Yuvraj on Sanjay Dutt Health: నీ బాధ నాకు తెలుసు దత్, క్యాన్సర్‌ మహమ్మారి నుంచి తొందరగా కోలుకోవాలి, ఆ దేవుడిని మనస్పూర్తిగా కోరుకుంటున్నానంటూ యువరాజ్ సింగ్ ట్వీట్

నువ్వు ఒక ఫైటర్‌లా కనిపిస్తావు. నీ బాధ తెలుసుకున్నా.. ఆ నొప్పి ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను.. ఎందుకంటే నేను స్వయంగా అనుభవించాను. కానీ ఆ నొప్పిని భరించేందుకు నువ్వు మరింత ధృడంగా తయారవ్వాలి.. క్యాన్సర్‌ మహమ్మారి నుంచి తొందరగా కోలుకోవాలని ఆ దేవుడిని మనస్పూర్తిగా కోరుకుంటున్నా' అంటూ ట్వీట్‌ చేశాడు.

Sanjay Dutt and Yuvraj Singh (Photo Credits: Twitter/Getty Images)

బాలీవుడ్‌ నటుడు సంజయ్ ‌దత్‌ గత ఆదివారం అనారోగ్య సమస్యతో ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చేరిన సంగతి విదితమే. అనధికారిక సమాచారం మేరకు సంజయ్‌ దత్‌ (Sanjay Dutt) ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనకు క్యాన్సర్‌ (Sanjay Dutt Lung Cancer) 4వ దశలో ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించి చికిత్స చేయించుకోవడానికి మంగళవారం రాత్రి అమెరికా వెళ్లినట్లు బాలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి.

దీనిపై ఇంకా ఎటువంటి స్పష్టత లేదు. అందరూ సంజయ్ దత్ త్వరగా కోలుకోవాలని ట్విట్టర్ వేదికగా ట్వీట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ డాషింగ్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ (Yuvraj Singh) కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. సంజయ్‌ దత్‌ క్యాన్సర్‌ నుంచి త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. వికాస్ దూబేపై వెబ్ సిరీస్‌, పొలిటికల్ థ్రిల్లర్ పాయింట్‌ను చూపిస్తానంటున్న దర్శకుడు హన్సల్ మెహతా, ప్రాజెక్ట్ కోసం హక్కులను కొనుగోలు చేసిన శైలేష్ కర్మ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్

'సంజయ్‌ దత్‌.. నువ్వు ఒక ఫైటర్‌లా కనిపిస్తావు. నీ బాధ తెలుసుకున్నా.. ఆ నొప్పి ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను.. ఎందుకంటే నేను స్వయంగా అనుభవించాను. కానీ ఆ నొప్పిని భరించేందుకు నువ్వు మరింత ధృడంగా తయారవ్వాలి.. క్యాన్సర్‌ మహమ్మారి నుంచి తొందరగా కోలుకోవాలని ఆ దేవుడిని మనస్పూర్తిగా కోరుకుంటున్నా' అంటూ ట్వీట్‌ చేశాడు. ​గతంలో యువరాజ్‌ కూడా లంగ్‌ క్యాన్సర్‌ బారీన పడిన సంగతి తెలిసిందే. 2011 ప్రపంచకప్‌ అనంతరం యువరాజ్‌ లండన్‌ వెళ్లి శస్త్రచికిత్స తీసుకొని విజయవంతంగా క్యాన్సర్‌ను జయించాడు.

Yuvraj Singh Wishes Sanjay Dutt Speedy Recovery

సంజయ్ దత్ ఆదివారం శ్వాస సంబంధిత ఇబ్బందితో లీలావతి ఆస్పత్రికి వెళ్లగా కరోనా టెస్ట్ చేశారు. అయితే అది నెగిటివ్ వచ్చింది. అయితే సమస్య ఎక్కువ కావడంతో మళ్లీ ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకుంటే ఊపిరితిత్తుల క్యాన్సర్‌ నిర్ధారణ అయ్యిందని తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. వ్యాధి గురించి చెప్పకుండా నా వైద్య నిమిత్తం చిన్న విరామం తీసుకుంటున్నానని తెలిపారు.

Sanjay Dutt Takes Break From Work

ఇన్‌స్టాలో.. 'హాయ్‌ ఫ్రెండ్స్‌...వైద్యం నిమిత్తం నేను పని నుంచి చిన్న విరామం తీసుకుంటున్నాను.నా కుటుంబం, మిత్రులు తోడుగా ఉన్నారు. నా గురించి ఆందోళన చెందవద్దు, ఊహాగానాలు చేయవద్దని శ్రేయోభిలాషులకు విజ్ఞప్తి చేస్తున్నా. మీ అందరి ప్రేమాభిమానాలతో త్వరలోనే తిరిగివస్తా’ అని ట్వీట్ చేశారు.