Actress Sravani Suicide Case: వేధింపుల వల్లే శ్రావణి ఆత్మహత్య, మీడియా ముందు నిందితులను ప్రవేశపెట్టిన వెస్ట్ జోన్ డీసీపీ, మీడియాతో మాట్లాడిన డీసీపీ ఏఆర్ శ్రీనివాస్
వైద్యపరీక్షల అనంతరం వెస్ట్ జోన్ డీసీపీ కార్యాలయంలో (West Zone DCP Office) నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ మీడియాతో (West Zone DCP Press Meet) మాట్లాడారు.
Hyderabad, Sep 14: టీవీ సీరియల్ నటి శ్రావణి సూసైడ్ కేసులో (TV actress Sravani Kondapalli suicide) నిందితులైన దేవరాజ్, సాయిరెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వైద్యపరీక్షల అనంతరం వెస్ట్ జోన్ డీసీపీ కార్యాలయంలో (West Zone DCP Office) నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ మీడియాతో (West Zone DCP Press Meet) మాట్లాడారు.
డీసీపీ చెప్పిన వివరాల ప్రకారం.. శ్రావణి 2012లో టీవీల్లో పనిచేయాలని హైదరాబాద్‌కి వచ్చిందని.. 2015లో సాయి కృష్ణారెడ్డితో పరిచయం ఏర్పడిందని తెలిపారు. ఆ తర్వాత ఆర్‌ఎక్స్-100 నిర్మాత అశోక్ రెడ్డి పరిచయం అయ్యారని అన్నారు. 2019లో దేవరాజ్ రెడ్డి పరిచయం ఏర్పడింది. వీరు ముగ్గురూ కూడా శ్రావణిని పెళ్లి చేసుకుంటామని వేధింపులకు గురిచేశారని డీసీపీ తెలిపారు. అదే క్రమంలో దేవరాజ్‌తో దూరంగా ఉండలాని సాయికృష్ణ పలు సందర్భాల్లో శ్రావణితో గొడవ పడ్డాడని తెలిపారు.
కాగా దేవరాజ్‌తో చనువుగా ఉండటం నచ్చని శ్రావణి తల్లి తండ్రులు, సాయి అతనితో మాట్లాడకూడదని వేధించారు. శ్రావణిని సాయి, ఆమె తల్లిదండ్రులు కొట్టారని దేవరాజ్ చెప్పాడు. అనేక సార్లు సాయి తన దగ్గర ఉన్న ఫోటోలతో శ్రావణిని బెదిరించాడని..అయితే దేవరాజ్ కూడా పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసాడని డీసీపీ తెలిపారు. అంతకుముందే దేవరాజ్‌పై శ్రావణి కేస్ పెట్టింది. కాగా శ్రావణికి వేరే వాళ్లతో సంబంధాలు ఉండటంతో దేవరాజ్ ఆ పెళ్లికి నిరాకరించాడు. దీంతో మనస్తాపం చెందిన శ్రావణి ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో ఏ1గా సాయి కృష్ణారెడ్డి, ఏ2 అశోక్ రెడ్డి, ఏ3 దేవరాజ్ రెడ్డిలుగా గుర్తించాం. వీరిలో ఇప్పటికే దేవరాజ్ రెడ్డి, సాయి కృష్ణారెడ్డిలను అరెస్టు చేశాం. ఆర్‌ఎక్స్-100 నిర్మాత అశోక్ రెడ్డి పరారీలో ఉన్నారు. అతనిని అరెస్ట్ చేయాల్సి ఉంది' అని డీసీపీ తెలిపారు.
మరోవైపు శ్రావణి ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మూడో వ్యక్తి ఆర్‌ఎక్స్ 100 మూవీ నిర్మాత అశోక్‌రెడ్డి పరారీలో ఉన్నారు. సోమవారం నాడు విచారణకు రావాలని పోలీసులు ఇదివరకే నోటీసులు పంపినా అటు నుంచి ఎలాంటి స్పందన లేదు. ఉదయం నుంచి నిర్మాత అశోక్‌రెడ్డి ఫోన్ స్విచాఫ్‌లో ఉంది. దీంతో అతని కోసం గాలింపు చేపట్టే అవకాశం ఉంది. శ్రావణి మృతికి దేవరాజు వేధింపులే కారణమని కుటుంబసభ్యుల ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆర్‌ఎక్స్100 సినిమా నిర్మాత అశోక్‌రెడ్డి- శ్రావణి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియో లీకైన విషయం విదితమే. దేవరాజు మీద శ్రావణి కేసు నమోదు చేసిన సమయంలో వీరిద్దరి మధ్య సంభాషణ జరిగినట్లు తెలిసింది.దీంతో పాటు శ్రావణిని ఫోన్‌లో బెదిరించిన దేవరాజ్ ఆడియో కూడా లీక్ అయింది.
టీవీ సీరియల్ నటి కొండపల్లి శ్రావణి సెప్టెంబర్ 9న తన గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు (Sravani Kondapalli Suicide) పాల్పడ్డారు. మౌన రాగం, మనసుమమత వంటి పలు సీరియల్స్‌తో తెలుగు ప్రేక్షకులకు ఆమె సుపరిచితం. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మధురానగర్ హెచ్ 56 బ్లాక్.. సెకండ్ ఫ్లోర్‌లో నివాసముండేవారు.