Prabhas with Romantic Team: ఆ హీరోయిన్ బాత్రూంలో నేనెందుకుంటానురా అంటూ డార్లింగ్ ప్రభాస్ సెటైర్‌, హాయ్ మేడమ్, నేను మొగల్తూరుకు చెందిన ప్రభాస్ అంటూ పరిచయం, వైరల్ అవుతున్న రొమాంటిక్‌ టీం చిట్ చాట్ వీడియో

బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరి చేస్తున్న రొమాంటిక్‌ సినిమా ప్రమోషన్ (Prabhas with Romantic Team) కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు.

Prabhas with Romantic Team (Photo-Video Grab)

టాలీవుడ్ యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ప్రస్తుతం పాన్‌ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న విషయం విదితమే. బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరి చేస్తున్న రొమాంటిక్‌ సినిమా ప్రమోషన్ (Prabhas with Romantic Team) కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. ఇటీవలే ఆ సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ చేసిన ప్రభాస్‌ (Tollywood Hero Darling Prabhas ) తాజాగా రొమాంటిక్‌ హీరో, హీరోయిన్లతో సరదాగా చిట్ చాట్ చేశాడు. ఈ నేపథ్యంలో ఆకాశ్‌, కేతికా శర్మలకు తనదైన స్టైయిల్‌లో ప్రశ్నలు సంధించాడు.

ఈ క్రమంలోనే ఇంటర్వ్యూ మొదట్లో కేతికా..తనని తాను పరిచయం చేసుకుంటూ..హాయ్ సార్, నేను ఢిల్లీ నుంచి కేతికను” అని చెప్పగానే, “హాయ్ మేడమ్, నేను మొగల్తూరుకు చెందిన ప్రభాస్” అంటూ డార్లింగ్ బదులిచ్చాడు. ఇక హీరోయిన్‌ కేతిక బాగా పాడుతుందని ఆకాశ్‌ చెప్పగా..అదేమి లేదు సార్‌. నేను కేవలం బాత్రూం సింగర్‌ని అని ఆమె పేర్కొంది. అనంతరం ఆకాశ్‌ ఇది బాత్రూం అనుకో. నేను, ప్రభాస్‌ అన్న ఇక్కడ లేమనుకో..ఏమంటావ్‌ డార్లింగ్‌ అని ప్రశ్నించగా...దానికి ప్రభాస్ ఆమె బాత్రూంలో నేను ఎందుకు ఉంటానురా? అంటూ సెటైర్‌ వేశాడు.

ఈ ఇంటర్వ్యూ మొత్తం ప్రభాస్‌ చాలా ఓపెన్‌ గా మాట్లాడాడు. చిట్ చాట్ మొత్తం సెటైర్స్‌ వేస్తూ ఆద్యంతం కట్టిపడేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

ఉత్తమ తెలుగు చిత్రంగా జెర్సీ, ఉత్తమ పాపులర్‌ చిత్రంగా మహర్షి, ఉత్తమ ఎడిటింగ్​ విభాగాల్లో మరో అవార్డు కైవసం చేసుకున్న నాని జెర్సీ

ప్రభాస్‌ ఈ సినిమా (Romantic Movie Team) ప్రమోషన్‌ చేయడం చూసి నెటిజన్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. వీడియో చివర్లో పూరి జగన్నాథ్‌ భార్య లావణ్య అంటే తనకు ఎంతో ఇష్టం, గౌరవం అని ప్రభాస్‌ పేర్కొన్నారు.