Rajinikanth, Bear Grylls (Photo Credits: Instagram)

Bandipur, January 28: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తరువాత, సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) బేర్ గ్రిల్స్ (Bear Grylls) యొక్క సాహసోపేత షో మ్యాన్ వర్సెస్ వైల్డ్ లో (Man VS Wild Episode) కనిపించనున్నారు. హాలీవుడ్ ప్రముఖులు చానింగ్ టాటమ్, బ్రీ లార్సన్, జోయెల్ మెక్‌హేల్, కారా డెలివింగ్న్, రాబ్ రిగ్లే, ఆర్మీ హామర్ మరియు డేవ్ బటిస్టాతో కలిసి సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ ఎపిసోడ్‌లో కనిపించనున్నారు. ఇందుకోసం బేర్, రజిని ఇద్దరూ కర్ణాటకలోని (Karnataka) బందిపూర్ అటవీప్రాంతానికి (Bandipur forest) వచ్చారు. ప్రముఖ మీడియా ఏజెన్సీ ANI ఈ షో యొక్క చిత్రీకరణ విషయాలను వారితో పంచుకుంది.

సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న రజినీకాంత్ ఫోటోలు

బేర్ గ్రిల్స్ తన వాహనం నుంచి బయటకు వస్తున్న ఫోటోను మీడియా ఏజెన్సీ ANI పోస్ట్ చేసింది. దీనికి "బ్రిటిష్ సాహసికుడు బేర్ గ్రిల్స్ తన 'మ్యాన్ వర్సెస్ వైల్డ్' షో యొక్క ఎపిసోడ్ కోసం నటుడు రజనీకాంత్‌తో షూట్ కోసం కర్ణాటకలోని బండిపూర్ అటవీప్రాంతానికి వస్తున్నాడని ట్యాగ్ లైన్ ఇచ్చింది.

Here's The ANITweet

దీంతో పాటుగా రజనీకాంత్ షూట్ కిక్ స్టార్ట్ చేయడానికి ఛాపర్ వైపు వెళ్తున్న వీడియోను కూడా ఏఎన్ఐ ట్వీట్ చేసింది. బ్రిటిష్ సాహసికుడు బేర్ గ్రిల్స్‌తో కలిసి 'మ్యాన్ వర్సెస్ వైల్డ్' ఎపిసోడ్ షూట్ కోసం నటుడు రజనీకాంత్ కర్ణాటకలోని బండిపూర్ అడవికి వచ్చారంటూ దీనికి ట్యాగ్ లైన్ జోడించింది.

సీఏఏపై రజినీకాంత్ కీలక వ్యాఖ్యలు

బందిపూర్ అటవీప్రాంతంలో షూటింగ్ గురించి అక్కడ సీనియర్ అటవీ అధికారి న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ, "సుల్తాన్ బాటెరి హైవే మరియు ముల్లెహోల్, మద్దూర్ మరియు కల్కెరే అటవీ రేంజ్ ప్రాంతాల్లో షూటింగ్‌కు అనుమతి ఇవ్వబడింది. అవి పర్యాటక రహిత జోన్లలో ఉన్నాయి కాబట్టి అక్కడ మ్యాన్ వర్సెస్ వైల్డ్ షూటింగ్‌కు అనుమతి ఇవ్వబడిందని తెలిపారు. పర్యాటకం లేదా సాధారణ అటవీ పెట్రోలింగ్ మరియు ఫైర్ లైన్ సృష్టి కార్యకలాపాలు ప్రభావితం కావు. షూటింగ్ ప్రత్యేక అటవీ రక్షణలో జరుగుతుందని తెలిపారు.

రజినీ స్టామినాను నిరూపిస్తున్న 'దర్బార్'

బండీపూర్ అభయారణ్యంలో రెండు రోజుల పాటు ఈ అడ్వెంచరస్ డాక్యుమెంటరీ చిత్రీకరణ కొనసాగుతుంది. రోజూ ఆరు గంటల పాటు మాత్రమే షూటింగ్‌ను నిర్వహించాల్సి ఉంటుందని కర్ణాటక అటవీ మంత్రిత్వ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

రేపు సీఎం ఎవరైనా కావచ్చు, తమిళనాడు సీఎం ఎడపాటి వ్యాఖ్యలకు కౌంటర్ వేసిన రజినీకాంత్

మంగళవారం మధ్యాహ్నం చిత్రీకరణ ఆరంభమౌతుందని తెలుస్తోంది. బుధ, గురువారాల్లో చిత్రీకరణ కొనసాగుతుంది. రోజూ ఆరు గంటలు మాత్రమే చిత్రీకరణ కొనసాగించాల్సి ఉంటుంది. దీనికోసం కర్ణాటక అటవీ మంత్రిత్వ శాఖ అధికారులు ఏకంగా 17 నిబంధనలను విధించారు.

సారీ చెప్పే ప్రసక్తే లేదు,ఆ వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా

రెండు రోజుల పాటు రజినీకాంత్‌పై ఈ అడ్వెంచరస్ సన్నివేశాలను చిత్రీకరిస్తారు. చివరిరోజు.. బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్‌ కుమార్ కూడా బేర్ గ్రిల్స్ యూనిట్‌తో కలుస్తారు. బేర్ గ్రిల్స్, రజినీకాంత్, అక్షయ్‌కుమార్‌పై చివరిరోజు డాక్యుమెంటరీని షూట్ చేయబోతున్నారు.