AP PGECET 2021: ఏపీ పీజీ సెట్ నోటిఫికేషన్ విడుదల, నిర్వహణా బాధ్యతలు చేపట్టిన కడప యోగి వేమన యూనివర్సిటీ, నేటి నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు
కడప యోగి వేమన యూనివర్సిటీ పీజీ సెట్‌ను నిర్వహణా బాధ్యతలు చేపట్టింది. అందులో భాగంగా ఏపీ పీజీ సెట్ నోటిఫికేషన్ విడుదల (AP PGECET 2021 Notification released) చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ పీజీ కోర్సులలో ప్రవేశ పరీక్షలకి ఉన్నత విద్యా మండలి పీజీ సెట్ (AP PGECET 2021) నిర్వహిస్తోంది. కడప యోగి వేమన యూనివర్సిటీ పీజీ సెట్‌ను నిర్వహణా బాధ్యతలు చేపట్టింది. అందులో భాగంగా ఏపీ పీజీ సెట్ నోటిఫికేషన్ విడుదల (AP PGECET 2021 Notification released) చేసింది. నేటి(బుధవారం) నుంచి ఆన్‌లైన్‌లో ధరఖాస్తుల స్వీకరిస్తున్నట్లు ప్రకటించింది.
ఓసీ విద్యార్థులకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.850, బీసీలకి రూ.750, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌లకు రూ.650గా ఫీజు నిర్ణయించింది. ఆన్‌లైన్‌లో ధరఖాస్తుల స్వీకరణకి సెప్టెంబర్ 30వ తేదీ తుది గడువుగా పేర్కొంది. రూ. 200 అదనపు రుసుముతో అక్టోబర్ నాలుగు వరకు గడువు ఉన్నట్లు తెలిపింది. రూ.500 అదనపు రుసుముతో అక్టోబర్ 8 వరకు తుది గడువు ఉన్నట్లు పేర్కొంది. అక్టోబర్ 22వ తేదీన పీజీ సెట్ పరీక్ష జరగనుంది.
ఇంటర్మీడియెట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు అంతా సిద్ధమైంది. బుధవారం నుంచి ప్రారంభమయ్యే పరీక్షలకు మొదటి, రెండో సంవత్సరం కలిపి జిల్లాలో 1,13,538 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. వీరి కోసం 142 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, రెండో సంవత్సరం వారికి మధ్యాహ్నం 2.30 నుంచి 5.30గంటల వరకు టైం టేబుల్ మేరకు ప్రతి రోజూ పరీక్ష ఉంటుంది. నేడు సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష పేపర్ -1కి 2వ సెట్ ప్రశ్న పత్రాన్ని లాటరీ ద్వారా ఎంపిక చేశారు.
బుధవారం నుంచి 23 వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయి. పరీక్షలకి హల్ టిక్కెట్స్ 4 లక్షల మంది విద్యార్ధులు డౌన్ లోడ్ చేసుకున్నారు. కోవిడ్ కారణంగా ఈ ఏడాది జులైలో జరగాల్సిన ఇంటర్ పరీక్షలు సుప్రీంకోర్టు ఆదేశాల నేపద్యంలో రద్దు అయిన విషయం తెలిసిందే. ఇంటర్ బోర్డు ప్రకటించిన ఫలితాలపై అసంతృప్తి ఉన్న విద్యార్దులెవరైనా ఈ సప్లిమెంటరీ పరీక్షలకి హాజరుకావచ్చు.
రేపు(గురువారం) ఇంగ్లీష్, 17న మేథమెటిక్స్- A, బోటనీ, సివిక్స్ పేపర్లు, 18న మేథమెటిక్స్-B, జువాలజీ, హిస్టరీ పరీక్షలు, 20 న ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షలు, 21 న కెమిస్ట్రీ, కామర్స్, సోషయాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పరీక్షలు, 22న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్, బ్రిడ్జి కోర్స్ మేద్స్, 23వ తేదీన మోడర్న్ లాంగ్వేజ్, జాగ్రఫీ పరీక్షలు, ఈ నెల 27 న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష, 28న ఎన్విరాన్ మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షా కేంద్రాల వద్ద కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్ధులు మాస్కులు ధరించి పరీక్షలకి హాజరుకావాల్సి ఉంటుంది. నిమిషం నిబందనని అమలు చేయడం లేదని అధికారులు పేర్కొన్నారు.
అనివార్య కారణాల వల్ల పరీక్షా కేంద్రాలకి ఆలస్యంగా హాజరైనా విద్యార్ధులని అనుమతించాలని ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. పరీక్షా కేంద్రాల వద్ద థర్మల్ స్కానింగ్ ద్వారా తనిఖీలు చేయనున్నారు. పరీక్షల నిర్వహణకి ప్రతీ జిల్లాకి ఒక కోవిడ్ ప్రోటోకాల్ అధికారిని నియామించారు. పరీక్షల నిర్వహణ కోసం ఇంటర్ బోర్డు కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. విద్యార్ధుల సౌకర్యార్ధం టోల్ ఫ్రీ నంవర్ 18002749868 ఏర్పాటు చేశా