Super Star Krishna Dies: ఇండియన్ జేమ్స్ బాండ్ ఇకలేరు.. సూపర్ స్టార్ కృష్ణ అస్తమయం.. కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి.. విషాదంలో అభిమానులు

కార్డియాక్ అరెస్ట్‌తో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న ఆయన ఈ తెల్లవారుజామున మృతి చెందారు. దీంతో కృష్ణ కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.

Superstar Krishna (Photo-Twitter)

Hyderabad, Nov 15: ప్రముఖ సినీనటుడు సూపర్ స్టార్ కృష్ణ (Super Start Krishna) కన్నుమూశారు. కార్డియాక్ అరెస్ట్‌ తో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న ఆయన ఈ తెల్లవారుజామున మృతి చెందారు. దీంతో కృష్ణ కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. విషయం తెలిసిన అభిమానులు, తెలుగు చిత్ర పరిశ్రమ (Tollywood) తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. కృష్ణ గుంటూరు జిల్లా (Guntur) తెనాలి మండలంలోని బుర్రిపాలెంలో 31 మే 1942లో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు వీరరాఘవయ్య చౌదరి, నాగరత్న దంపతుల ఐదుగురి సంతానంలో కృష్ణ పెద్దవారు.

టాలీవుడ్‌లో తీవ్ర విషాదం, ప్రముఖ నటుడు డీఎంకే మురళి అనారోగ్యంతో కన్నుమూత, మురళి మృతిపై పలువురు సెలబ్రిటీలు సంతాపం

కృష్ణ అసలు పేరు ఘట్టమనేని శివరామ కృష్ణమూర్తి. కృష్ణ డిగ్రీ చదువుతున్నప్పుడు ఏలూరులో అక్కినేని నాగేశ్వరరావుకు ఘనంగా సన్మానం జరిగింది. అది చూసిన కృష్ణ సినిమాలపై మోజు పెంచుకున్నారు. దీంతో ఆయన సినీ రంగానికి వచ్చేశారు. 1965లో ఆయన ఇందిరను వివాహం చేసుకున్నారు. వీరికి రమేశ్ బాబు, మహేశ్‌బాబు, పద్మావతి, ప్రియదర్శిని, మంజుల సంతానం. ఆ తర్వాత విజయ నిర్మలను కృష్ణ రెండో వివాహం చేసుకున్నారు. 1964లో ప్రముఖ దర్శక నిర్మాత ఆదుర్తి సుబ్బారావు రూపొందించిన ‘తేనె మనసులు’ సినిమాతో కృష్ణ సినీరంగంలోకి ప్రవేశించారు. అయితే, ఆ సినిమాలో కృష్ణ నటన ఏమంత బాగోలేదని, ఆయనను ఆ సినిమా నుంచి తొలగించాలన్న ఒత్తిడి వచ్చినా ఆదుర్తి సుబ్బారావు తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. 1965లో విడుదలైన ‘తేనెమనసులు’ సూపర్ డూపర్ హిట్ సాధించింది.

కృష్ణ రెండో సినిమా ‘కన్నెమనసులు’. అనంతరం ‘గూఢచారి 116’లో అవకాశం లభించింది. అది కూడా బ్రహ్మాండమైన విజయం సాధించడంతో ఆయన ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ సినిమా తర్వాత కృష్ణను ఆయన అభిమానులు ఆంధ్రా జేమ్స్‌బాండ్‌గా పిలుచుకునేవారు. ప్రముఖ దర్శకుడు బాపు తెరకెక్కించిన ‘సాక్షి’ సినిమా ఆయన ఇమేజ్‌ను అమాంతం పెంచేసింది. విజయ నిర్మలతో నటించిన తొలి చిత్రం ఇదే.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif