AP EAMCET Results 2023 Declared: ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు ఈ లింక్ ద్వారా చెక్ చేసుకోండి, ఇంజనీరింగ్లో 76.32 శాతం మంది ఉత్తీర్ణత, అగ్రికల్చర్లో 89.65 శాతం మంది ఉత్తీర్ణత
ఇంజనీరింగ్లో 76.32 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, అగ్రికల్చర్లో 89.65 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.
ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ ఫలితాలను జూన్ 14 బుధవారం విజయవాడలో ఉదయం 10.30 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఇంజనీరింగ్లో 76.32 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, అగ్రికల్చర్లో 89.65 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంజనీరింగ్‌లో మొత్తం 2,24,724 మందికి గానూ 1,71,514 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. అగ్రికల్చర్‌లో 90,573 మందికి గానూ, 81,203 మంది అభ్యర్థులు క్వాలిపై అయ్యారు.
ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల, విద్యార్థులు తమ ఫలితాలను cets.apsche.ap.gov.in ద్వారా చెక్ చేసుకోండి
గత నెల 15 నుంచి 23 వరకు జరిగిన ప్రవేశ పరీక్షలకు మొత్తం 3,38,739 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 3,15,297 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో ఎంపీసీ స్ట్రీమ్‌లో 2,38,180 మందికి గాను 2,24,724 మంది, బైపీసీ స్ట్రీమ్‌లో 1,00,559 మందికి గాను 90,573 మంది పరీక్ష రాశారు. కోవిడ్ సమయంలో తొలగించిన ఇంటర్మీడియెట్ వెయిటేజ్ మార్కులను ఈసారి పరిగణలోకి తీసుకుని ఫలితాలను ప్రకటించారు.
లింక్స్ ఇవే..
ఇంజినీరింగ్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
అగ్రికల్చర్ & ఫార్మసీ ఫలితాల కోసం క్లిక్ చేయండి
AP ఎంసెట్ 2023 ఫలితాన్ని ఎలా తనిఖీ చేయాలి
AP EAMCET 2023 ఫలితాన్ని తనిఖీ చేయడానికి, దయచేసి ఈ దశలను అనుసరించండి:
1. AP EAMCET యొక్క అధికారిక వెబ్‌సైట్ -- cets.apsche.ap.gov.inని సందర్శించండి.
2. "EAPCET 2023" లింక్ కోసం వెతకండి మరియు దానిపై క్లిక్ చేయండి.
3. EAPCET 2023 పేజీలో, స్కోర్‌కార్డ్‌ని డౌన్‌లోడ్ చేయడానికి ఎంపికను గుర్తించండి.
4. మీ రిజిస్ట్రేషన్ నంబర్, హాల్ టికెట్ నంబర్ మరియు పుట్టిన తేదీని నమోదు చేయండి.
5. "సమర్పించు" బటన్ పై క్లిక్ చేయండి.
6. లాగిన్ అయిన తర్వాత, మీ AP EAMCET 2023 ఫలితం స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది.
7. మీ ఫలితాలను జాగ్రత్తగా సమీక్షించడానికి కొంత సమయం కేటాయించండి, అన్ని వివరాలు సరైనవని నిర్ధారించుకోండి.
8. చివరగా, మీరు భవిష్యత్తు సూచన కోసం మీ ఫలితాన్ని డౌన్‌లోడ్ చేసి, సేవ్ చేసుకోవచ్చు లేదా అవసరమైతే ప్రింట్‌అవుట్ తీసుకోవచ్చు.