Pawan (Credits: Twitter)

Hyderabad, September 1: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh babu) బావ, ప్రేమ కథా చిత్రమ్ (Prema Katha Chitram) ఫేమ్ సుధీర్ బాబు (Sudheer babu) తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దర్శకుడిగా మారితే ఎవరితో సినిమా తీస్తారన్న ప్రశ్నకు "పవన్ కల్యాణ్ తో" (Pawan Kalyan) అంటూ ఏమాత్రం ఆలోచించకుండా సమాధానం చెప్పారు. "నేను దర్శకుడిగా మారితే... నా తొలి చిత్రంలో హీరో పవన్ కల్యాణే. అది కూడా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తోనే ఉంటుంది. నా సినిమాలో పవన్ ను ముఖ్యమంత్రిని చేస్తా" అంటూ తెలిపారు. దీనిపై పవన్ అభిమానులు, జనసేన మద్దతుదారులు భారీగా స్పందిస్తున్నారు. వచ్చే ఏడాది నిజంగానే పవన్ సీఎం అవుతారని, అప్పుడు గనుక సినిమా తీస్తే బ్రహ్మాండంగా ఉంటుందని అభిమానులు పేర్కొంటున్నారు.

Pawan (Credits: Twitter)