UG,PG Exams in AP: ఏపీలో సెప్టెంబర్ లోపు పీజీ,యూజీ పరీక్షల నిర్వహణ, మీడియాకు వెల్లడించిన ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ హేమచంద్రారెడ్డి

సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆన్‌లైన్‌ ఎడ్యూకేషన్‌తో పాటు రెగ్యూలర్‌ ఎడ్యుకేషన్‌ రెండు అవసరమేనని గవర్నర్‌ సూచించారని తెలిపారు. కోవిడ్‌ కారణంగా అకడమిక్‌ కరిక్యులమ్‌ రీ డిజైన్‌ చేస్తున్నామని ఆయన అన్నారు.

AP 10th Class Exams Cancelled. Representational Image. |(Photo Credits: PTI)

Amaravati, July 20: యూజీసీ ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 20 యూనివర్సిటీల పరిధిలో పీజీ, యూజీ పరీక్షలను (Andhra Pradesh pg-and-ug-exams) సెప్టెంబర్‌లోపు నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ హేమచంద్రారెడ్డి (Professor Hemachandra Reddy) తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆన్‌లైన్‌ ఎడ్యూకేషన్‌తో పాటు రెగ్యూలర్‌ ఎడ్యుకేషన్‌ రెండు అవసరమేనని గవర్నర్‌ సూచించారని తెలిపారు. కోవిడ్‌ కారణంగా అకడమిక్‌ కరిక్యులమ్‌ రీ డిజైన్‌ చేస్తున్నామని ఆయన అన్నారు. సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు విడుదల, ఫలితాలను విద్యార్థులు results.nic.in, cbseresults.nic.in, cbse.nic.in వెబ్‌సైట్ల ద్వారా చెక్ చేసుకోండి

ఈ ఏడాది నుంచి డిగ్రీ మూడేళ్లలో 10 నెలల పాటు ఇంటర్న్‌ షిప్‌ను తప్పనిసరి చేస్తున్నామని వెల్లడించారు. సెప్టెంబర్‌ 13 నుంచి 27 మధ్య లో ఎంసెట్‌ పరీక్షతో పాటు ఇతర పరీక్షలు కూడా నిర్వహిస్తామన్నారు. డిగ్రీ, పీజీ పరీక్షలకు కోవిడ్‌ కారణంగా హాజరు కానీ వారికి తిరిగి పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ప్లేస్‌మెంట్స్‌ వచ్చిన వారికి, అబ్రాడ్‌ వెళ్లిన వారికి ముందస్తుగా డిగ్రీ, పీజీ పరీక్షలు ప్రత్యేకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు.

ఉన్నత విద్యాకోర్సులైన యూజీ, పీజీ ఫైనలియర్‌ విద్యార్థులకు సెప్టెంబర్‌లోగా పరీక్షల నిర్వహణకు రాష్ట్రంలోని యూనివర్సిటీలు చర్యలు చేపడుతున్నాయి. యూజీసీ మార్గదర్శకాల ప్రకారం సెప్టెంబర్‌ లోగా పరీక్షలు నిర్వహించేలా వర్సిటీలకు సూచిస్తున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఏపీలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ, ప్రైవేట్, డీమ్డ్‌ వర్సిటీలు 54 ఉండగా అందులో రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు 30 ఉన్నాయి. వీటి పరిధిలో 3,285 కాలేజీలు యూజీ, పీజీ సహా వివిధ కోర్సులు నిర్వహిస్తున్నాయి. ఆంధ్రా యూనివర్సిటీ, జేఎన్‌టీయూ కాకినాడ, అనంతపురం, శ్రీవేంకటేశ్వర, శ్రీకృష్ణదేవరాయ, నాగార్జున వర్సిటీల పరిధిలో ఎక్కువగా అఫ్లియేటెడ్‌ కాలేజీలున్నాయి. ఆంధ్రా వర్సిటీలో విద్యనభ్యసిస్తున్న విదేశీ విద్యార్థులు 600 వరకు ఉన్నారు. పరీక్షల నిర్వహణలో వీరిని కూడా పరిగణనలోకి తీసుకొని ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది.