AP Inter Result 2022: ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు, ఏ క్షణమైనా విడుదలయ్యే అవకాశం, ఫలితాలను bse.ap.gov.in ద్వారా చెక్ చేసుకోండి

అయితే సోషల్ మీడియాలో ఈ రోజే వెలువడనున్నాయంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై (AP Inter Result 2022) ఎలాంటి అధికారిక సమాచారం లేదు. కావున ఫలితాలు ఏ క్షణమైనా వెలువడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Representational Image (Photo Credits: PTI)

ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయి. అయితే సోషల్ మీడియాలో ఈ రోజే వెలువడనున్నాయంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై (AP Inter Result 2022) ఎలాంటి అధికారిక సమాచారం లేదు. కావున ఫలితాలు ఏ క్షణమైనా వెలువడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జరిగిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్షల ఫలితాలు త్వరలో విడుదల కాబోతున్నాయి. ఈ ఏడాది మే 6 నుంచి 24 వరకు పరీక్షలు జరిగాయి. 4,64,756 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.

విద్యార్థులు ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ bse.ap.gov.in లోకి వెళ్లి వారి రిజల్ట్స్ ను చెక్ చేసుకోవచ్చు. bse.ap.gov.in వెబ్ సైట్లోకి వెళ్లిన తర్వాత... హోమ్ పేజ్ లో ఇంటర్ ఫలితాల లింక్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత లాగిన్ వివరాలను నమోదు చేసి, ఎంటర్ బటన్ నొక్కాలి. వెంటనే మీ రిజల్ట్స్ స్క్రీన్ పై కనపడతాయి. రిజల్స్ట్ కాపీని సేవ్ చేసుకోవచ్చు లేదా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.  పదవ తరగతి విద్యార్థులకు తీపి కబురు, బెటర్‌మెంట్‌ ద్వారా మార్కులను పెంచుకునే అవకాశాన్ని కల్పించిన ఏపీ ప్రభుత్వం

ఈసారి ఇంటర్ విద్యార్థులకు డిజిటల్ స్కోర్ కార్డు ఇవ్వనున్నారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ లో ఉత్తీర్ణత సాధించాలంటే ప్రతి సబ్జెక్టులో 33 కంటే ఎక్కువ మార్కులు సాధించాల్సి ఉంటుంది. 90 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వ స్కాలర్ షిప్స్ కు అర్హులవుతారు.