AP SSC, Inter Exams Cancelled: ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు, సుప్రీం ఆదేశాల ప్రకారం జులై 31 నాటికి పరీక్షల నిర్వహణ సాధ్యం కాదని తెలిపిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, మార్కులు ఎలా ఇవ్వాలన్నదానిపై హైపవర్‌ కమిటీ ఏర్పాటు

గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఇంటర్‌ పరీక్షలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగిందని.. సుప్రీం ఆదేశాల ప్రకారం జులై 31 నాటికి పరీక్షల నిర్వహణ సాధ్యం కాదని తెలిపారు.

AP Education Minister Adimulapu Suresh (Photo-ANI)

Amaravati, June 24: ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు రద్దు (AP SSC, Inter Exams Cancelled) చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రకటించారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఇంటర్‌ పరీక్షలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగిందని.. సుప్రీం ఆదేశాల ప్రకారం జులై 31 నాటికి పరీక్షల నిర్వహణ సాధ్యం కాదని తెలిపారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.

పరీక్షల నిర్వహణ, ఫలితాలకు 45 రోజుల సమయం పడుతుందని మంత్రి సురేష్‌ పేర్కొన్నారు. మార్కులు ఎలా ఇవ్వాలన్నదానిపై హైపవర్‌ కమిటీ ఏర్పాటు చేస్తామని.. హైపవర్‌ కమిటీ నివేదిక తర్వాతే మార్కులపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. సుప్రీంకోర్టు సూచన మేరకే పరీక్షల రద్దు (AP Board Exams 2021) చేసినట్లు మంత్రి ఆదిమూలపు సురేష్‌ వెల్లడించారు. ఇతర బోర్డు పరీక్షలు రద్దుతో ఏపీ విద్యార్థులకు నష్టం జరగదన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువులోగా పరీక్షల నిర్వహణ అసాధ్యమని తెలిపారు. జులై 31లోగా ఫలితాలు ప్రకటించడం సాధ్యంకాదని మంత్రి సురేశ్ తేల్చి చెప్పారు.

ఇంటర్ పరీక్షల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ వైఖరిపై సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం, ఒక్కో విద్యార్థికి కోటి పరిహారం ఇవాల్సి ఉంటుందని హెచ్చరిక; జూలై 31లోపు ఫలితాల వెల్లడికి ఆదేశం

మరోవైపు ఇప్పటికే 21 రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేశాయి. అయినా ప్రభుత్వం పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధపడింది. దీంతో పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు సీరియస్ కావడంతో టెన్త్, ఇంటర్ పరీక్షల రద్దుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే జులై 31 లోగా ఇంటర్​ ఫలితాలను వెల్లడించాలని రాష్ట్రాల బోర్డులకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అసెస్మెంట్ కోసం 10 రోజుల గడువు ఇచ్చింది.

ఇప్పటికే 21 రాష్ట్రాల్లో పరీక్షల రద్దయ్యాయి. కాగా.. ఈ నెల మొదటి వారంలో విద్యార్థుల మార్కులకు సంబంధించి ప్రత్యామ్నాయ పద్ధతులను పరిశీలించాల్సిందిగా సీబీఎస్ఈ, సీఐఎస్ సీఈలను సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాల బోర్డుల మాదిరే సీబీఎస్ఈ, సీఐఎస్ సీఈ కూడా జులై 31లోగా ఫలితాలను వెల్లడించాలని పేర్కొంది.

2008 డీఎస్సీ అభ్యర్థులకు జగన్ సర్కారు గుడ్‌ న్యూస్‌, 2,193 మంది అభ్యర్థులను కాంట్రాక్ట్‌ ఉద్యోగులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ, ఎస్జీటీలుగా మినిమమ్‌ టైమ్‌ స్కేల్‌ వర్తింపజేస్తున్నట్లు వెల్లడి

గత వారమే రెండు బోర్డులు కూడా మార్కులు వేసే విధానాన్ని కోర్టుకు సమర్పించాయి. ఆ అఫిడవిట్‌పై సంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు.. వ్యతిరేకించేందుకు ఆ విధానాల్లో లోపాలేవీ లేవని వ్యాఖ్యానించింది. పరీక్షలు నిర్వహించాలన్న కొందరు విద్యార్థులు, తల్లిదండ్రుల విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. కాగా, ఇప్పటిదాకా 21 రాష్ట్రాలు ఇంటర్ పరీక్షలను రద్దు చేయగా.. ఆరు రాష్ట్రాల్లో నిర్వహించారు.