Thalaiva On Discovery: దుమ్మురేపుతోన్న రజినీకాంత్ సాహసాలు , మ్యాన్ వర్సెస్ వైల్డ్ ప్రోమో విడుదల చేసిన డిస్కవరీ ఛానల్, మార్చి 23 రాత్రి 8గంటలకు ప్రసారం కానున్న పోగ్రాం

ఈ ఎపిసోడ్లను ప్రసారం చేయబోతున్న డిస్కవరీ ఛానల్ (Discovery) యాజమాన్యం ఈ టీజర్‌ను గురువారం ఉదయం ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.

Into The Wild With Bear Grylls and Rajinikanth (Photo Credits: Twitter)

Hyderabad, Febyary 27: దక్షిణాది సూపర్‌స్టార్ రజినీకాంత్ (Rajinikanth) బేర్ గ్రిల్స్‌తో కలిసి నటించిన మ్యాన్ వర్సెస్ వైల్డ్ (Man vs Wild) అడ్వెంచర్ యాక్షన్ ప్యాక్డ్ ఎపిసోడ్స్ టీజర్ (Into the Wild With Bear Grylls And Rajinikanth) విడుదలైంది. ఈ ఎపిసోడ్లను ప్రసారం చేయబోతున్న డిస్కవరీ ఛానల్ (Discovery) యాజమాన్యం ఈ టీజర్‌ను గురువారం ఉదయం ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.

మ్యాన్ Vs వైల్డ్ షూటింగ్‌లో తాను గాయపడ్డానన్న వార్తల్లో నిజం లేదన్న రజినీ

కర్ణాటకలోని పశ్చిమ కనుమల్లో చిత్రీకరించిన ఈ సాహసకృత్యాలకు సంబంధించిన ఎపిసోడ్లు తలైవా ఫ్యాన్స్‌కు విందు భోజనాన్ని పెట్టనున్నాయి. పశ్చిమ కనుమల అందాల మధ్య తలైవా యాక్షన్ సీన్స్.. కనువిందు చేయబోతున్నాయి.

అడ్వెంచరస్ షోకి కేరాఫ్ అడ్రస్ అయిన డిస్కవరీ ఛానల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మ్యాన్ వర్సెస్ వైల్డ్ షో హోస్ట్ బేర్ గ్రిల్స్ చేసే సాహసాలను చూసేందుకు చాలామంది ఎంతో ఇంట్రెస్ట్ చూపుతారు. ఇంతకు ముందు ఇండియా నుంచి ప్రధాని నరేంద్ర మోడీ ( PM Modi) ఈ షోలో పాల్గొనగా ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా సాహసం చేసి బేర్ గ్రిల్స్‌తో (Bear Grylls) కలిసి కర్ణాటక బందీపూర్ అడవుల్లో షూటింగ్‌లో పాల్గొన్నాడు.

Watch The Teaser Video Here:

కాగా తలైవా అడ్వెంచర్స్ చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రోగ్రాం ప్రసారంపై ప్రోమో రిలీజ్ చేసిన డిస్కవరీ ఛానల్.. బేర్ గ్రిల్స్, రజినీకాంత్‌లతో భారత అరణ్యంలోకి ప్రవేశించేందుకు మీరు సిద్ధమా? అంటూ అల్టీమేట్ ప్రోమోను విడుదల చేసింది. దీంతో తలైవా ఆన్ డిస్కవరీ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది.

డిస్కవరీ చరిత్రలోనే ఇలాంటి మాస్ ప్రోమోను చూడలేదని అంటున్న ఫ్యాన్స్.. తలైవా (Thalaiva On Discovery) అంటే ఆ మాత్రం క్రేజ్ ఉంటుందంటున్నారు. మార్చి 23 రాత్రి 8గంటలకు ప్రసారమయ్యే ఈ షో రికార్డ్స్ బ్రేక్ చేయడం ఖాయమంటున్నారు.

ప్రధాని మోదీ తరువాత రజినీకాంత్

40 సెకెన్ల నిడివి ఉన్న మ్యాన్ వర్సెస్ వైల్డ్ టీజర్‌ను ట్విట్టర్‌లో షేర్ చేసిన కొన్ని నిమిషాల్లోనే లక్షలాది మంది తిలకించారు. రజినీ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. కర్ణాటకలోని చామరాజ నగర జిల్లా బండీపూర్ అభయారణ్యం, పులుల సంరక్షణా కేంద్రంలో కిందటి నెల 28వ తేదీ నుంచి ఈ అడ్వెంచర్ ఎపిసోడ్లను చిత్రీకరించిన విషయం తెలిసిందే.

ఈ తరహా రియలిస్టిక్ అడ్వెంచర్ డాక్యుమెంటరీలో రజినీకాంత్ కనిపించడం ఇదే తొలిసారి. మ్యాన్ వర్సెస్ వైల్డ్ ఎపిసోడ్లను మనదేశంలో చిత్రీకరించడం ఇది రెండోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బేర్ గ్రిల్స్‌తో గత ఏడాది మ్యాన్ వర్సెస్ వైల్డ్ ఎపిసోడ్లను ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్బెట్ జాతీయ పార్కులో షూట్ చేశారు. సరిగ్గా ఏడాది తిరిగేలోపే మరోసారి డిస్కవరీ ఛానల్ యాజమాన్యం మనదేశానికే వచ్చింది. దక్షిణాది సూపర్‌స్టార్ రజినీని తన లేటెస్ట్ ఎపిసోడ్ల కోసం ఎంపిక చేసింది.

 



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif