Vishwak Sen Getting Married: పెళ్లిపీటలెక్కనున్న మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్, ఇన్‌స్టాలో పోస్ట్ వైరల్, త్వరలోనే పూర్తి వివరాలంటూ సస్పెన్స్‌

ఇటీవల శర్వానంద్ (Sharwanand) ఏడడుగులు వేయగా, వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ రింగ్ మార్చుకొని మూడు ముళ్ళు వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) కూడా పెళ్ళికి సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది.

Vishwak Sen (Credits: Twitter)

Hyderabad, AUG 13: టాలీవుడ్ ఒక్కో యంగ్ హీరో పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. ఇటీవల శర్వానంద్ (Sharwanand) ఏడడుగులు వేయగా, వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ రింగ్ మార్చుకొని మూడు ముళ్ళు వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) కూడా పెళ్ళికి సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం గామి, VS10, VS11 మూడు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ హీరో.. చేసిన ఒక పోస్టు చూస్తుంటే పెళ్లి అప్డేట్ కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది. “ఇన్నాళ్ల నుంచి నా పై ప్రేమ చూపించే అభిమానులకు, శ్రేయోభిలాషులకు ఎప్పటికి రుణపడి ఉంటాను. ఇక ఇప్పుడు మీ అందరితో ఒక విషయం షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. నా జీవితంలోని మరో ఘటాన్ని నేను ప్రారభించబోతున్నాను. నేను కుటుంబాన్ని మొదలుపెట్టబోతున్నాను. ఆగష్టు 15న పూర్తి వివరాలు తెలియజేస్తాను” అంటూ పేర్కొన్నాడు. ఈ పోస్టు చూస్తుంటే పెళ్లి వార్తలాగానే (Vishwak Sen marriage) ఉందని అనిపిస్తుంది. అయితే ఈ మాస్ కా దాస్ ని వరించబోయే ఆ వధువు ఎవరో తెలుసుకోవాలంటే మరో రెండు రోజులు ఎదురు చూడాల్సిందే.

 

 

View this post on Instagram

 

A post shared by Vishwak Sen (@vishwaksens)

ఇక విశ్వక్ సినిమాల విషయానికి వస్తే.. గామి షూటింగ్ పూర్తి అయ్యిపోయి పోస్టు ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో విశ్వక్ అఘోరగా కనిపించబోతున్నాడు. చాందిని చౌదరి ఫీమేల్ లీడ్ లో నటిస్తుంది. VS10 చిత్రం కొత్త దర్శకుడు రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతుండగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. కృష్ణచైతన్య ద‌ర్శ‌క‌త్వంలో VS11 ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ టైటిల్ తో రా అండ్ రస్టిక్ గా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. అంజలి, నేహశెట్టి హీరోయిన్స్ గా కనిపించబోతున్న ఈ సినిమాలో విశ్వక్ మాస్ లుక్ లో కనిపించబోతున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన టైటిల్ గ్లింప్స్ అందర్నీ ఆకట్టుకుంది.



సంబంధిత వార్తలు

Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్..నూతన సంవత్సరం కానుకగా పవన్ పాడిన పాట రిలీజ్ చేయనున్న హరిహర వీరమల్లు మేకర్స్!

Geetha Arts Express Gratitude To TG Govt: సీఎం రేవంత్ రెడ్డికి కృత‌జ్ఞ‌త‌లు! అల్లు అర‌వింద్ నేతృత్వంలోని గీతా ఆర్ట్స్ పోస్ట్, ఇంకా ఏమ‌న్నారంటే?

Tollywood Film Industry Meet CM Revanth Reddy: ప్రభుత్వంపై నమ్మకం ఉంది...గ్లోబల్ స్థాయికి సినిమా పరిశ్రమ, ఎలక్షన్‌ రిజల్ట్‌ లాగే సినిమా రిలీజ్‌ ఫస్ట్‌డే ఉంటుందన్న నిర్మాతలు..సీఎం రేవంత్‌తో కీలక అంశాల ప్రస్తావన

CM Revanth Reddy: తెలంగాణలో ఇకపై బెనిఫిట్‌ షోలు ఉండవు..సినీ పెద్దలతో తేల్చిచెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ హీరోగా ఉండాలని సూచించిన తెలంగాణ సీఎం