Unstoppable With Pawan Kalyan: పవన్ నీ మూడు పెళ్లిళ్ల గోలేంటి? అన్ స్టాపబుల్ షో లో ఆసక్తికర సమాధానాలు చెప్పిన పవన్ కల్యాణ్

మూడు పెళ్లిళ్ల గొడవ (marriages) ఏమిటని బాలయ్య అడగ్గా.. పవన్ సమాధానం కోసం అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఇంతటి మానసిక సంఘర్షణకు గురైన పవన్ కల్యాణ్ పవర్ స్టార్ ఎలా అయ్యాడని బాలయ్య అడగడంతో ఈ ఎపిసోడ్‌పై మరింత ఆసక్తి క్రియేట్ అయ్యింది.

Unstoppable With Pawan Kalyan: పవన్ నీ మూడు పెళ్లిళ్ల గోలేంటి? అన్ స్టాపబుల్ షో లో ఆసక్తికర సమాధానాలు చెప్పిన పవన్ కల్యాణ్
PSPK on AHA (PIC @ Aha Twitter)

Hyderabad, JAN 27: ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బాలకృష్ణ (Balakrishna) వర్సెస్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్‌స్టాపబుల్-2 (Unstoppable 2) ఎపిసోడ్ స్ట్రీమింగ్‌కు ఎట్టకేలకు డేట్ ఫిక్స్ చేశారు షో నిర్వాహకులు. ఫిబ్రవరి 3న ఈ పవర్‌ఫుల్ ఎపిసోడ్‌కు సంబంధించిన ఫస్ట్ పార్ట్ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోతో మరోసారి ఈ టాక్ షోపై (Talk show) ఆసక్తిని పెంచేశారు. ఇక ఈ ప్రోమోను కూడా చాలా పవర్‌ఫుల్‌గా కట్ చేశారు. దీంతో బాప్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్స్‌గా ఈ ఎపిసోడ్ ఎందుకు మారబోతుందో మనకు ఈ ప్రోమో చూస్తే అర్థమవుతోంది. పవన్ కల్యాణ్ గ్రాండ్ ఎంట్రీతో అన్‌స్టాపబుల్ స్టేజీ దద్దరిల్లింది. అటుపై నిర్మాత బండ్ల గణేష్ తరుచూ చెప్పే పవన్ నామస్మరణ మంత్రాన్ని బాలయ్య ఇమిటేట్ చేయడం అందరినీ అవాక్కయ్యేలా చేసింది. పవన్ కూడా బాలయ్య అన్‌స్టాపబుల్ షో డైలాగ్‌తో అదరగొట్టాడు.

అయితే పవన్‌తో ముచ్చటించే క్రమంలో బాలయ్య పలు ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు అడిగాడు. గుడుంబా శంకర్ సినిమాలో ప్యాంటు పై ప్యాంటు వేసి పాతికేళ్లు వయసు తగ్గావంటూ పవన్‌ను మెచ్చుకున్నాడు. ఇక దర్శకుడు త్రివిక్రమ్ పవన్ మంచి ఫ్రెండ్స్ కదా అని బాలయ్య అడగ్గా… ఫ్రెండ్స్ అవ్వాల్సి వచ్చిందని పవన్ తెలిపాడు. కాగా, ఇంట్లో రామ్ చరణ్ పవన్‌తో అంత క్లోజ్ ఎలా అయ్యాడని బాలయ్య ప్రశ్నించగా.. ఇంట్లో తాను దొరికిపోవడంతో క్లోజ్ అవ్వాల్సి వచ్చిందని పవన్ చెప్పుకొచ్చాడు. అటుపై పవన్‌కు తన అమ్మంటే భయమా, భార్య అంటే భయమా అని అడగ్గా.. దీనికి పవన్ ఎలాంటి సమాధానం ఇచ్చాడా అనే క్యూరియాసిటీని క్రియేట్ చేశారు.

NBK X PSPK Part 1 Promo: అన్నయ్య రూంలోకి వెళ్లి పిస్టల్ తీసుకుని, పవన్ కళ్యాణ్ అన్‏స్టాపబుల్ ప్రోమో ఇదిగో.. సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో వీడియో.. 

ఆ తరువాత పవన్‌ను పలు సీరియస్ ప్రశ్నలు అడిగాడు బాలయ్య. మూడు పెళ్లిళ్ల గొడవ (marriages) ఏమిటని బాలయ్య అడగ్గా.. పవన్ సమాధానం కోసం అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఇంతటి మానసిక సంఘర్షణకు గురైన పవన్ కల్యాణ్ పవర్ స్టార్ ఎలా అయ్యాడని బాలయ్య అడగడంతో ఈ ఎపిసోడ్‌పై మరింత ఆసక్తి క్రియేట్ అయ్యింది. మొత్తానికి పవర్‌ఫుల్ ప్రోమోతో నిజంగానే బాప్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్స్‌గా ఈ ఎపిసోడ్ రానుందనే విషయంపై క్లారిటీ ఇచ్చారు ఆహా నిర్వాహకులు.



సంబంధిత వార్తలు

Pushpa-2 Stampede Row: సంధ్య థియేటర్‌ తొక్కిసలాట వ్యవహారంలో కీలక పరిణామం, థియేటర్‌కు షోకాజ్ నోటీసులు పంపిన సిటీ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌

Bigg Boss Season 8 Winner Nikhil: బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ నిఖిల్.. రన్నరప్ గా గౌతమ్.. నిఖిల్ కు రూ.55 లక్షల చెక్ అందించిన రామ్ చరణ్

Allu Arjun Reacts on Sri Tej Health: శ్రీ తేజ్ ఆరోగ్యంపై స్పందించిన అల్లు అర్జున్, ఆ కార‌ణాల‌తోనే అత‌న్ని క‌లువ‌లేక‌పోతున్నా.. అంటూ పోస్ట్

Bigg Boss Season 8: నేడు బిగ్‌ బాస్ సీజన్ 8 కు ఎండ్ కార్డ్.. 300 మంది పోలీసులతో భారీ భద్రత.. గత సీజన్ అనుభవాలను దృష్టిలో పెట్టుకునే..