Rajinikanth Sudden Trip: మళ్లీ హిమాలయాలకు వెళ్లిన తలైవార్, 10 రోజులు అక్కడే, షూటింగ్ పూర్తి చేసుకున్న దర్బార్, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న రజినీకాంత్ ఫోటోలు

సూపర్ స్టార్‌గా , అంతకు మించిన మంచి మనిషిగా కోట్లాది హృదయాలను దోచుకున్న రజనీ కాంత్ వ్యక్తిగత జీవితంలో ఎప్పుడూ నిరాడంబరంగానే ఉంటాడనే విషయం తెలిసిందే.

Superstar Rajinikanth's sudden trip to the Himalayas (Photo-Twitter)

Mumbai, October 13: సూపర్ స్టార్‌గా , అంతకు మించిన మంచి మనిషిగా కోట్లాది హృదయాలను దోచుకున్న రజనీ కాంత్ వ్యక్తిగత జీవితంలో ఎప్పుడూ నిరాడంబరంగానే ఉంటాడనే విషయం తెలిసిందే. మేకప్ తీసేస్తే ఆయన ఓ సాదా సీదా మనిషి. మంచితనంతో మూర్తీభవించిన ఉన్నతమైన వ్యక్తి. తనను అభిమానించే ప్రజలు కష్టాల్లో ఉన్నారంటే ప్రతి సారి నేనున్నానంటూ స్పందించటం రజనీకి అలవాటు. అందుకే ఆయన అభిమానుల గుండెల్లో దైవంగా నిలిచాడు. సూపర్ స్టార్ రజినీకాంత్‌‌కు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. ఏడాదికి ఒకసారి సమయం దొరికినప్పుడల్లా హిమాలయాలకు వెళ్లి ప్రశాంతంగా దైవారాధన చేసుకొని చుట్టూ ఉన్న పరిసరాల్ని చూసుకొని తీరిగ్గా వస్తారు. ఇందులో భాగంగా రజినీకాంత్ 10 రోజులు హిమాలయాలకు వెళ్లారు.

ఏ.ఆర్.మురగదాస్ దర్శకత్వంలో ‘దర్బార్‘ సినిమాని మొదలు పెట్టిన రజనీకాంత్ గారు తన వంతు షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్నారు. డబ్బింగ్ పనులు తప్ప ఇంకేం బాధ్యతలు లేవు. దర్బార్ సినిమా షూటింగ్ అయిపోయిన వెంటనే ‘శివ’ గారి దర్శకత్వంలో రజనీకాంత్ సినిమా చేయబోతున్నారు.

ఫ్లైట్‌లో హిమాలయాలకు వెళుతున్న రజినీకాంత్ 

ఇలా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతున్నా సమయంలో కొంత రిలీఫ్ కోసం మరోసారి హిమాలయాలకు వెళ్లిపోయారు. హిమాలయాల నుండి తిరిగి వచ్చిన తర్వాతనే వారి తదుపరి సినిమా గురించి ఆలోచించనున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. సన్ పిక్చర్స్ నిర్మాణంలో ‘శివ’ గారు డైరెక్ట్ చేయబోయే సినిమా రజనీకాంత్ గారి హిమాలయాల పర్యటన తర్వాత మొదలు కాబోతుంది. ఆయన హిమాలయాలకు వెళుతున్న ఫోటోలు ఇప్పుడు ట్విట్టర్లో వైరల్ అయ్యాయి.



సంబంధిత వార్తలు

Sandhya Theatre Stampede Case: వీడియో ఇదిగో, ఇరవై రోజుల తర్వాత స్పృహలోకి వచ్చిన శ్రీతేజ్, అల్లు అర్జున్, తెలంగాణ ప్రభుత్వం మాకు మద్దతు ఇస్తున్నారని తెలిపిన తండ్రి భాస్కర్

Sandhya Theatre Stampede Case: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో మొత్తం నిందితుల జాబితా ఇదే, ఏ-1 నుంచి ఏ-8 వరకు సంధ్య థియేటర్ యాజమాన్యం, ఏ-18గా మైత్రీ మూవీస్‌

Rozgar Mela: రోజ్‌గార్ మేళా, 71 వేల మందికి నియామక పత్రాలు అందజేసిన ప్రధాని మోదీ, ఏడాదిన్న‌ర‌లో 10 ల‌క్ష‌ల ప‌ర్మ‌నెంట్ ఉద్యోగాలు ఇచ్చామని వెల్లడి

Amazon Prime Video New Rules: అమెజాన్ ప్రైమ్ వినియోగ‌దారుల‌కు బ్యాడ్ న్యూస్, పాస్ వ‌ర్డ్ షేరింగ్ పై జ‌న‌వ‌రి నుంచి కొత్త‌గా రెండు నిబంధ‌న‌లు తెస్తున్న సంస్థ‌