Rajinikanth On EV Ramasamy: సారీ చెప్పే ప్రసక్తే లేదు,ఆ వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా, పెరియార్‌పై చేసిన వ్యాఖ్యలపై రజినీకాంత్ స్పందన, ఇవి పత్రికల్లో వచ్చిన వార్తలేనన్న దక్షిణాది సూపర్ స్టార్
I won't apologize for remarks on Periyar Says Rajinikanth (Photo-ANI)

Chennai, January 21: ద్రవిడ పితామహుడు, సంఘ సంస్కర్త..పెరియార్ రామసామి‌పై(Periyar E. V. Ramasamy) తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, క్షమాపణ చెప్పేది లేదని తలైవర్ రజనీ కాంత్(Superstar Rajinikanth) స్పష్టం చేశారు. నేను చేసిన వ్యాఖ్యలు నేను రాసుకున్నవి కాదని.... వాటిపై పత్రికల్లో కధనాలు కూడా వచ్చాయని, కావాలంటే వాటిని చూపిస్తానని ఆయన చెప్పారు. జనవరి 14 న జరిగిన తుగ్లక్ పత్రిక స్వర్ణోత్సవ సభలో పాల్గోన్నరజనీకాంత్ పెరియార్ రామసామిపై( Ramasamy) వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు.

రేపు సీఎం ఎవరైనా కావచ్చు

1971లో పెరియార్‌ సేలంలో జరిగిన సభలో శ్రీరాముడు, సీతాదేవి విగ్రహాలకు నగ్నంగా చెప్పుల దండవేసి ఊరేగించారని, ఆ వార్తను ఏ పత్రికా ప్రచురించకపోయినా తుగ్లక్‌ పత్రిక మాజీ సంపాదకుడు చో రామసామి ప్రచురించారని పేర్కొన్నారు. అంతేకాక ‘ మురసోలి పత్రిక చేతిలో ఉంటే డీఎంకే పార్టీ కార్యకర్తగా పరిగణిస్తారని....అదే తుగ్లక్ పత్రిక ఉంటే మేధావి అంటారని కూడా రజనీ చెప్పుకొచ్చారు.

Here's ANI Tweet

 

పెరియార్‌ను కించపరస్తూ రజనీ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలంటూ ద్రావిడర్‌ విడుదలై కళగం (ravidar Viduthalai Kazhagam) నేతలు చెన్నై ట్రిప్లికేన్‌, తిరుప్పూరు, కోయంబత్తూరు, తిరుచెంగోడు, మదురై పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు చేశారు. రజనీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డీపీఐ నేత తొల్‌ తిరుమావళవన్‌ డిమాండ్‌ చేశారు.

హింసాకాండతో సమస్యలు సమసిపోవు, పరిణామాలు నన్ను చాలా బాధిస్తున్నాయి

అప్పటి నుంచి తమిళనాడులో రజనీకాంత్‌కి వ్యతిరేకంగా ద్రవిడ సంఘాలు నిరసన తెలుపుతూనే ఉన్నాయి. కాగా ....తంతై పెరియార్ ద్రవిదార్ కజగం నాయకులు రజనీకాంత్ ఇంటి వద్ద మంగళవారం నిరసన ప్రదర్శన చేపట్టారు.

Here's Stalin Tweet

అమిత్ షా.. బలవంతంగా హిందీని మాపై రుద్దవద్దు

రజనీ.. రాజకీయ ప్రవేశం కోసమే పెరియార్ గౌరవ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోవై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ద్రవిడర్‌ విడుదలై కళగమ్‌ అధ్యక్షుడు మణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చెన్నై పోలీసులు రజనీపై కేసు నమోదు చేశారు.