IPL Auction 2025 Live

Earthquake in Kashmir: కశ్మీర్ ను కుదిపేసిన రెండు వరుస భూకంపాలు.. 7 నిమిషాల వ్యవధిలో రెండు ప్రకంపనలు

రెండు వరుస భూకంపలతో ప్రజలు భయభ్రాంతులకు గురై ఇళ్ల నుంచి బయటకు వచ్చి రోడ్లపైకి చేరారు. అయితే, ఈ ఘటనలో ప్రాణ నష్టం కానీ, ఆస్తినష్టం కానీ సంభవించినట్టు ఇప్పటి వరకు ఎలాంటి వార్తలు రాలేదు.

Earthquake (Credits: X)

Newdelhi, Aug 20: వరుస భూకంపాలతో (Earthquakes) మంగళవారం ఉదయం కశ్మీర్ (Kashmir) కంపించిపోయింది. రెండు వరుస భూకంపలతో ప్రజలు భయభ్రాంతులకు గురై ఇళ్ల నుంచి బయటకు వచ్చి రోడ్లపైకి చేరారు. అయితే, ఈ ఘటనలో ప్రాణ నష్టం కానీ, ఆస్తినష్టం కానీ సంభవించినట్టు ఇప్పటి వరకు ఎలాంటి వార్తలు రాలేదు. మొదట వచ్చిన భూకంపం బారాముల్లా జిల్లాలో భూమికి 5 కిలోమీటర్ల లోతున, రెండోది అదే ప్రాంతంలో 10 కిలోమీటర్ల లోతున ఉన్నట్టు అధికారులు తెలిపారు.

భారీ వర్షాల నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటన.. తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు

7 నిమిషాల వ్యవధిలో

తొలుత ఉదయం 6.45 గంటల సమయంలో 4.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. మరో 7 నిమిషాల వ్యవధిలోనే అంటే సరిగ్గా 6.52 గంటలకు 4.8 తీవ్రతతో మరో భూంకంపం సంభవించింది. దీంతో ప్రజలు భయాందోళనలు చెందారు.

కలకత్తా వైద్యురాలి హత్యాచారం కేసులో కీలక పరిణామం, ప్రధాన నిందితుడికి పాలిగ్రాఫ్‌/లై డిటెక్టర్‌ టెస్ట్ చేయనున్న సీబీఐ, అనుమతించిన కలకత్తా హైకోర్టు