Kaun Banega Crorepati 14: అమితాబ్ బచ్చన్ ముందే షర్ట్ విప్పేసిన కంటెస్టెంట్, ఇంకా బట్టలు విప్పేస్తారేమోనని భయంగా ఉందన్న బిగ్ బి, కౌన్ బనేగా కరోడ్‌పతి 14‌లో ఆసక్తికర ఘటన

బాలీవుడ్‌ బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న రియాలిటీ షో కౌన్ బనేగా కరోడ్‌పతి 14 లో (Kaun Banega Crorepati 14) ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.

Contestant Removes Shirt After Winning Fastest Finger First

బాలీవుడ్‌ బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న రియాలిటీ షో కౌన్ బనేగా కరోడ్‌పతి 14 లో (Kaun Banega Crorepati 14) ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. హాట్‌ సీట్‌కు ఎంటర్‌ అయ్యేందుకు ఫాస్టేస్ట్‌ ఫింగర్‌ ఫస్ట్‌ రౌండ్‌లో గెలుపొందిన ఓ వ్యక్తి షర్డ్‌ విప్పి స్టేజ్‌పై హంగామా చేశాడు. అతన్ని చూసి బిగ్‌బి ఆశ్చర్యపోయాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను తాజాగా మేకర్స్‌ విడుదల చేశారు.

ఈ వీడియోలో అమితాబ్‌ విజయ్‌ గుప్తా అనే కంటెస్టెంట్‌ ఫాస్టెస్ట్‌ ఫింగర్‌ ఫస్ట్‌ రౌండ్‌లో (Contestant Removes Shirt After Winning ) గెలిచినట్లు అనౌన్స్‌ చేశారు. అది విన్న ఆ వ్యక్తి సంతోషం పట్టలేక స్టేజ్‌పై రచ్చ రచ్చ చేశాడు. దీంతో స్టేజ్‌పైకి వస్తూనే షర్ట్‌ విప్పి స్టేజ్‌ చూట్టు తిరిగాడు. అంతేకాదు తన భార్య దగ్గరికి వెళ్లి ఆనందంతో హగ్‌ చేసుకున్నాడు. దాదాపు 45 ఏళ్లపైనే ఉండే ఈ వ్యక్తి ఒక్కసారిగా కుర్రాడిలా మారిపోయాడు.

బీజేపీ నేత సోనాల్‌ ఫోగట్‌ నైట్ క్లబ్ వీడియో వైరల్, చనిపోయే రెండు నెలల ముందు పీఏ సుధీర్ సంగ్వాన్‌, ఫ్రెండ్ సుఖ్వింద‌ర్ వాసితో డ్యాన్స్

ఆయనను అలా చూసి షో హోస్ట్‌ బిగ్‌బితో పాటు ఆడియన్స్‌ కూడా ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారు. అతను మాత్రం చప్పట్లు కొట్టడం ఆపకండి అని ఆడియన్స్‌కు చెప్పుతూ స్టేజ్‌ అంతా పరుగెడుతూ నానా హంగామా చేశాడు.

Here's Video

హోస్ట్‌ అమితాబ్‌ సర్‌ కనీసం షర్ట్‌ అయినా వేసుకోండని అతడిని కోరారు. ఆ తర్వాత ‘కనీసం ఆయనను షర్ట్‌ వేసుకోనివ్వండి.. లేదంటే ఇంకా బట్టలు విప్పేస్తారేమోనని భయంగా ఉంది’ అని బిగ్‌బి చమత్కరించిన ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.



సంబంధిత వార్తలు

Year Ender 2024: దేశంలో ఈ ఏడాది అత్యధికంగా పన్ను చెల్లించిన సెలబ్రిటీ ఎవరో తెలుసా, అల్లు అర్జున్ ఎంత ట్యాక్స్ కట్టాడో తెలుసుకోండి, పూర్తి వివరాలు ఇవిగో..

Andhra Pradesh: మంగళగిరి ఎయిమ్స్‌ మొదటి స్నాతకోత్సవం, ఎంబీబీఎస్‌ విద్యార్థులకు బంగారు పతకాలు అందజేసిన రాష్ట్రపతి ముర్ము, ప్రతి డాక్టర్‌ సేవకే ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపు

Syed Mushtaq Ali Trophy: టీ 20లో ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టిన బరోడా, అత్య‌ధిక సిక్స‌ర్లుతో పాటు అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా హిస్టరీ

Abhishek Sharma: దేశీయ టీ20 చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు నమోదు చేసిన అభిషేక్ శర్మ, 28 బంతుల్లో 11 సిక్స్ లు, 8 ఫోర్లతో విధ్వంసకర ఇన్నింగ్స్