Sankranti Holidays in AP: ఏపీలో మార్చిలో పదో తరగతి పరీక్షలు, జనవరి 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు స్కూళ్లకు సంక్రాంతి సెలవులు, జనవరి 17న పాఠశాలలు పునఃప్రారంభం

జనవరి 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సెలవులు ఇస్తున్నట్లు పేర్కొంది. మళ్లీ 17న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నట్లు తెలిపింది. కాగా గత నాలుగు రోజులుగా టీనేజర్లకు కొనసాగుతున్న కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌ నేటితో(శుక్రవారం) ముగియనుంది.

AP Education Minister Adimulapu Suresh (Photo-ANI)

Amaravati, Jan 7: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలలకు సంక్రాంతి సెలవుల తేదీలను రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది. జనవరి 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సెలవులు ఇస్తున్నట్లు పేర్కొంది. మళ్లీ 17న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నట్లు తెలిపింది. కాగా గత నాలుగు రోజులుగా టీనేజర్లకు కొనసాగుతున్న కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌ నేటితో(శుక్రవారం) ముగియనుంది. ఇప్పటి వరకు 16 లక్షల మంది టీనేజర్లకు వ్యాక్సిన్‌ అందించారు. పాఠశాలలకు సెలవులు కావడంతో రేపటి(శనివారం) నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో పిల్లలకు వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ చేపట్టనున్నారు.

ఏపీలో పదో తరగతి పరీక్షలు మార్చిలో నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ వెల్లడించారు. సంక్రాంతి నాటికి సిలబస్ పూర్తి చేయాలని విద్యాసంస్థలకు సూచించారు. 15 నుంచి 18 ఏళ్ల లోపు విద్యార్థులకు ప్రతి స్కూల్లో 95% వ్యాషినేషన్ పూర్తి చేశామని తెలిపారు. విద్యా సంవత్సరం ప్రారంభంలో అమ్మఒడి మూడో విడత ఇస్తామని పేర్కొన్నారు. నిబంధనలు పాటించని బీఈడీ, డీఈడీ కాలేజీలు 375 మూతపడ్డాయని మంత్రి సురేష్‌ తెలిపారు.

ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై సీఎం జగన్ వరాల జల్లు, ఉద్యోగులకు సంక్రాంతి కానుక, పాలనపై బిగిసిన మరింత పట్టు.

ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రైవేటు యూనివర్సిటీలో చట్టసవరణ ద్వారా 35% ఫ్రీ సీట్లు ఇప్పించామని పేర్కొన్నారు. సంక్షేమం రెండు కళ్ళుగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఏ విద్యార్ధి డబ్బులు లేక విద్యకు దూరం కాకూడదని అమ్మఒడి ఇచ్చి విద్యార్థులకు యూనిఫామ్, బుక్స్తో పాటు మధ్యాహ్నం పౌష్టికాహారం అందిస్తున్నామని పేర్కొన్నారు. కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ఇంగ్లీష్ మీడియం చెప్తూ తెలుగు కూడా బోధిస్తున్నామన్నారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif