, Nov 8: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రెస్ మీట్లో కేంద్రంపై, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మీద విరుచుకుపడని సంగతి విదితమే. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కౌంటర్‌ ఎటాక్‌కు (Bandi Sanjay vs CM KCR) దిగారు. కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తూ కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను బండి సంజయ్‌ (Bandi Sanjay Kumar) కొట్టివేశారు. అసలు గంటకో మాట మాట్లాడేది ఎవరని ప్రశ్నించారు. గంటకో మాట మాట్లాడి రైతులను ఆగం చేస్తున్నది కేసీఆరేనని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ (CM KCR) నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే ఆడతారని విమర్శించారు.

వరి కొంటామని కేంద్రం స్పష్టమైన ప్రకటన చేసింది. ధాన్యాన్ని కేంద్రం కొంటుందా.. రాష్టం కొంటుందా అంటే ఇన్నాళ్లు కేంద్రమే వడ్లు కొన్నది. 40 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం కొంటామని కేంద్రం లేఖ ఇచ్చింది.  అగస్టు 31వ తేదీనే కేంద్ర ప్రభుత్వం లేఖ రాసిందని... కానీ, లేఖ రాయలేదని కేసీఆర్ అవాస్తవాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.  కేంద్రం పంపిన లేఖ కేసీఆర్‌కు వచ్చిందా.. రాలేదా?, రైతుల చట్టాల విషయంలో కేసీఆర్‌ పూటకో మాట మాట్లాడతారు. మార్కెట్‌ కమిటీలను రద్దు చేస్తామని కేంద్రం ఎప్పుడు చెప్పింది. దమ్ముంటే (TS BJP Chief Bandi Sanjay challenges to CM KCR ) కేసీఆర్‌ ఆధారాలు చూపించాలి. 62 లక్షల ఎకరాల్లో వరి ఎక్కడ సాగవుతుందో కేసీఆర్‌ చెప్పాలని డిమాండ్ చేశారు.

మేము 103 మంది ఉన్నాం, దమ్ముంటే టచ్ చేసి చూడు, బండి సంజయ్‌కి సవాల్ విసిరిన సీఎం కేసీఆర్, కేంద్రం చేతకానితనాన్ని రాష్ట్రాలపై రుద్దుతారా అంటూ మండిపాటు, సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ ముఖ్యాంశాలు ఇవే

ఒకసారి వరి వద్దంటారు.. మరొకసారి పత్తి వద్దంటారు. రుణమాఫీ చేస్తామని కేసీఆర్‌ మూడేళ్ల క్రితం చెప్పారు. రైతులు ఎక్కడ సంతోషంగా ఉన్నారో కేసీఆరే చెప్పాలి. ఉద్యోగాలు ఇవ్వనందునే నిరుద్యోగులు కూలీలుగా మారుతున్నారు. రైతు ఆత్మహత్యలు కేసీఆర్‌కు కనిపించడం లేదా..ప్రతీ గింజా మేమే కొంటామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. కేంద్రం పెత్తనం ఏందని అప్పట్లో కేసీఆర్‌ విమర్శించారు. కేంద్రమంత్రిపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడి నోరు పారేసుకున్నారు.

రైస్ మిల్లర్లతో కుమ్మక్కై కేసీఆర్ పెద్ద స్కాం చేశారని ఆరోపించారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ఢిల్లీకి వెళ్తే కేసీఆర్ ను ఎవరూ పట్టించుకోరని అన్నారు. పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ పెంచలేదని కేసీఆర్ చెప్పడం పచ్చి అబద్ధమని వ్యాఖ్యానించారు. లీటర్ పై కేంద్రానికి రూ. 27 వస్తే రాష్ట్రానికి రూ. 28 వస్తోందని అన్నారు. కేంద్రానికి వెళ్లే రూ. 27లో రాష్ట్రానికి మళ్లీ రూ. 12 తిరిగి వస్తాయని చెప్పారు.

తన మెడ నరుకుతాననని కేసీఆర్ అన్నారని... ఎప్పుడు నరుకుతారో చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. తనకు ఇంగ్లీష్, హిందీ రాదని కేసీఆర్ అన్నారని.. తాను పేద ప్రజల మనసులోని బాధలను, కష్టాలను చదువుకున్నానని చెప్పారు. మందు తాగి బండి నడిపితే తప్పయినప్పుడు... మందు తాగి ప్రభుత్వాన్ని నడపడం కూడా తప్పేనని అన్నారు.

పెట్రోల్‌, డీజిల్‌ ధరల తగ్గింపు ప్రకటన చేస్తారనే ఆశించాం. కానీ అది జరగలేదు. పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు ఎందుకు తగ్గించరో చెప్పాలి. లీటర్‌ పెట్రోల్‌పై రాష్ట్రానికి రూ. 28 వస్తోంది. పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ పెంచలేదని కేసీఆర్‌ చెబుతున్నారు. 2015లో తెలంగాణ రాష్ట్ర వ్యాట్‌ పెంచింది.. జీవోలు ఉన్నాయి’ అని బండి సంజయ్‌ ఆరోపించారు.