CM Revanth Reddy: పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం, కేసీఆర్ - హరీష్ గోదావరి నీళ్లను నెత్తిన చల్లుకోవాలన్న సీఎం రేవంత్ రెడ్డి, సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్‌ ప్రారంభం

ఈ సందర్భంగా గోదావరి నీళ్లకు ప్రత్యేక పూజలు చేశారు. సీఎం వెంట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి, తుమ్మల నాగేశ్వవరరావుతో పాటు ఖమ్మం జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ఉన్నారు.

CM Revanth Reddy Launches Sitarama Project at Khammam (X)

Khammam, Aug 15:  ఖమ్మం సీతారామ ప్రాజెక్టులోని పూసుగూడెం పంప్‌హౌస్‌ను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా గోదావరి నీళ్లకు ప్రత్యేక పూజలు చేశారు. సీఎం వెంట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి, తుమ్మల నాగేశ్వవరరావుతో పాటు ఖమ్మం జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ఉన్నారు.

అనంతరం మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. హరీష్ రావు, కేసీఆర్ లను పట్టించుకోం...వాళ్ళు కాలం చెల్లిన రూపాయి అని మండిపడ్డారు. మోటార్లు వచ్చి నాలుగేళ్లు అయినా..కరెంట్ కనెక్షన్ ఎందుకు ఇవ్వలేదు? అని ప్రశ్నించారు.కృష్ణ జలాల మీద ఆధారపడకుండా ఖమ్మం జిల్లాలో గోదావరి జలాల నీళ్ళని అందిస్తున్నాం అన్నారు. గొల్కోండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు, పెద్దన్నగా చెబుతున్న నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ 

Here's Video:

మామా అల్లుళ్లు కలిసి గోదావరి నీళ్లను నెత్తిన చల్లుకోవాలని చురకలు అంటించారు. పదేళ్లు అధికారంలో ఉన్న హరీష్ రావు ఈ పనిని ఎందుకు పూర్తి చేయలేకపోయారు? అని ప్రశ్నించారు. ఖమ్మం జిల్లాలో ఉన్న అన్ని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం అన్నారు. అడవి పందుల మాదిరిగా కేసీఆర్ కుటుంబం తెలంగాణాను విధ్వంసం చేసిందన్నారు. అప్పుల భారం ఉన్నా పెండింగ్ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తూ నిధులను కేటాయిస్తున్నాం అన్నారు.



సంబంధిత వార్తలు

K Annamalai on Sandhya Theatre Incident: తెలంగాణ‌లో అన్నీ వదిలేసి సినిమావాళ్ల వెంట‌ప‌డుతున్నారు! సీఎం రేవంత్ రెడ్డిపై త‌మిళ‌నాడు బీజేపీ చీఫ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Geetha Arts Express Gratitude To TG Govt: సీఎం రేవంత్ రెడ్డికి కృత‌జ్ఞ‌త‌లు! అల్లు అర‌వింద్ నేతృత్వంలోని గీతా ఆర్ట్స్ పోస్ట్, ఇంకా ఏమ‌న్నారంటే?

Sonu Sood: డబ్బు సంపాదించడం కోసం లేదా అధికారం కోసమే రాజకీయాల్లోకి వస్తారు, సీఎం ఆఫర్ మీద బాలీవుడ్‌ నటుడు సోను సూద్ కీలక వ్యాఖ్యలు

Tollywood Film Industry Meet CM Revanth Reddy: ప్రభుత్వంపై నమ్మకం ఉంది...గ్లోబల్ స్థాయికి సినిమా పరిశ్రమ, ఎలక్షన్‌ రిజల్ట్‌ లాగే సినిమా రిలీజ్‌ ఫస్ట్‌డే ఉంటుందన్న నిర్మాతలు..సీఎం రేవంత్‌తో కీలక అంశాల ప్రస్తావన