Priya Prakash Wink Again: మళ్లీ కన్నుకొట్టిన మలయాళీ ముద్దుగుమ్మ, వైరల్ అవుతున్న వీడియో, విష్ణుప్రియ సినిమాతో కన్నడకు పరిచయం, ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్

మళయాళీ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్ వారియర్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఒరు అదార్ లవ్ సినిమాలో కన్ను కొట్టిన సీన్ యువకులను, పెద్దలను పిచ్చివాళ్లను చేసింది.కొంటెగా కన్నుగీటి కుర్రకారుని మైకంలో ముంచేసింది. ఇప్పుడు ఆమె ప్రస్తావన ఎందుకంటారా..మళ్లీ ఆ ముద్దుగుమ్మ కన్నుకొట్టింది.

priya-prakash-varrier-wink-again-video-viral-on-internet (Twitter and instagram)

November 1: మళయాళీ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్ వారియర్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఒరు అదార్ లవ్ సినిమాలో కన్ను కొట్టిన సీన్ యువకులను, పెద్దలను పిచ్చివాళ్లను చేసింది.కొంటెగా కన్నుగీటి కుర్రకారుని మైకంలో ముంచేసింది. ఇప్పుడు ఆమె ప్రస్తావన ఎందుకంటారా..మళ్లీ ఆ ముద్దుగుమ్మ కన్నుకొట్టింది. తన ఎక్స్‌ప్రెషన్స్‌తో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రియా వారియర్ మళ్లీ కన్నుకొట్టిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తను మళ్లీ కన్నుకొడుతున్న వీడియోని ప్రియా ప్రకాష్ వారియర్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఓ వీడియోను షేర్ చేసింది. ఇంకేముంది. యూత్ అంతా ఆ వీడియోని తెగ షేర్ చేసేస్తున్నారు.

కాగా గతంలో కన్నుకొట్టి కుర్రకారు మనసులు కొల్లగొట్టిన ప్రియా ఈ వీడియోలోనూ అదే స్థాయిలో అలరించేలా కనిపిస్తోంది. ‘విష్ణుప్రియ’ అనే సినిమాతో ఈ భామ కన్నడ పరిశ్రమకు పరిచయమవుతోంది. ఇందులో శ్రేయాస్ మంజు హీరోగా నటిస్తుండగా, వీకే ప్రకాష్ డైరెక్ట్ చేస్తున్నాడు.. గోపి సుందర్ సంగీతమందిస్తున్నాడు.

మళ్లీ కన్నుకొట్టిన మళయాళీ ముద్దుగుమ్మ

 

View this post on Instagram

 

Can’t thank the whole team of VishnuPriya enough for making this birthday special!Do watch the small sneak peek of it.Link in my bio.#vkprakash film#kmanju productions

A post shared by Priya Prakash Varrier💫 (@priya.p.varrier) on

ప్రియాకు బర్త్‌డే విషెస్ చెబుతూ విష్ణుప్రియ మూవీ టీమ్ రిలీజ్ చేసిన వీడియోను ప్రియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ వీడియోలో వర్షంలో తడుస్తూ తన స్టైల్‌లో కన్ను కొడుతూ కనిపిస్తోంది ప్రియా వారియర్. వచ్చే ఏడాది ‘విష్ణుప్రియ’ మూవీ అభిమానులను అలరించనుంది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now