IPL Auction 2025 Live

Tollywood: రేపటినుంచి సినిమా షూటింగ్‌లు బంద్, వేతనాలు పెంచాలంటూ ఆందోళన చేపట్టేందుకు సిద్ధమైన సినీ కార్మికులు

తమకు వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు ఆందోళన (Workers call for bandh) చేపట్టేందుకు సిద్ధమయ్యారు. బుధవారం నాడు 24 విభాగాల కార్మికులు ఫిలిం ఫెడరేషన్‌ (Film Federation) కార్యాలయాన్ని ముట్టడించాలని పిలుపునిచ్చారు.

Tollywood Logo

తెలుగుచిత్ర సీమలో సమ్మె సైరన్‌ మోగింది. తమకు వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు ఆందోళన (Workers call for bandh) చేపట్టేందుకు సిద్ధమయ్యారు. బుధవారం నాడు 24 విభాగాల కార్మికులు ఫిలిం ఫెడరేషన్‌ (Film Federation) కార్యాలయాన్ని ముట్టడించాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా రేపటినుంచి సినిమా షూటింగ్‌లకు సైతం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. వసూళ్లలో దుమ్మురేపుతోన్న విక్రమ్ మూవీ, విడుదలైన రెండు వారాల్లో రూ. 300 కోట్ల వసూళ్లు, ఇప్పుడు అప్పులన్నీ తీర్చేస్తా. నాకిష్టమైన ఆహారాన్ని తింటానంటున్న లోకనాయకుడు

మంగళవారం నాడు వెంకటగిరిలోని ఫిలిం ఫెడరేషన్ కార్యాలయంలో సినీ కార్మిక సంఘాలతో ఫిలిం ఫెడరేషన్ చర్చలు జరిపింది. అనంతరం ఫిలిం ఫెడరేషన్‌ అధ్యక్షుడు వల్లభనేని అనిల్‌ మాట్లాడుతూ.. 'వేతనాల పెంపుపై నిర్మాతల మండలి స్పందించడం లేదు. 24 విభాగాల్లోని ఒక్కో కార్మిక సంఘం నాయకులతో చర్చిస్తున్నాం. ప్రతీ మూడేళ్లకోసారి సినీ కార్మికుల వేతనాలు పెరగాలి. కానీ నాలుగేళ్లైనా సినీ కార్మికుల వేతనాలు పెంచలేదు. కార్మిక సంఘాలు ఫిల్మ్ ఫెడరేషన్‌పై ఒత్తిడి తెస్తున్నాయి' అని పేర్కొన్నారు.