Amaravati, June 21: రాష్ట్ర ప్రభుత్వం 2008 డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. వీరికి ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించింది. 2,193 మంది డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులను కాంట్రాక్ట్ ఉద్యోగులుగా నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్జీటీలుగా మినిమమ్ టైమ్ స్కేల్ వర్తింపజేస్తున్నట్లు (DSC 2008 candidates promoted to SGTs) పేర్కొంది. కాగా 13 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 2008 డీఎస్సీ అభ్యర్థులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఎస్జీటీలుగా నియమించింది.
ఇటీవల గత ప్రభుత్వం డీఎస్సీ అభ్యర్థులను (DSC 2008 candidates ) పట్టించుకోలేదని.. వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తున్నామని ఇటీవల రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్న విషయం తెలిసిందే. ‘డీఎస్సీ-2008’ సమస్య 13 ఏళ్లుగా పెండింగ్‌లో ఉందన్నారు. అభ్యర్థుల భవితవ్యంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మానవతా దృక్పథంతో వ్యవహరించారని తెలిపారు. తాజాగా ఎస్జీటీలుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదిలా ఉంటే ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌ను వ్యతిరేకిస్తూ గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ముందు నిరుద్యోగులు నిరసన కార్యక్రమాలు (Protest Against AP Job Calendar) నిర్వహించారు. వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని, పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. విజయనగరం కోట క్రాస్ రోడ్స్ వద్ద విద్యార్థి సంఘాల నేతలు మానవ హారం కట్టారు. తర్వాత కలెక్టరేట్ కు భారీ ర్యాలీ తీశారు. జాబ్ క్యాలెండర్ తో (job calendar for the year 2021-22) ఏమాత్రం లాభం లేదన్నారు. ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కర్నూల్ కలెక్టరేట్ వద్ద డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. జాబ్ క్యాలెండర్ బాగోలేదంటూ గుంటూరులో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి.