Actor Indrakumar Dies: కారణం అదేనా..మరో టీవీ నటుడు ఆత్మహత్య, ఉరివేసుకుని చనిపోయిన తమిళ సీరియల్ నటుడు ఇంద్ర కుమార్, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు

తమిళనాడులోని పెరంబలూర్‌లో ఆయన స్నేహితుని నివాసంలో ఉరివేసుకుని (Actor Indrakumar Dies) చనిపోయారు.

Image used for representation purpose only | PTI Photo

తమిళ టెలివిజన్ పరిశ్రమలో ప్రముఖ టీవీ నటుడు ఇంద్ర కుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. తమిళనాడులోని పెరంబలూర్‌లో ఆయన స్నేహితుని నివాసంలో ఉరివేసుకుని (Actor Indrakumar Dies) చనిపోయారు. చెన్నైలో నివాసం ఉంటున్న ఇంద్ర కుమార్ (Tamil Actor Indrakumar) తమిళ డైలీ సీరియల్స్ ద్వారా ఫ్యామస్‌ అయ్యారు. అయితే గురువారం రాత్రి తన స్నేహితులతో కలిసి సినిమా చూసి వచ్చిన కొన్ని గంటల్లోనే కుమార్‌ విగతజీవిగా మారడంతో అతని స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతిలో మునిగిపోయారు.

స్నేహితుల సమాచారం మేరకు కుమార్‌ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం తరలించారు . ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. అయితే అవకాశాలు రావడం లేదనే ఆందోళనతోనే ఇంద్ర కుమార్‌ ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం. మరోవైపు వివాహ జీవితంలో సమస్యలు, భార్యతో విభేదాలు కారణంగానే చనిపోయాడనే మరో వాదన కూడా వినిపిస్తోంది. కాగా కరోనా సంక్షోభ కాలంలో ఫిలిం ఇండస్ట్రీ కూడా కష్టాల్లో కూరుకుపోయింది.

ఇంద్ర కుమార్‌కు భార్య,ఒక పాప ఉన్నారు. శ్రీలంకన్ తమిళ్ అయిన ఇంద్ర కుమార్ కొన్నేళ్లు చెన్నైలోని శరణార్థి శిబిరంలో ఉన్నాడు. తమిళంలో పలు టీవీ సీరియల్స్‌లో నటించాడు. అయితే సినిమాల్లో అవకాశాలు లేకపోవడంతో కొంతకాలంగా మనస్తాపానికి గురవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో ఆత్మహత్యకు పాల్పడటం ఇప్పుడు కలకలం రేపుతోంది. పోలీసుల విచారణలో పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

ఎంఎస్ ధోనీ చిత్రంలో నటించిన మరో నటుడు ఆత్మహత్య, ఫేస్‌బుక్‌లో సూసైడ్‌ నోట్‌ పోస్టు, ఉరేసుకుని చనిపోయిన సందీప్‌ నహర్‌, రాజకీయాలతో అసంతృప్తికి గురయ్యానంటూ నోట్

ఈ నేపథ్యంలో అవకాశాలు లేక చాలామంది నటీనటులు ఆత్మహత్యలకు పాల్పడుతుండటం ఆందోళన రేపుతోంది. ఈ వారంలో సినీ పరిశ్రమకు సంబంధించి ఇది రెండవ విషాద ఘటన. కేసరి, ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ వంటి సినిమాల్లో నటించిన బాలీవుడ్‌ నటుడు సందీప్ నహర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. అంతకుముందు ప్రముఖ నటి, వీజే చిత్ర ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.