బాలీవుడ్ లో మరో విషఆదం నెలకొంది. ముంబైకి చెందిన బాలీవుడ్ నటుడు సందీప్ నహర్(33) ఆత్మహత్య (Sandeep Nahar Dies by Suicide) చేసుకున్నారు. అక్షయ్ కుమార్ సినిమా కేసరి, దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ‘ఎంఎస్ ధోనీ’ మూవీలో (Kesari, MS Dhoni: The Untold Story) సహాయ పాత్రలు పోషించిన సందీప్ సోమవారం సాయంత్రం ఫేస్‌బుక్‌లో సూసైడ్ నోట్ పోస్టు చేసిన కొద్దిగంటల్లోనే ఉరేసుకున్నారు.
కాగా బాలీవుడ్ స్టార్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గత ఏడాది అనుమానాస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే. సుశాంత్ మరణం మరచిపోకముందే ఆయన కో స్టార్ సందీప్ నహార్ ఆత్మహత్యకు (Sandeep Nahar Death) పాల్పడడం బాలీవుడ్‌లో కలకలం రేపుతుంది.
తాను చనిపోయే ముందు పది నిమిషాల వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆయన ఇందులో పలు విషయాల గురించి ప్రస్తావించాడు. తన భార్య కాంచన్, అత్త రెండేళ్లుగా తీవ్ర వేధింపులు, బెదిరింపులకు గురి చేస్తున్నారని సూసైడ్ నోట్‌లో ఆరోపించారు. భార్యతో తనకు కొంతకాలంగా తీవ్ర విభేదాలు కొనసాగుతున్నట్లు తెలిపారు. తన మరణానికి ఎవరూ బాధ్యులు కారని స్పష్టం చేశారు. ఆత్మహత్యే సమస్యలకు పరిష్కారమని భావించినట్లు తెలిపారు.
బాలీవుడ్ సినీ పరిశ్రమలో రాజకీయాలతో అసంతృప్తికి గురయ్యా. రాజకీయాల కారణంగా చేతికి వచ్చిన అవకాశాలు కూడా చివరి నిమిషంలో దూరమయ్యాయి’ అని ఆ నోట్ లో ఆవేదన వ్యక్తం చేశాడు. గోరెగావ్‌లోని నివాసంలో నహర్ ఉరేసుకున్న సమయంలో భార్య కూడా ఇంట్లోనే ఉన్నారని పోలీసులు తెలిపారు. విషయం గ్రహించిన వెంటనే ఆమె సందీప్‌ను రెండు ఆస్పత్రులకు తీసుకెళ్లారనీ, అయితే అప్పటికే అతడు తుదిశ్వాస విడిచారని చెప్పారు.
సందీప్ నహార్ .. ఎంఎస్ ధోని చిత్రంలో సుశాంత్‌ను ఎంకరేజ్ చేసే పాత్రలో సిక్కు వ్యక్తిగా కనిపించి అలరించాడు. అక్షయ్ కుమార్ నటించిన కేసరి మూవీలోను ముఖ్య పాత్ర పోషించాడు. 33 ఏళ్ళ వయస్సులో అర్ధాంతరంగా సందీప్ నహార్ ఆత్మహత్య చేసుకొని మరణించడాన్ని ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. ముంబై పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, ఎంఎస్ ధోనీ సినిమాలో సందీప్ సహనటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కూడా 2020 జూన్‌లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.ఆయన మృతి అభిమానులకు, కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగిల్చింది. సుశాంత్ మరణం వెనుక ఉన్న మిస్టరీ చేధించేందుకు సీబీఐ కూడా రంగంలోకి దిగింది.