Hyderabad, April 30: కన్నడ హీరో రిషబ్ శెట్టి (Rishab Shetty) నటించిన కాంతార (Kantara) సినిమా విడుదలైన అన్ని భాషల్లో సూపర్ హిట్ (Super Hit) గా నిలిచింది. కేవలం 16 కోట్లతో తెరకెక్కిన ఈ దాదాపు 400 కోట్ల వరకు వసూల్ చేసింది. దీంతో ఇప్పుడు ప్రేక్షకులంతా కాంతార 2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే కాంతారా కు సీక్వెల్ ను తెరకెక్కించనున్నారు. నిజానికి ఇది ప్రీక్వెల్. ఇప్పటికే డైరెక్టర్ కమ్ హీరో రిషబ్ శెట్టి ఈ ప్రీక్వెల్ కోసం కథను సిద్ధం చేసేశారు. తాజాగా ఈ సినిమా గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు రిషబ్ శెట్టి. ఈ పనులు ఫుల్‌ స్వింగ్‌లో జరుగుతున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయని తెలుస్తుంది. రీసెంట్ భూతకోల వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో హీరో రిషబ్ శెట్టి కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయనే ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియా వైరల్ గా మారింది.

Yadadri Laxminarasimha Swamy Temple: యాదాద్రిలో ఎల్లుండి నుంచి శ్రీ నరసింహస్వామి జయంత్యుత్సవాలు.. మే 2 నుంచి 4 వరకు నిత్య కల్యాణం, శ్రీ సుదర్శన హోమం నిలిపివేత

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)