Rocking Rakesh Marriage: ఒక్కటి కాబోతున్న జబర్దస్త్ కమెడియన్, బిగ్ బాస్ బ్యూటీ, రెండేళ్ల ప్రేమ తర్వాత పెళ్లివైపు అడుగులు, ఇదంతా టీఆర్పీ స్టంట్ కాదు, నిజంగానే పెళ్లిపీటలెక్కబోతున్నట్లు ప్రకటన
కానీ తొలిసారి తన యూట్యూబ్ ఛానల్ లో రాకింగ్ రాకేష్ తో పెళ్లి గురించి అధికారికంగా బయట పెట్టింది జబర్దస్త్ సుజాత. రోజా హౌస్ టూర్ లో (Roja House Tour) భాగంగా మాట్లాడుతూ.. తమ రిలేషన్ గురించి మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. త్వరలోనే పెళ్లి గురించి మరిన్ని వివరాలు చెప్తాను అంటూ క్లారిటీ ఇచ్చింది సుజాత.
Hyderabad, SEP 22: జబర్దస్త్ షో తో (Jabardasth) పాపులర్ అయిన రాకింగ్ రాకేష్(Rocking Rakesh) పెళ్లిపై క్లారిటీ ఇచ్చాడు. ఎంతోకాలంగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై తానే స్వయంగా భాగస్వామితో కలిసి నిజం చెప్పాడు. టీవీ యాంకర్ గా పాపులర్ అయ్యి...బిగ్ బాస్ షోతో ప్రజలకు చేరువైన జోర్దార్ సుజాతను (Jordar Sujatha) త్వరలోనే పెళ్లాడబోతున్నట్లు ప్రకటించాడు. అయితే చాలారోజులుగా రాకేష్- సుజాత మధ్య రిలేషన్ పై వార్తలు వచ్చాయి. వీళ్లిద్దరూ కలిసి అనేక స్కిట్ లు చేశారు. కానీ జబర్దస్త్ కామెడీ షో చూస్తుంటే చాలామంది రిలేషన్ లో ఉన్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ జరిగే ప్రమోషన్స్ అలాగే ఉంటాయి. వాళ్ళ రేటింగ్ కు తగ్గట్లు ఎవరెఎవరిని కలిపితే బాగుంటుందో చూసి వాళ్లను జత చేసి ప్రోమోలను విడుదల చేస్తుంటారు నిర్వాహకులు. కానీ రాకింగ్ రాకేష్, సుజాతల (Rakesh-sujatha) లవ్ ట్రాక్ మాత్రం నిజమేనని తేలిపోయింది.
రాకింగ్ రాకేష్, జబర్దస్త్ సుజాత. రెండేళ్ల కింద మొదటిసారి జబర్దస్త్ లో కలిశారు. అప్పటినుంచి తన స్కిట్‌లో సుజాతకు అవకాశం ఇస్తున్నాడు రాకేష్. అంతకుముందు పిల్లలతో స్కిట్లు చేసిన ఈయన.. ఆ తర్వాత సుజాతతో పాటు మరికొందరు లేడీ కమెడియన్స్ తో కలిసి స్కిట్ చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే సుజాతతో ఆయన ప్రేమలో పడ్డాడు. ఇద్దరి మధ్య రిలేషన్ ఉంది అంటూ తాము కూడా చాలాసార్లు బయట ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పటి వరకు ప్రత్యక్షంగా ఎప్పుడు చెప్పలేదు.. కానీ తొలిసారి తన యూట్యూబ్ ఛానల్ లో రాకింగ్ రాకేష్ తో పెళ్లి గురించి అధికారికంగా బయట పెట్టింది జబర్దస్త్ సుజాత.
రోజా హౌస్ టూర్ లో (Roja House Tour) భాగంగా మాట్లాడుతూ.. తమ రిలేషన్ గురించి మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. త్వరలోనే పెళ్లి గురించి మరిన్ని వివరాలు చెప్తాను అంటూ క్లారిటీ ఇచ్చింది సుజాత. అందులో రాకింగ్ రాకేష్ కూడా ఉన్నాడు. త్వరలోనే ఇద్దరి పెళ్లి గురించి మరిన్ని వివరాలు బయటకు రానున్నాయి. ఏదేమైనా జబర్దస్త్ షో నుంచి ఒక జంట పెళ్లి పీటలు ఎక్కనుండడంతో మిగిలిన వారు సంతోషపడుతున్నారు. పైగా ఈ ఇద్దరూ వరంగల్ కు చెందినవారే కావడంతో రాకేష్- సుజాత మధ్య ప్రేమ చిగురించింది. రాకింగ్ రాకేష్ వరంగల్ లోనే పుట్టి పెరిగాడు, ఇక జోర్డార్ సుజాత వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండంల ఉప్పరపల్లికి చెందారు.