Coronavirus Deaths in India: 24 గంటల్లో 32 మంది మృతి, దేశ వ్యాప్తంగా 13,835కు చేరిన కరోనా కేసులు, 1766 మంది రికవరీ

కరోనా వైరస్‌ కేసులు రోజురోజుకు అధికంగా నమోదు అవుతున్నాయి. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 32 మంది మృతి (Coronavirus Deaths) చెందారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ 24 గంటల్లో 1076 కొత్త కేసులు నమోదు అయినట్లు పేర్కొంది. మొత్తంగా దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 13,835కు చేరింది.

Coronavirus Death Toll in India (Photo-IANS)

New Delhi, April 16: ఇండియాలో కరోనా వైరస్‌ (Coronavirus) చాపకింద నీరులా విస్తరించింది. కరోనా వైరస్‌ కేసులు రోజురోజుకు అధికంగా నమోదు అవుతున్నాయి. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 32 మంది మృతి (Coronavirus Deaths) చెందారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ 24 గంటల్లో 1076 కొత్త కేసులు నమోదు అయినట్లు పేర్కొంది.  ఏప్రిల్ 20 తర్వాత అనుమతించేవి ఇవే, ఆంక్షలను సడలించిన కేంద్ర ప్రభుత్వం 

మొత్తంగా దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 13,835కు చేరింది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం మరణాల సంఖ్య 452కు చేరుకోగా, 1766 మంది ఈ వైరస్‌ నుంచి కోలుకున్నారు.మరోవైపు కరోనా (Coronavirus Outbreak) బారిన పడివారిలో దాదాపు 80శాతం మంది కోలుకుంటున్నారని లవ్‌ అగర్వాల్‌ తెలిపారు.

గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 266మందికి పైగా పూర్తిగా కోలుకుని డిశ్చార్జ అయ్యారని వెల్లడించారు. ఇక దేశ వ్యాప్తంగా అమలవుతున్న లాక్‌డౌన్‌ కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేవని అన్నారు. అన్ని ప్రాంతాల్లో నిత్యావసర వస్తువుల అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ వల్ల సత్ఫలితాలు వస్తున్నాయన్నారు.

Updated By ANI

కరోనా పరీక్షలకు సంబంధించి కూడా కేంద్రం ఈ బులిటెన్‌లో కొత్త విషయాన్ని వెల్లడించింది. 24 శాంపిల్స్‌ను టెస్ట్ చేస్తే అందులో ఒకటి పాజిటివ్‌గా నమోదవుతున్నట్లు కేంద్రం తెలిపింది. ప్రతి ఆరు రోజులకు ఒకసారి కేసుల సంఖ్య రెట్టింపవుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రాలకు 5 లక్షల ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్‌ను పంపినట్లు కేంద్రం ప్రకటించింది. ఇతర దేశాలతో పోల్చుకుంటే కరోనా కట్టడిలో భారత్ మెరుగ్గానే ఉందని కేంద్రం చెప్పుకొచ్చింది.