Veera Simha Reddy Trailer Out: వీరసింహుడు వచ్చాడు! ఇక ఊచకోతే, ట్రైలర్‌తో సంక్రాంతి రేసులో హీటు పెంచిన బాలయ్య, ఇదెక్కడి మాస్ మావ అంటూ పిచ్చెక్కిపోతున్న ఫ్యాన్స్

శ్రుతి హాసన్, హనీ రోజ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ నెక్ట్స్ లెవెల్‌లో ఉండబోతుందని తెలుస్తోంది. సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ సినిమాతో బాలయ్య మరోసారి బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించేందుకు రెడీ అవుతున్నాడు.

veerasiomha reddy trailer (PIC @ Mytrhri movie makers Twitter)

Ongole, JAN 06: నందమూరి బాలకృష్ణ (Nandamuri balakrishna) నటిస్తున్న ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy ) సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్‌కు రెడీ అయ్యింది. దర్శకుడు గోపీచంద్ మలినేని (gopichand malineni) తెరకెక్కిస్తున్న ఈ సినిమా పూర్తి ఫ్యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతుంది. ఇక ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుకను ఒంగోలులో నిర్వహిస్తోంది చిత్ర యూనిట్. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేసింది. వీరసింహారెడ్డి ట్రైలర్ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో వెయిట్ చేస్తున్నారో.. వారి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ ట్రైలర్‌ను (Veera Simha Reddy trailer) కట్ చేశారు చిత్ర యూనిట్. ఈ ట్రైలర్‌లో బాలయ్య రెండు విభిన్నమైన గెటప్స్‌లో సందడి చేయగా, పవర్‌ఫుల్ ఫ్యాక్షన్ లీడర్‌గా బాలయ్య లుక్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక ఆయన నోటివెంట పవర్‌ఫుల్ డైలాగులు పేలాయి.

‘‘నాది ఫ్యాక్షన్ కాదు.. సీమ మీద ఎఫెక్షన్… పుట్టింది పులిచర్ల, చదివింది అనంతపురం, రూలింగ్ కర్నూల్.. అప్పాయింట్మెంట్ లేకుండా వస్తే.. అకేషన్ చూడను.. లొకేషన్ చూడను… ఒంటి చేత్తో ఊచకోత.. కోస్తా నా కొడకా..’’ వంటి డైలాగులను మరింత పవర్‌ఫుల్‌గా చెప్పుకొచ్చాడు బాలయ్య. ఇక ఈ సినిమాలో ఏపీ పాలిటిక్స్‌పై బాలయ్య తనదైన స్టయిల్‌లో ఓ డైలాగ్ విసిరాడు. ‘సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో.. కానీ ఆ చరిత్ర సృష్టించినవాడి పేరు మారదు.. మార్చలేరు..’’ అంటూ చెలరేగిపోయాడు బాలయ్య. ఇలా చాలా పవర్‌ఫుల్ డైలాగులతో బాలయ్య అభిమానులకు అదిరిపోయే మాస్ ట్రీట్ అందించాడు.

 

ఇక ఈ సినిమాలో దునియా విజయ్, వరలక్ష్మీ శరత్ కుమార్‌లు నెగెటివ్ పాత్రల్లో తమదైన పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. శ్రుతి హాసన్, హనీ రోజ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ నెక్ట్స్ లెవెల్‌లో ఉండబోతుందని తెలుస్తోంది. సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ సినిమాతో బాలయ్య మరోసారి బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించేందుకు రెడీ అవుతున్నాడు.



సంబంధిత వార్తలు

MP Kiran Kumar Reddy: అల్లు అర్జున్‌పై ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్, బన్నీ రియల్ హీరో కాదు, స్క్రిప్ట్ తీసుకొచ్చి చదివారని ఆగ్రహం వ్యక్తం చేసిన భువనగిరి ఎంపీ

CM Revanth Reddy: సర్వమత సమ్మేళనంం తెలంగాణ, మత విద్వేషాలు రెచ్చగోడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన సీఎం రేవంత్ రెడ్డి, క్రిస్టియన్ల సంక్షేమం- అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామన్న సీఎం

Pawan Kalyan Welcome Film Industry To AP: ఏపీలో షూటింగ్స్ చేయండి! సినీ ఇండస్ట్రీకి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆహ్వానం, అల్లు అర్జున్ పై రేవంత్ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ప్రాధాన్య‌త సంత‌రించుకున్న కామెంట్స్

Allu Arjun on Sandhya Theater Row: అందుకే శ్రీ‌తేజ్ ను ప‌రామ‌ర్శించేందుకు వెళ్ల‌లేదు, నేను ఆ రోజు అస్స‌లు రోడ్ షో చేయ‌లేదు, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌ల‌పై స్పందించిన అల్లు అర్జున్

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif