A file image of Prakash Raj. | Image Courtesy: Facebook

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికలకు రంగం సిద్ధమైంది. అక్టోబర్‌ 10న ఎన్నికలు (MAA Elections 2021) నిర్వహించాలని గతంలో జరిగిన సమావేశంలో నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాగా, తాజాగా ‘మా’ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైంది. అక్టోబర్ 10న ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో పోలింగ్‌ నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి వి. కృష్ణమోహన్ తెలిపారు. అదే రోజు ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు. ఎనిమిది మంది ఆఫీస్ బేరర్స్ 18 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్స్‌తో కూడిన కమిటీకి ఈ ఎన్నికలు జరగనున్నాయి.

సెప్టెంబర్‌ 27 నుంచి 29 వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. 30న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్‌ ఉపసంహరణకు అక్టోబర్‌ 1–2 తేదీల్లో సాయంత్రం 5 గంటల వరకూ గడువు ఇచ్చారు. రెండో తేది సాయంత్రం బరిలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటన ఇస్తారు. అక్టోబర్‌ 10న ఎన్నికలు, అదే రోజు రాత్రి ఏడు గంటలకు ఫలితాలను వెల్లడిస్తారు.

వరుసగా మూడో రోజు సోనూసూద్‌ ఆస్తులపై ఐటీ సోదాలు, పన్ను ఎగవేతకు సంబంధించిన ఓ కేసు దర్యాప్తులో సోదాలు జరిపామని తెలిపిన ఐటీ అధికారులు

నియమ నిబంధనలు: (MAA Elections guidelines issued)

ఒక అభ్యర్థి ఒక పోస్ట్‌ కోసమే పోటీ చేయాలి.

గత కమిటీలో ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ అయి ఉండి, 50 శాతం కన్నా తక్కువ ఈసీ మీటింగ్‌లకు హాజరు కాకపోతే పోటీ చేసే అర్హత ఉండదు.

24 క్రాఫ్ట్స్‌లో ఆఫీస్‌ బేరర్స్‌గా ఉన్న వారు ఆ పదవులకు రాజీనామా చేయకపోతే ‘మా’ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు కారు.

ఈ సారి ‘మా’ అధ్యక్ష ఎన్నికల బరిలో ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు, సీవీఎల్‌ నర్సింహరావు ఉన్నారు. వీరిలో ప్రకాశ్‌రాజ్‌ ఇప్పటికే తన ప్యానెల్‌ సభ్యులను ప్రకటించారు. మంచు విష్ణు, సీవీఎల్‌ నర్సింహరావు తమ ప్యానల్‌ సభ్యులను ప్రకటించాల్సి ఉంది.