Nick Cordero Dead: కరోనాతో హాలీవుడ్ న‌టుడు మృతి, కోవిడ్-19తో పోరాడి ఓడిన నిక్ కార్డెరో, బుల్లెట్స్ ఓవ‌ర్ బ్రాడ్‌వే చిత్రానికి సంగీతంలో ఉత్తమ నటుడిగా టోనీ అవార్డు అందుకున్న కెనడా సూపర్ స్టార్

కోవిడ్-19 వైర‌స్‌తో 90 రోజుల సుదీర్ఘ పోరాటం త‌ర్వాత ఆదివారం ఆయ‌న (Nick Cordero Dead) శాశ్వ‌త విశ్రాంతి తీసుకున్నారు. 41 ఏళ్ల నిక్ ఏప్రిల్ ప్రారంభంలో క‌రోనా సోకడంతో లాస్ ఏంజిల్స్‌లోని సెడార్స్ సినాయ్ మెడిక‌ల్ సెంట‌ర్‌లో చికిత్స తీసుకున్నారు. ఈ క్ర‌మంలో గ‌త నెల‌ అత‌ని కుడికాలిలో ర‌క్తం గ‌డ్డం క‌ట్ట‌డంతో వైద్యులు ఆయ‌న‌ కాలును సైతం తీసేశారు. తాజాగా అత‌ని ఆరోగ్య ప‌రిస్థితి మ‌రింత‌ విష‌మించ‌డంతో ఆదివారం తుది శ్వాస విడిచారు.

Nick Cordero Dead (Photo-Instagram)

హాలీవుడ్ న‌టుడు టోనీ అవార్డు గ్రహిత నిక్ కార్డెరో క‌రోనా కార‌ణంగా తిరిగి రాని లోకాలకు తరలి వెళ్లారు. కోవిడ్-19 వైర‌స్‌తో 90 రోజుల సుదీర్ఘ పోరాటం త‌ర్వాత ఆదివారం ఆయ‌న (Nick Cordero Dead) శాశ్వ‌త విశ్రాంతి తీసుకున్నారు. 41 ఏళ్ల నిక్ ఏప్రిల్ ప్రారంభంలో క‌రోనా సోకడంతో లాస్ ఏంజిల్స్‌లోని సెడార్స్ సినాయ్ మెడిక‌ల్ సెంట‌ర్‌లో చికిత్స తీసుకున్నారు. ఈ క్ర‌మంలో గ‌త నెల‌ అత‌ని కుడికాలిలో ర‌క్తం గ‌డ్డం క‌ట్ట‌డంతో వైద్యులు ఆయ‌న‌ కాలును సైతం తీసేశారు. తాజాగా అత‌ని ఆరోగ్య ప‌రిస్థితి మ‌రింత‌ విష‌మించ‌డంతో ఆదివారం తుది శ్వాస విడిచారు. ఈ బాలీవుడ్‌ నిర్మాత బైసెక్సువల్‌, తనను ద్విలింగ సంపర్కుడిగా ప్రకటించుకున్న బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ వికాస్‌​ గుప్తా, గర్వంగా ఉందంటూ ట్విట్టర్ ద్వారా వెల్లడి

కాగా అత‌నికి భార్య‌ అమండ క్లూట్స్, ఏడాది వ‌య‌సున్న ఎల్విస్ ఎడ్యుర్డో ఉన్నారు. ఆయ‌న మ‌ర‌ణాన్ని భార్య అమండ ‌క్లూట్స్ ఆదివారం సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డిస్తూ భావోద్వేగానికి లోనైంది. "దేవుడు ఉండే స్వ‌ర్గానికి మ‌రొక‌రు చేరుకున్నారు. నా ప్రియ‌మైన భ‌ర్త నేడు ఉద‌యం చ‌నిపోయాడు. అత‌డు ఈ లోకాన్ని వ‌దిలిపెట్టే ముందు కుటుంబం అంతా ఎంత‌గానో ప్రార్థ‌న‌లు చేశాం. అయిన‌ప్ప‌టికీ మ‌మ్మ‌ల్ని వీడి వెళ్లిపోవ‌డాన్ని ఇప్ప‌టికీ జీర్ణించుకోలేక‌పోతున్నాను. కుమిలిపోతున్నాను. అత‌ను లేకుండా జీవితాన్ని ఊహించ‌లేక‌పోతున్నా అంటూ భావోద్వేగంతో ట్వీట్ చేశారు.

కార్డిరో.. బుల్లెట్స్ ఓవ‌ర్ బ్రాడ్‌వే, రాక్ ఆఫ్ ఏజెస్‌, వెయిట్ర‌స్‌, ఎ బ్రాంక్స్ టేల్ వంటి ప‌లు చిత్రాల్లో న‌టించారు. బుల్లితెర‌పై వ‌చ్చే బ్లూ బ్ల‌డ్స్, లా అండ్ ఆర్డ‌ర్‌: స‌్పెష‌ల్ విక్టిమ్స్ యూనిట్‌, లిలీహ్యామ‌ర్ సిరీస్‌లోనూ క‌నిపించారు. కాగా నిక్ కార్డెరో కెనడా నటుడు, బ్రాడ్‌వేలో రంగస్థల పాత్రలకు ప్రసిద్ది. 2014 బ్రాడ్‌వే మ్యూజికల్ బుల్లెట్స్ ఓవర్ బ్రాడ్‌వేలో చీచ్ పాత్రలో నటించినందుకు సంగీతంలో ఉత్తమ నటుడిగా టోనీ అవార్డుకు ఎంపికయ్యాడు. రెండుసార్లు డ్రామా డెస్క్ అవార్డులకు ఎంపికయ్యాడు. అతని కెరీర్‌లో టెలివిజన్ పాత్రలు, సినీ పాత్రలు చాలా ఉన్నాయి.

ఏప్రిల్ నెలలో హాలీవుడ్‌‌ నటుడు అలెన్‌ గార్ఫిల్డ్‌(80) కరోనా సమస్యల కారణంగా మంగళవారం కన్నుమూశారు. నాష్‌విల్లే, ది స్టంట్‌​ వంటి గొప్ప చిత్రాల్లో నటించిన అలెన్‌ మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. సినిమాల్లోకి రాకముందు అమెచ్యూర్‌ బాక్సర్‌గా, స్పోర్ట్స్‌ రిపోర్టర్‌గా పనిచేశారు. అలాగే కరోనా వైరస్‌తో పోరాడుతూ పాటల రచయిత, గాయకుడు ఆడమ్‌ ష్లెసింగర్‌(52) కరోనా సమస్యతో మరణించారు. ఆయన గ్రామీ, ఎమ్మీ అవార్డు గ్రహిత. అలాగే పాప్‌ రాక్‌బాండ్‌ ఫౌంటైన్స్‌ ఆఫ్‌ వేన్‌ సహ వ్యవస్థాపకుడు. ఆడమ్‌ మరణాన్ని ఇటీవల కరోనా బారిన పడిన నటుడు టామ్‌ హంక్స్‌ ట్విటర్‌ ద్వారా దృవీకరించారు.