AP Inter Results 2022: పుకార్లకు చెక్.. జూన్ 25 తర్వాతే ఇంటర్ పరీక్షా ఫలితాలు, స్పష్టతనిచ్చిన ఇంటర్‌ బోర్డు, వాల్యూవేషన్ ప్రాసెస్ జరుగుతుందని వెల్లడి

ఈ రోజు వస్తున్నాయి, రేపు వస్తున్నాయంటూ వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఫలితాల విడుదలపై (AP Inter Results 2022) పూర్తి క్లారిటీ లేకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్‌ బోర్డు (Board of Intermediate Education Andhra Pradesh) స్పష్టత ఇచ్చింది.

Representational Image | File Photo

ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు గురించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ రోజు వస్తున్నాయి, రేపు వస్తున్నాయంటూ వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఫలితాల విడుదలపై (AP Inter Results 2022) పూర్తి క్లారిటీ లేకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్‌ బోర్డు (Board of Intermediate Education Andhra Pradesh) స్పష్టత ఇచ్చింది.

ఇంటర్‌ పరీక్ష పత్రాల వాల్యూవేషన్ ప్రాసెస్ జరుగుతుందని.. ఈ నెల 25 తర్వాతే AP Inter Results విడుదల చేస్తామని వెల్లడించారు. అయితే ఈ ఇంటర్‌ పరీక్షలను మే 6నుంచి 24 వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది దాదాపు 4,64,756 మంది ఇంటర్ స్టూడెండ్స్ పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాలు వచ్చాక విద్యార్థులకు డిజిటల్ స్కోర్ కార్డ్స్ అందిస్తారు.

పదవ తరగతి విద్యార్థులకు తీపి కబురు, బెటర్‌మెంట్‌ ద్వారా మార్కులను పెంచుకునే అవకాశాన్ని కల్పించిన ఏపీ ప్రభుత్వం

ఇక.. ఇంటర్‌ పరీక్షలకు హాజరైన విద్యార్థులు AP Inter Results విడుదలైన అనంతరం https://bie.ap.gov.in/ వెబ్‌సైట్ల ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ లో ఉత్తీర్ణత సాధించాలంటే ప్రతి సబ్జెక్టులో 33 కంటే ఎక్కువ మార్కులు రావాల్సి ఉంటుంది. 90 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వ స్కాలర్ షిప్స్‌కు అర్హత సాధిస్తారు.ఇక ఈ సారి దోతరగతి విద్యార్థులకు బెటర్‌ మెంట్‌ పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి విదితమే. ఎన్నడూ లేని విధంగా పదో తరగతి విద్యార్థులకు బెటర్‌మెంట్‌ పరీక్షను రాసే అవకాశం కల్పించారు. ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించి తక్కువ మార్కులు సాధించిన విద్యార్థుల కోసం ఈ అవకాశాన్ని కల్పించారు.