Rajinikanth speaks to media at Chennai Airport.(ANI Photo)

Chennai, December 20: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై(Citizenship Amendment Act) దేశ వ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు దీనిని స్వాగతిస్తుంటే మరికొందరు దీనిని వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ యాక్ట్‌పై తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ (Superstar Rajinikanth) కూడా స్పందించారు.

దేశంలో పలు ప్రాంతాల్లో చోటు చేసుకుంటున్న హింసాత్మక నిరసనలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ట్వీట్‌ చేశారు. పౌరులందరూ శాంతియుతంగా, కలిసికట్టుగా ఉండాలని, హింసాకాండతో సమస్యలు సమసిపోవని ఆయన హితవు పలికారు. దేశంలో జరుగుతున్న అల్లర్లపై తీవ్రంగా కలత చెందానన్నారు.

ఇదిలా ఉంటే అయితే రజనీకాంత్‌ సీఏఏను (CAA) ఆమోదిస్తున్నట్టు గానీ, వ్యతిరేకిస్తున్నట్లు గానీ ఎటువంటి స్పష్టమైన ప్రకటన చేయలేదు. ఇక రజనీకాంత్ ట్వీట్‌పై ఆయన అభిమానులు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. ‘శాంతి మార్గంలో పోరాడుదాం’ అని కొందరు ఆయన మాటలతో ఏకీభవిస్తుండగా, ‘నిన్ను చూసి సిగ్గుపడుతున్నాం’ అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

Here's Rajinikanth Tweet

#IStandWithRajinikanth పేరుతో యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చిందంటే.. రజనీకాంత్ వ్యాఖ్యలపై ట్విట్టర్‌లో ఎంతో రచ్చ జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.

సీఏఏను వ్యతిరేకిస్తున్న డీఎంకే అధినేత స్టాలిన్‌ (DMK Stalin) కూడా రజనీ వ్యాఖ్యలపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. మరోవైపు మక్కల్‌ నీది మయ్యం(ఎమ్‌ఎన్‌ఎమ్‌) పార్టీ (MNM) అధ్యక్షుడు కమల్‌ హాసన్‌ సీఏఏ అమలుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.

పోలీస్ ఆఫీసరా వాడు... హంతకుడు, ఒరిజినల్ గానే విలన్ అంటూ సూపర్ స్టైలిష్ పోలీస్‌గా మరోసారి రజినీ స్టామినాను నిరూపిస్తున్న 'దర్బార్

ప్రస్తుతం రజనీకాంత్‌ తన 168 వ సినిమా షూటింగ్‌లో భాగంగా హైదరాబాద్‌లో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని శివ తెరకెక్కిస్తుండగా, ఇందులో కీర్తి సురేష్‌, కుష్బు, మీనా కీలక పాత్రలలో కనిపించనున్నారు.