Vishwak Sen New Movie: సినిమా మొత్తం లేడీ గెట‌ప్ లో న‌టించ‌నున్న స్టార్ హీరో, బ‌ర్త్ డే సంద‌ర్భంగా టైటిల్ కూడా రిలీజ్ చేసిన యూనిట్

ఈ మూవీలో విశ్వక్ లేడీ గెటప్ లో కనిపించబోతున్నారట. మాస్ అపిరెన్స్ తో కమర్షియల్ గా మంచి ఇమేజ్ ని సొంతం చేసుకున్న విశ్వక్.. అప్పుడప్పుడు ప్రయోగాలు కూడా చేస్తుంటారు. ఈక్రమంలోనే గామి, అశోకవనంలో అర్జున కళ్యాణం, ఓరి దేవుడా, ముఖచిత్రం వంటి సినిమాల్లో కూడా నటిస్తూ.. నటుడిగా తన వేర్సాటిలిటీని పరీక్షించుకుంటూ ఉంటారు.

Vishwak Sen (Photo-X)

Hyderabad, March 29: టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) పుట్టినరోజు కావడంతో.. నేడు తన కొత్త సినిమాల నుంచి అప్డేట్స్ వస్తున్నాయి. ప్రస్తుతం విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ అనే మాస్ కమర్షియల్ మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రంతో పాటు కల్ట్, VS10, VS12 మూవీస్ చేస్తున్నారు. వీటిలో VS12 మూవీని షైన్ స్క్రీన్ నిర్మాణ సంస్థ నిర్మిస్తుంది. నేడు విశ్వక్ బర్త్ డే (Vishwak Sen Birthday) సందర్భంగా ఈ మూవీ టైటిల్ ని అనౌన్స్ చేసారు. ఈ సినిమాకి ‘లైలా’ (Laila) అనే టైటిల్ ని పెట్టారు. మూవీలో లైలా మరెవరో కాదు విశ్వక్ సేనే. ఈ మూవీలో విశ్వక్ లేడీ గెటప్ లో కనిపించబోతున్నారట. మాస్ అపిరెన్స్ తో కమర్షియల్ గా మంచి ఇమేజ్ ని సొంతం చేసుకున్న విశ్వక్.. అప్పుడప్పుడు ప్రయోగాలు కూడా చేస్తుంటారు. ఈక్రమంలోనే గామి, అశోకవనంలో అర్జున కళ్యాణం, ఓరి దేవుడా, ముఖచిత్రం వంటి సినిమాల్లో కూడా నటిస్తూ.. నటుడిగా తన వేర్సాటిలిటీని పరీక్షించుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే లైలా కూడా చేస్తున్నారు.

 

రామ్ నారాయణ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఆకాంక్ష శర్మ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. తనిష్క్ బఘ్చి సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ని మొదలు పెట్టి పూర్తి చేయనున్నారు. కాగా గతంలో ఇలా లేడీ గెటప్ లో చిరంజీవి, రాజేంద్రప్రసాద్, కమల్ హాసన్, మనోజ్, నరేష్, అల్లు అర్జున్.. వంటి స్టార్స్ కనిపించి మెప్పించారు. మరి ఇప్పుడు విశ్వక్ ఎంతవరకు ఆకట్టుకుంటారో చూడాలి.



సంబంధిత వార్తలు

All We Imagine As Light: నటి దివ్య ప్రభ న్యూడ్ సీన్స్ లీక్, ఎక్స్‌లో వైరల్‌గా మారిన వీడియోలు..'ఆల్ వి ఇమాజిన్ యాజ్ ఏ లైట్ ' సినిమాలో బోల్డ్ పాత్రలో నటించిన దివ్య

OTP Messages May Get Delayed: డిసెంబర్ 1 నుండి ఓటీపీ మెస్సేజ్‌లు ఆలస్యం, ట్రాయ్ కొత్త నిబంధనలు..ఎందుకో తెలుసా?

TG Weather Update: తెలంగాణపై చలి-పులి పంజా.. అన్ని జిల్లాల్లో 15 డిగ్రీలలోపు రాత్రి ఉష్ణోగ్రతలు.. కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌ (యూ)లో రికార్డు స్థాయిలో 8.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు.. రానున్న మూడ్రోజుల్లో ఇంకా పడిపోనున్న ఉష్ణోగ్రతలు

Rains in AP: బంగాళాఖాతంలో వాయుగుండం.. నేటి నుంచి ఏపీలో భారీ వర్షాలు.. ఈ నెల 29 వరకు వానలే వానలు.. దక్షిణ కోస్తాలో ఈదురుగాలులు