Dhee Choreographer Suicide: ఢీ కొరియోగ్రాఫర్ లైవ్ సూసైడ్, అప్పులు కట్టలేక చనిపోతున్నా అంటూ వీడియో, ఢీ షో కంటే జబర్ధస్త్‌లోనే ఎక్కువ డబ్బులు వస్తున్నాయ్!
అంతకుముందు ఒక సెల్ఫీ వీడియో చిత్రీకరించాడు. యువ డ్యాన్స్ మాస్టర్ ఆత్మహత్యకు (Committed Suicide) పాల్పడిన ఘటన అందరినీ విషాదంలో నెట్టేసింది. ఢీ షో (Dhee show) డ్యాన్స్ కొరియోగ్రాఫర్ చైతన్య (Chaitanya) ఆత్మహత్య చేసుకున్నాడు.
Nellore, April 30: ఢీ షోలో (Dhee show) డ్యాన్స్ కొరియోగ్రాఫర్‌గా రాణిస్తున్న చైతన్య నెల్లూరులోని క్లబ్ హోటల్ లో సూసైడ్ చేసుకున్నాడు. అంతకుముందు ఒక సెల్ఫీ వీడియో చిత్రీకరించాడు. యువ డ్యాన్స్ మాస్టర్ ఆత్మహత్యకు (Committed Suicide) పాల్పడిన ఘటన అందరినీ విషాదంలో నెట్టేసింది. ఢీ షో (Dhee show) డ్యాన్స్ కొరియోగ్రాఫర్ చైతన్య (Chaitanya) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు చైతన్య సెల్పీ వీడియో తీసుకున్నాడు. పాపులర్ డ్యాన్స్ షో ఢీలో కొరియోగ్రాఫర్‌గా మంచి ఫేం సంపాదించిన చైతన్య ఆత్మహత్య చేసుకోవడం సర్వత్రా చర్చయాంశంగా మారింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే చైతన్య ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది.
Kantara 2: ఫుల్ స్వింగ్‌లో కాంతార 2 పనులు.. భూతకోలలో పాల్గొన్న రిషబ్ శెట్టి
ఒక అప్పును కట్టేందుకు మరో అప్పు చేయడంతో అప్పులు పెరిగిపోయాయని.. అప్పులిచ్చిన వాళ్ల నుంచి వస్తున్న ఒత్తిడి తట్టుకోలేకపోతున్నానని, ఎంత ప్రయత్నం చేసినా తన వల్ల కావడం లేదని చైతన్య ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ పని చేస్తున్నందుకు తన తల్లిదండ్రులు, సహచర డ్యాన్స్ మాస్టర్లు, డ్యాన్సర్లకు క్షమాపణలు చెప్పాడు చైతన్య. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు చైతన్య మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఢీ షో తనకి ఎంతో ఫేమ్ ని సంపాదించి పెట్టిందని, అందుకు రుణపడి ఉంటానని తెలిపిన చైతన్య.. ఢీ షోలో సంపాదన చాలా తక్కువ ఇస్తున్నారని వెల్లడించాడు. ఢీ కంటే జబర్దస్త్ షోలోనే ఎక్కువ మనీ ఇస్తారంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సెల్ఫీ వీడియో అనంతరం నెల్లూరు క్లబ్ హోటల్ లోనే చైతన్య ఉరేసుకొని చనిపోయాడు.