Jabardasth Show: జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షో ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్, ఇక‌పై ఆ షో ఉండ‌దు, క‌న్నీళ్లు పెట్టుకున్న కంటెస్టెంట్స్, ర‌ష్మీ

అయితే ఎక్స్‌ట్రా జబర్దస్త్ తీసేసి ఒకే పేరు జబర్దస్త్ తో శుక్ర, శని వారాలు రెండు ఎపిసోడ్స్ గా రానున్నట్టు తాజా ఎక్స్‌ట్రా జబర్దస్త్ ప్రోమోలో యాంకర్ రష్మీ తెలిపింది. ఎక్స్‌ట్రా జబర్దస్త్ షో తీసేస్తుండటంతో యాంకర్ రష్మీ (Rashmi) ఏడ్చేసింది. రష్మీతో పాటు పలువురు కంటెస్టెంట్స్, జడ్జిలు కూడా ఎమోషనల్ అయ్యారు.

Jabardasth Show (PIC @ mallemala YT)

Hyderabad, May 29: కామెడీ స్కిట్స్ తో ఎన్నో ఏళ్ళ నుంచి టీవీలో జబర్దస్త్ (Jabardasth), ఎక్స్‌ట్రా జబర్దస్త్ షోలు ప్రేక్షకులను నవ్విస్తున్నాయి. జబర్దస్త్ (Jabardasth Show) మొదలైన దగ్గర్నుంచి కమెడియన్స్, జడ్జిలు, యాంకర్లు.. ఇలా చాలా మంది పాపులర్ అయ్యారు, లైఫ్ లో సెటిల్ అయ్యారు. జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ షోల నుంచి ఎంతోమంది కమెడియన్స్ సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు. గత కొన్నేళ్లుగా ఈ షోలు నడుస్తూనే ఉన్నాయి. ఎవరు వచ్చి వెళ్లినా ఈ షోలు మాత్రం ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నాయి. ఇటీవల జబర్దస్త్ లో జడ్జిగా ఉన్న ఇంద్రజ మానేస్తున్నాను అని చెప్పి ఎమోషనల్ అయిన ప్రోమో బాగా వైరల్ అయింది. అది మరవకముందే మరో షాకింగ్ న్యూస్ ఇచ్చారు. జబర్దస్త్ తో మొదలయి ఆ తర్వాత ఎక్స్‌ట్రా జబర్దస్త్ గా రెండు ప్రోగ్రామ్స్ గా మారింది. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒకే ప్రోగ్రాంగా మారబోతుంది. ఎక్స్‌ట్రా జబర్దస్త్ షోని పూర్తిగా తీస్తున్నట్టు తాజా ప్రోమోలో యాంకర్ రష్మి తెలిపింది.

ప్రస్తుతం గురు, శుక్ర వారాలు జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ (Extra Jabardasth) వస్తున్నాయి. అయితే ఎక్స్‌ట్రా జబర్దస్త్ తీసేసి ఒకే పేరు జబర్దస్త్ తో శుక్ర, శని వారాలు రెండు ఎపిసోడ్స్ గా రానున్నట్టు తాజా ఎక్స్‌ట్రా జబర్దస్త్ ప్రోమోలో యాంకర్ రష్మీ తెలిపింది. ఎక్స్‌ట్రా జబర్దస్త్ షో తీసేస్తుండటంతో యాంకర్ రష్మీ (Rashmi) ఏడ్చేసింది. రష్మీతో పాటు పలువురు కంటెస్టెంట్స్, జడ్జిలు కూడా ఎమోషనల్ అయ్యారు.

ఈ కారణంతోనే ఇంద్రజని పంపించేసినట్టు తెలుస్తుంది. ఇకపై జబర్దస్త్ కి కృష్ణ భగవాన్, కుష్బూలు జడ్జీలుగా ఉంటారని తెలుస్తుంది. అలాగే యాంకర్ సిరి హనుమంత్ ని కూడా తప్పించి రెండు ఎపిసోడ్స్ కి రష్మీనే యాంకర్ ని చేస్తారని సమాచారం. ఎన్ని పేర్లు మార్చినా, ఎన్ని మార్పులు చేసినా అదే కామెడీ స్కిట్స్ ఫార్మేట్ లోనే వెళ్తుంది ఈ షో. ఎక్స్‌ట్రా జబర్దస్త్ తీసేస్తుండటంతో పలువురు ప్రేక్షకులు కూడా బాధపడుతూ యూట్యూబ్ వీడియోల కింద కామెంట్స్ చేస్తున్నారు.