Tollywood Drug Case: టాలీవుడ్ మాదకద్రవ్యాల కేసు, ఈడీ విచారణకు హాజరైన హీరో తరుణ్, చివరి దశకు చేరుకున్న టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణ
ఇప్పటికే 11 మంది సినీ ప్రముఖులను విచారించిన ఈడీ నేడు హీరో తరుణ్‌ను (Actor Tarun Attends ED Investigation) ప్రశ్నించింది. మనీ లాండరింగ్ కోణంలో ఆయన బ్యాంకు ఖాతాలను అధికారులు పరిశీలిస్తున్నారు.
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే 11 మంది సినీ ప్రముఖులను విచారించిన ఈడీ నేడు హీరో తరుణ్‌ను (Actor Tarun Attends ED Investigation) ప్రశ్నించింది. మనీ లాండరింగ్ కోణంలో ఆయన బ్యాంకు ఖాతాలను అధికారులు పరిశీలిస్తున్నారు. అనుమానాస్పద లావాదేవీలు, డ్రగ్స్ విక్రేత కెల్విన్‌తో ఉన్న సంబంధాల గురించి ఈడీ అధికారులు ఆరా తీసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎఫ్‌క్లబ్‌లో జరిగే పార్టీలకు ఎప్పుడైనా హాజరయ్యారా? మాదకద్రవ్యాలు వినియోగించే సెలబ్రిటీలెవరైనా మీకు తెలుసా? అనే అంశాలపై క్షుణ్ణంగా విచారించే (ED Investigation) అవకాశం ఉన్నట్లు సమాచారం.
మరోవైపు తరుణ్ నుంచి సేకరించిన నమూనాల్లో డ్రగ్స్ ఆనవాళ్లు లేవని ఇటీవల ఎఫ్ఎస్‌ఎల్ నివేదికలో తేలింది. డ్రగ్స్ కేసులో ఆరోపణలతో 2017 జులైలో తరుణ్ నుంచి ఎక్సైజ్‌శాఖ నమూనాలు సేకరించింది. తరుణ్ రక్తం, వెంట్రుకలు, గోళ్లను పరీక్షించిన రాష్ట్ర ఫోరెన్సిక్ లేబొరేటరీ ఈ మేరకు నివేదిక విడుదల చేసింది. దీంతో ఎక్సైజ్ శాఖ తరుణ్‌కు క్లీన్‌చిట్ ఇచ్చింది. కాగా.. మత్తుమందుల కేసులో ఈడీ చేపట్టిన దర్యాప్తు తుదిదశకు చేరుకున్నట్లుగా తెలుస్తోంది.
పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయిన రాజ్‌కుంద్రా జైలు నుంచి రిలీజ్, బెయిల్ మంజూరీ చేసిన ముంబై కోర్టు
మనీ లాండరింగ్ కోణంలో 12 మంది సినీ ప్రముఖులకు నోటీసులిచ్చిన ఈడీ.. గత కొన్ని రోజుల నుంచి వారిని విచారిస్తోంది. ఇప్పటివరకూ పూరీజగన్నాథ్, రానా, ఛార్మి, నవదీప్, రకుల్‌ప్రీత్ సింగ్, రవితేజ.. ఇలా మొత్తం 11 మంది సెలబ్రిటీలను ఈడీ సుధీర్ఘంగా విచారించి.. వారి వద్ద నుంచి కీలక సమాచారం రాబట్టింది.
ఇదిలా ఉంటే టాలీవుడ్ డ్రగ్స్ కేసులో (Tollywood Drug Case) సెలబ్రిటీలపై బలమైన ఆధారాలు లేవని ఎక్సైజ్ శాఖ తెలిపింది. సినీతారలపై కెల్విన్ ఇచ్చిన కెల్విన్ వాంగ్మూలం దర్యాప్తును తప్పుదోవపట్టించేలా ఉన్నాయని, కేవలం నిందితుడు చెప్పిన విషయాలను బలమైన ఆధారాలుగా భావించలేం అని ఎక్సైజ్ శాఖ తెలిపింది. సినీ తారలు, విద్యార్థులు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, హోటల్ నిర్వాహకులకు డ్రగ్స్ అమ్మినట్లు కెల్విన్ వాంగ్మూలం ఇచ్చిన సంగతి విదితమే.
దాని ఆధారంగా సిట్ బృందం పలువురు సినీ తారలకు నోటీసులు ఇచ్చి ప్రశ్నించింది. అన్ని రకాల సాక్ష్యాలను సిట్ బృందం పరిశీలించి, విశ్లేషించింది. అయితే సెలబ్రిటీలపై బలమైన ఆధారాలు లభించలేదు. సెలబ్రిటీలను నిందితులుగా చేర్చేందుకు కేవలం కెల్విన్ వాంగ్మూలం సరిపోదు. అంతేకాకుండా సెలబ్రిటీలు, ఇతర అనుమానితుల వద్ద డ్రగ్స్ కూడా లభించలేదు' అని ఎక్సైజ్ శాఖ పేర్కొంది. ఇప్పటికే పూరి జగన్నాథ్, తరుణ్ శాంపిల్స్ లో డ్రగ్స్ ఆనవాళ్లు లేవని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్(ఎఫ్ఎస్‌ఎల్) తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే.
అక్టోబర్ 10న మా ఎన్నికలు, ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ పోలింగ్
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కెల్విన్ గురించి సిట్ మాట్లాడుతూ.. 'కెల్విన్ మంగళూరులో చదువుకునేటప్పుడు డ్రగ్స్ కు అలవాటు పడ్డాడని ఎక్సైజ్ శాఖ తెలిపింది. 2013 నుంచి తన స్నేహితులకు డ్రగ్స్ అమ్మడం మొదలు పెట్టాడు. గోవా, విదేశాల నుండి డార్క్ వెబ్ ద్వారా కెల్విన్ డ్రగ్స్ తెప్పించాడు. వాట్సప్, మెయిల్ ద్వారా ఇతరుల నుంచి ఆర్డర్లు తీసుకొని డ్రగ్స్ సరఫరా చేశాడు. చిరునామాలు, ఇతర కీలక వివరాలు దర్యాప్తులో కెల్విన్ వెల్లడించలేదు. కెల్విన్, అతని స్నేహితులు నిశ్చయ్, రవికిరణ్ ప్రమేయం ఆధారాలున్నాయి. సోదాల సందర్భంగా కెల్విన్ వంటగది నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు' అని ఎక్సైజ్ శాఖ వివరించింది.
ఇక డ్రగ్స్ కేసులో తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని సినీ నటుడు తనీష్ చెప్పారు. కెల్విన్ నుంచి తాను డ్రగ్స్ ఖరీదు చేయడం కానీ, దాని నిమిత్తం డబ్బు వెచ్చించడం కానీ జరగలేదని స్పష్టం చేశారు