AP Caste Census: ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కుల‌గ‌ణ‌న‌కు రంగం సిద్ధం, తేదీ ప్ర‌క‌టించిన ఏపీ సర్కారు, కుల‌గ‌ణ‌న‌పై నాయ‌కుల అభిప్రాయాలు సేక‌రిస్తున్నామ‌న్న మంత్రి చెల్లుబోయిన

ఏపీలో డిసెంబర్ 9 నుండి కులగణన (Caste Census) ప్రక్రియ మొదలవుతుందని మంత్రి తెలిపారు. సమగ్ర కులగణన చేయడమే జగన్ (YS Jagan) ప్రభుత్వ లక్ష్యం అని చెప్పారు.

AP Government logo (Photo-Wikimedia Commons)

Vijayawada, NOV 24: ఏపీలో కులగణనకు సంబంధించి మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ (Chelluboina Venugopalakrishna) కీలక ప్రకటన చేశారు. ఏపీలో డిసెంబర్ 9 నుండి కులగణన (Caste Census) ప్రక్రియ మొదలవుతుందని మంత్రి తెలిపారు. సమగ్ర కులగణన చేయడమే జగన్ (YS Jagan) ప్రభుత్వ లక్ష్యం అని చెప్పారు. సమగ్ర కులగణన పేదవాడి జీవితానికి భద్రత అని పేర్కొన్నారు. ప్రజల జీవనస్థితి మారడానికి కులగణన అవసరం అని మంత్రి వేణు వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జనగణన తప్ప కులగణన (Caste Census) జరగలేదని ఆయన తెలిపారు.

Andhra Pradesh: రాజధాని తరలింపులో కీలక పరిణామం, విశాఖ రిషికొండ మిలీనియం టవర్స్‌లో ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్‌ జవహర్‌ రెడ్డి  

సామాజిక సాధికారితకు చిరునామా ముఖ్యమంత్రి జగన్ అని చెప్పారు. కులగణన కోసం కుల సంఘాల నాయకుల అభిప్రాయాలు సేకరిస్తున్నామన్నారు. ప్రాంతీయ సమావేశాలు నిర్వహించి ఆయా వర్గాల అభిప్రాయాలు సేకరిస్తున్నామన్నారు. రాష్ట్రంలో జరిగే కులగణన దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని మంత్రి వేణు అన్నారు. సమగ్ర కులగణన సామాజిక కోణంలో జరుగుతుందన్నారు. కులగణన అనగానే ప్రతిపక్షాల వెన్నులో వణుకు పుడుతోందన్నారు.