AP PGCET-AP EDCET Results Declared: ఏపీ పీజీసెట్‌, ఎడ్‌సెట్ ఫలితాలు విడుదల, ర్యాంకు కార్డు కోసం డైరెక్ట్ లింక్ ఇదిగో..

ఈ ఫలితాలను ఆంధ్రా యూనివర్సిటీ వీసీ ప్రసాద్‌ రెడ్డి శుక్రవారం విడుదల చేశారు.

Andhra University VC Prasad Reddy

ఏపీలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ పీజీసెట్‌ 2023(AP PGCET 2023), బీఈడీ(BEd) కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన ఎడ్‌సెట్‌ 2023 పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఆంధ్రా యూనివర్సిటీ వీసీ ప్రసాద్‌ రెడ్డి శుక్రవారం విడుదల చేశారు. జూన్‌ 6 నుంచి జూన్‌ 10 వరకు ఏపీ పీజీసెట్‌, జూన్‌ 14న ఎడ్‌సెట్‌ పరీక్షలను ఆంధ్రాయూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన విషయం తెలిసిందే.

ఏపీ పీజీసెట్‌ పరీక్షకు 30,156 మంది దరఖాస్తు చేసుకోగా.. 26,799మంది హాజరయ్యారు. వీరిలో 22,858 మంది(85.33శాతం) ఉత్తీర్ణత సాధించారని వీసీ ప్రసాద్‌ రెడ్డి తెలిపారు. ఈ ఫలితాల్లో మహిళలు 85.33%; పురుషుల విభాగంలో 85.24% చొప్పున ఉత్తీర్ణత నమోదైనట్టు పేర్కొన్నారు. 21 విభాగాల్లో ఈ పరీక్ష నిర్వహించగా.. ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ మినహా అన్ని విభాగాల ఫలితాలను విడుదల చేశారు.

ఇక రాష్ట్ర వ్యాప్తంగా బీఈడీ ప్రవేశ పరీక్షకు 13,672 మంది దరఖాస్తు చేసుకోగా.. 11,236 హాజరయ్యారు. వీరిలో 10,908 (97.08%) మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఈ ఫలితాల్లో మ్యాథమెటిక్స్‌ విభాగంలో వై.సాగర్, ఫిజికల్ సైన్స్ విభాగంలో మర్రాపు తిరుపతి నాయుడు, బయోలాజికల్ సైన్స్ విభాగంలో లల్మట్టి ఆశం, సోషల్ స్టడీస్ విభాగంలో సింగవరపు బలరామ నాయుడు, ఇంగ్లీష్ విభాగంలో నవీన్ తొలి స్థానంలో నిలిచారు.

లింక్స్ ఇవిగో..

ఏపీ పీజీసెట్‌ ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

ఏపీ ఎడ్‌సెట్‌ ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

ఏపీ ఎడ్‌సెట్‌ ర్యాంక్‌ కార్డు కోసం క్లిక్‌ చేయండి