Commission on AP Stampedes: చంద్రబాబు సభల్లో ప్రమాదాలపై విచారణకు ప్రత్యేక కమిషన్, హైకోర్టు రిటైర్డు జడ్జీ నేతృత్వంలో విచారణ
పోలీసుల వైఫల్యం వల్లనే గుంటూరు తొక్కిసలాట జరిగిందని టీడీపీ ఆరోపించింది. దానికి వైసీపీ నేతలు కూడా కౌంటర్ ఇచ్చారు. ఇరుకు సందుల్లో సభలు పెట్టడం వల్లనే ప్రజలు చనిపోయారంటూ వైసీపీ ఆరోపించింది. దీంతో ఈ ఘటనలపై సమగ్ర దర్యాప్తునకు జగన్ ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకోసం హైకోర్టు రిటైర్డు జడ్జితో విచారణ కమిటీని నియమించింది.
Amaravati, JAN 07: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu) నిర్వహించిన సభల్లో జరిగిన తొక్కిసలాట (Stampede) ఘటనలపై విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ ఘటనలను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం... హైకోర్టు రిటైర్డు జస్టిస్ బి. శేష శయనరెడ్డి (Justice B. Shesha Shayana reddy) నేతృత్వంలో విచారణ కమిటీని నియమించింది. ఈ ఘటనలపై విచారణ కమిటీ విచారించనుంది. చంద్రబాబు నాయుడు డిసెంబర్ లో నెల్లూరు జిల్లా కందుకూరులో నిర్వహించిన సభలో తొక్కిసలాట జరిగి 8 మంది మృతి చెందారు. అనంతరం జనవరి 1న గుంటూరులో జరిగిన సభలోనూ తొక్కిసలాట జరిగింది. అందులో ముగ్గురు మహిళలు మరణించారు. దాంతో చంద్రబాబు సభలకు పర్మిషన్ ఇవ్వడంపై పునరాలోచనలో పడింది ప్రభుత్వం.
అయితే ఈ ఘటనలపై రాజకీయ రచ్చ కూడా జరిగింది. పోలీసుల వైఫల్యం వల్లనే గుంటూరు తొక్కిసలాట జరిగిందని టీడీపీ ఆరోపించింది. దానికి వైసీపీ నేతలు కూడా కౌంటర్ ఇచ్చారు. ఇరుకు సందుల్లో సభలు పెట్టడం వల్లనే ప్రజలు చనిపోయారంటూ వైసీపీ ఆరోపించింది. దీంతో ఈ ఘటనలపై సమగ్ర దర్యాప్తునకు జగన్ ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకోసం హైకోర్టు రిటైర్డు జడ్జితో విచారణ కమిటీని నియమించింది. త్వరలోనే ఈ కమిటీ విచారణ చేపట్టనుంది.