Sudigali Sudheer: ఎట్టకేలకు పెళ్లి చేసుకోబోతున్న సుడిగాలి సుధీర్? వరుసకు మరదలు అయ్యే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడంటూ తాజాగా ప్రచారం
త్వరలోనే సుధీర్ పెళ్లి చేసుకోబోతున్నాడనేదే ఆ ప్రచారం. వరుసకు మరదలు అయ్యే తన బంధువుల అమ్మాయినే ఆయన పెళ్లి చేసుకుంటున్నాడని చెపుతున్నారు.
Hyderabad, April 17: జబర్దస్త్ షో (Jabardasth Show) వేదికగా బుల్లితెర సూపర్ స్టార్ (Super Star) గా ఎదిగిన సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) గురించి ఏ విషయం బయటకు వచ్చినా వైరల్ (Viral)గా మారుతుంది ప్రస్తుతం హీరోగా సినిమాలు చేస్తున్న ఇతని పెండ్లి గురించి ఎప్పుడు చర్చ వచ్చినా అది సంచలనమే. సుధీర్ కి వివాహ వయసు దాటిపోయి చాలా కాలం అవుతుంది. ఆయన తోటి కమెడియన్స్ రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను పెళ్లి చేసుకుని పిల్లల్ని కూడా కన్నారు. సుధీర్ మాత్రం పెళ్లి మాట ఎత్తడం లేదు. సుధీర్ తమ్ముడికి కూడా వివాహం అయినట్లు సమాచారం. వయసు పెరిగిపోతున్నా సుధీర్ మాత్రం పెళ్లి జోలికి వెళ్లలేదు. తన తోటి కమెడియన్స్ అందరూ పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోయారు. యాంకర్ రష్మితో సుధీర్ కి లవ్ అఫైర్ ఉందంటూ ఎప్పటి నుంచో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఎంతో చనువుగా కనిపించే వీరిద్దరూ తమ మధ్య ఎలాంటి ప్రేమ వ్యవహారం లేదని ఎన్నో సార్లు క్లారిటీ ఇచ్చారు.
తాజాతా సుధీర్ గురించి మరో ప్రచారం జరుగుతోంది. త్వరలోనే సుధీర్ పెళ్లి చేసుకోబోతున్నాడనేదే ఆ ప్రచారం. వరుసకు మరదలు అయ్యే తన బంధువుల అమ్మాయినే ఆయన పెళ్లి చేసుకుంటున్నాడని చెపుతున్నారు. ఎలాంటి అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ఈ వార్తను ఇప్పుడు ప్రముఖంగా చెప్పుకుంటున్నారు. గతంలో కూడా పలుమార్లు సుధీర్ పెళ్లి వార్తలు హల్చల్ చేశాయి. దీంతో నమ్మొచ్చా లేదా అనే సందిగ్ధత నెలకొంది.