Andhra Pradesh Floods: ఈ ఆపదలో గుడ్లవల్లేరు ఘటనపై ఫోకస్‌ చేస్తారా, కుట్రలు జరుగుతున్నాయంటూ మండిపడిన ఏపీ సీఎం చంద్రబాబు, ప్రభుత్వం తరఫున చేయాల్సిందంతా చేస్తామని వెల్లడి

అనంతరం విజయవాడ కలెక్టరేట్‌ వద్ద చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. వరద బాధితుల సమస్యలను పరిష్కరించేందుకు అన్ని చర్యలూ చేపట్టామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు

Chandrababu (Photo/X/TDP)

Vjy, Spe 3: వరద ప్రభావిత ప్రాంతాల్లో మంగళవారం నాడు ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించారు. అనంతరం విజయవాడ కలెక్టరేట్‌ వద్ద చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. వరద బాధితుల సమస్యలను పరిష్కరించేందుకు అన్ని చర్యలూ చేపట్టామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. కొన్ని చోట్ల ఆహారం అందలేదని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఆపద సమయంలో కుట్రలు జరుగుతున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారిని ఆదుకోవాలి.. తప్ప చెత్త రాజకీయాలు చేయవద్దని హితవు పలికారు. ఈ ఆపదలో గుడ్లవల్లేరు ఘటనపై ఫోకస్‌ చేస్తారా అని ప్రశ్నించారు.ప్రభుత్వాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం బ్యారేజిలో బోట్ల ఘటనపై విచారణ చేపడతామని తెలిపారు.

వరద బాధితులకు కోటి రూపాయలు విరాళం ప్రకటించిన జగన్, ఎలా ఇవ్వాలనేది చర్చించి నిర్ణయం తీసుకుందామని పార్టీ నేతలతో తెలిపిన వైసీపీ అధినేత

ఎవరిదైనా పాత్ర ఉంటే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇటీవల కొన్ని ఘటనలు అనుమానాస్పదంగా ఉన్నాయని తెలిపారు. బాబాయిని చంపి గుండెపోటు అన్నోళ్లు.. ఇవి కూడా చేస్తారని విమర్శించారు. కుట్రలను తిప్పికొట్టేలా అధికారులను అప్రమత్తం చేశామని తెలిపారు. బుడమేరుకు, వరదకు ఏం సంబంధమని ప్రశ్నించారు. నిన్న వచ్చి ఐదు నిమిషాలు షో చేసి వెళ్లారని.. ఒక్క వ్యక్తికైనా ఆహార పొట్లం ఇచ్చారా అని జగన్‌పై మండిపడ్డారు.

నగరంలో డివిజన్‌కు ఒక సీనియర్‌ ఐఏఎస్‌ను నియమించామని చెప్పారు. 32 మంది ఐఏఎస్‌ అధికారులు సహాయక చర్యల్లో ఉన్నారన్నారు. పది జిల్లాల నుంచి ఆహారం సమకూర్చామని.. బాధితులకు మూడు పూటలా అందించాలని ఆదేశించినట్లు చెప్పారు. చిట్టచివరి బాధితుడికి కూడా సాయం అందాలని స్పష్టం చేశారు.‘వరదలతో పేదల బాధలు వర్ణణాతీతం. కొన్ని ఇళ్లల్లోకి పాములు, తేళ్లు వచ్చాయి. దీంతో వారందరికీ బాధ, భయం ఉంటుంది. అధికారులంతా మానవతా దృక్పథంతో పనిచేయాలి. అందుతున్న సహాయంపై ఐవీఆర్‌ఎస్‌ నిర్వహిస్తున్నాం. వీడియో ఇదిగో, మూడు రోజుల నుంచి అన్నం, నీళ్లు లేవు, దయచేసి మమ్మల్ని కాపాడాలంటూ వీడియో ద్వారా వేడుకున్న కుటుంబం

కొన్ని ప్రాంతాలకు ఇంకా ఆహారం అందలేదని ఫిర్యాదులు వస్తున్నాయి. ఆహారం అందని బాధితుల నంబర్లు అధికారులకు పంపిస్తున్నాం. ఇబ్బందులపై ప్రజలు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలి. నేను కూడా ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నా. అధికారులకు రెండు రోజులుగా చెప్పాం.. ఇప్పుడు సరిగా పనిచేయలేదని ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తప్పవు. మీనమేషాలు లెక్కించడం సరికాదు.. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు సర్వశక్తులూ ఒడ్డి సేవ చేయాలి. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ కష్ట సమయంలో బాధితులకు అండగా నిలవాలి. ఏవిధంగా సహకారం అందించగలిగితే అలా చేయూత అందించాలి. ఆర్థికంగా, నిత్యావసరాలు, సహాయ కార్యక్రమాల్లో పాల్గొనడం.. ఇలా ఏది వీలైతే అది మీ శక్తిమేర చేయాలి. ప్రభుత్వం తరఫున చేయాల్సిందంతా చేస్తామన్నారు.

సహాయక చర్యల కోసం సాధ్యమైనన్నీ ఎక్కువ హెలికాప్టర్లు, డ్రోన్లు తెప్పిస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. 32 మంది ఐఏఎస్‌ అధికారులు ఫీల్డ్‌లో ఉన్నారని పేర్కొన్నారు. అలాగే 179 సచివాలయాలకు ఒక్కో అధికారిని నియమించామని పేర్కొన్నారు. బాధితుల దగ్గరికే ఆహార పదార్థాలు వస్తాయని చెప్పారు. సహాయక చర్యలు అందించడంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాలు పట్టించుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.

బాధితులను అధికారులు తమ కుటుంబ సభ్యులుగా భావించాలని చంద్రబాబు సూచించారు. బాధ్యతగా వ్యవహరించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలకు సేవలు అందించడానికే అధికారులైనా, పాలకులైనా ఉన్నారని కానీ.. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. బాధితులకు అండగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సూచించారు. ఆర్థిక సాయమైనా, నిత్యవసరాలైనా అందించాలని కోరారు. ఎవరి శక్తి మేర వారు సాయం అందించాలన్నారు. బాధితులకు ఎలా సాయం చేస్తారో మీరే ఆలోచించాలని సూచించారు. ప్రతి కుటుంబం కనీసం ఒక్క కుటుంబాన్ని ఆదుకోవాలని అన్నారు. ప్రజలు మానవత్వాన్ని ప్రదర్శించాల్సిన సమయమిది అని తెలిపారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సాయం అందుతుందని తెలిపారు.