Girl falls in waterfall (Photo Credits: Pixabay, Representational Image)

Amaravati, Sep 14: అమెరికాలోని ఒక జలపాతం వద్ద సెల్ఫీ దిగుతూ ప్రమాదవశాత్తు జారి పడిపోవడంతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక యువతి (Andhra Woman Dies in US) చనిపోయింది. తన కాబోయే భర్తతో సెల్ఫీ తీసుకునేటప్పుడు మహిళ జారిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. వివరాల్లోకెళితే.. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరుకు (Gudlavaleru in Krishna district) చెందిన పోలవరపు లక్ష్మణరావు, అరుణ దంపతులకు ఇద్దరు కుమార్తెలు.

రెండో కుమార్తె కమల (27) గుడ్లవల్లేరులో ఇంజినీరింగ్‌ పూర్తి చేసి అమెరికా వెళ్లారు. ఎంఎస్‌ పూర్తి చేసి ప్రస్తుతం కొలంబియాలో ఉద్యోగం చేస్తున్నారు. ఒహాయోలోని మేఫీల్డ్ హైట్స్‌లో నివాసం ఉంటున్నారు. శనివారం బంధువుల ఇంటికి వెళ్లి తిరిగొస్తూ అట్లాంటా సమీపంలోని బాల్డ్ జలపాతం (Bald River Falls) వద్ద ఆగారు.

అక్కడ సెల్ఫీ తీసుకునే క్రమంలో ప్రమాదవశాత్తూ జలపాతంలో పడి మృతి చెందారు. ఆమెతో పాటు మరొకరు కూడా నీటిలో మునిగిపోయారని అ వ్యక్తిని స్థానికులు రక్షించారని వార్తలను బట్టి తెలుస్తోంది. కాగా నాట్స్‌ సహకారంతో ఆమె మృతదేహాన్ని భారత్‌ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

షాక్ కొట్టే 9 సెకండ్ల వీడియో, అకస్మాత్తుగా ముంచెత్తిన అలలు, పిచ్చుకలా కొట్టుకుపోయిన యువకుడు, ప్రాణాలతో బయటకు వచ్చాడా, లేదా...స్టోరీలో చూడాల్సిందే మరి !

చెన్నైలోని పెద్దకుమార్తె వద్దకు వెళ్లిన తల్లితండ్రులు విషయం తెలిసి తల్లడిల్లిపోతున్నారు.అందరినీ ఆప్యాయంగా పలకరించే కమల ఇక లేదన్నా విషయాన్ని కుటుంబ సభ్యులు ,గ్రామస్థులు జీర్ణించుకోలేకున్నారు. మృతదేహాన్ని ఇంటికి తీసుకురావడానికి వారు సహాయం చేస్తారని తెలుగు అసోసియేషన్ తెలిపింది