Actress Soumya Shetty Arrest: రిటైర్డ్ ఉద్యోగి ఇంట్లో బంగారం, నగదు చోరీ చేసిన సినీ నటి సౌమ్య శెట్టి.. అనంతరం గోవాలో జల్సాలు.. ఎట్టకేలకు పోలీసుల అరెస్టు

బంగారం, నగదు చోరీ కేసులో టాలీవుడ్ నటి సౌమ్య శెట్టిని విశాఖ పోలీసులు గోవాలో అరెస్ట్ చేశారు.

Soumya Shetty (Credits: X)

Vizag, Mar 4: బంగారం (Gold), నగదు చోరీ కేసులో టాలీవుడ్ నటి సౌమ్య శెట్టిని (Tollywood Actress Soumya Shetty) విశాఖ పోలీసులు గోవాలో అరెస్ట్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విశాఖపట్నంలో ప్రసాద్ అనే రిటైర్డ్ పోస్టల్ ఉద్యోగి కుటుంబంతో నివసిస్తున్నాడు. ఆయనకు ఒక కుమార్తె ఉంది. ఆ అమ్మాయితో సౌమ్య శెట్టి సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పరచుకుంది. అలా ఫ్రెండ్ పేరిట తరచుగా ప్రసాద్ ఇంటికి వచ్చేది. ఈ క్రమంలోనే ఒక రోజు ప్రసాద్ ఇంట్లో కిలో బంగారం, నగదు చోరీకి గురయ్యాయి. అప్పటినుంచి సౌమ్య శెట్టి వారి ఇంటికి రావడం మానేసింది. దీంతో సౌమ్య శెట్టిపై అనుమానం వ్యక్తం చేసిన ప్రసాద్ కుటుంబం..  పోలీసులను ఆశ్రయించింది.

Varalaxmi Sarathkumar Engagement: 38 ఏళ్ల వ‌య‌స్సులో పెళ్లిపీట‌లెక్క‌బోతున్న తెలుగు లేడీ విల‌న్, నిశ్చితార్ధం ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్, ఇంత‌కీ పెళ్లికొడుకు ఎవ‌రంటే?

అలా దొంగ అవతారం

పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో సౌమ్యశెట్టి గోవాలో ఉన్నట్టు వెల్లడైంది. కొట్టేసిన సొమ్ముతో ఆమె అక్కడ ఎంజాయ్ చేస్తున్నట్టు గుర్తించారు. దీంతో గోవా పోలీసుల సహకారంతో సౌమ్యను అదుపులోకి తీసుకొన్న పోలీసులు విశాఖకు  తరలించారు. కాగా, సౌమ్య శెట్టి గతంలో 'ది ట్రిప్', 'యువర్స్ లవింగ్లీ' వంటి పలు చిత్రాల్లో నటించింది. అవకాశాలు రాకపోవడంతో ఇలా అడ్డదారి తొక్కినట్టు సమాచారం.

PM Modi Telangana Visit: నేడే మోదీ రెండ్రోజుల తెలంగాణ టూర్ ప్రారంభం.. నేడూ, రేపు ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో పర్యటన.. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు.. ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం