AP EAPCET Results 2023 Declared: ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల, విద్యార్థులు తమ ఫలితాలను cets.apsche.ap.gov.in ద్వారా చెక్ చేసుకోండి
రాష్ట్రంలోని ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీఈఏపీ సెట్–2023 ఫలితాలను బుధవారం ఉదయం 10.30 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు.
రాష్ట్రంలోని ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీఈఏపీ సెట్–2023 ఫలితాలను బుధవారం ఉదయం 10.30 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. గత నెల 15 నుంచి 23 వరకు జరిగిన ప్రవేశ పరీక్షలకు మొత్తం 3,38,739 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 3,15,297 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో ఎంపీసీ స్ట్రీమ్‌లో 2,38,180 మందికి గాను 2,24,724 మంది, బైపీసీ స్ట్రీమ్‌లో 1,00,559 మందికి గాను 90,573 మంది పరీక్ష రాశారు. కోవిడ్ సమయంలో తొలగించిన ఇంటర్మీడియెట్ వెయిటేజ్ మార్కులను ఈసారి పరిగణలోకి తీసుకుని ఫలితాలను ప్రకటించారు.
మే 15 నుంచి 19వరకు ఇంజినీరింగ్ స్ట్రీమ్, మే 22, 23 తేదీల్లో అగ్రికల్చర్/ఫార్మసీ విభాగాలకు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.ఇటీవల AP EAPCET 2023 ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్లను విడుదల చేసిన అధికారులు.. మే 24 నుంచి 26వరకు అభ్యంతరాలు స్వీకరించారు. అనంతపురం జేఎన్‌టీయూ- ఏపీ ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పరీక్షలకు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 3.15లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులు సాధించిన ఇంటర్ మార్కులకు 25శాతం చొప్పున వెయిటేజీ కల్పించి ఏపీ ఈఏపీసెట్ ర్యాంకులను ప్రకటించనున్నారు. ఫలితాలను విద్యార్థులు cets.apsche.ap.gov.in ద్వారా చెక్ చేసుకోవాలని అధికారులు తెలిపారు.