APPSC Recruitment 2021: ఏపీపీఎస్సీ గెజిటెడ్‌ ఉద్యోగాలు, నెలకు వేతనం రూ.29,760 నుంచి రూ.93,780 వరకు, ఇప్పుడే ఆన్‌లైన్‌లో అప్లై చేయండి, ఎలా అప్లయి చేయాలో తెలుసుకోండి

వివిధ విభాగాల్లో గెజిటెడ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 25గా ఉన్నాయి. అర్హతల విషయానికి వస్తే.. పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఇంజనీరింగ్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.

Representational Image | File Photo

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ)... వివిధ విభాగాల్లో గెజిటెడ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 25గా ఉన్నాయి. అర్హతల విషయానికి వస్తే.. పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఇంజనీరింగ్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. ఇక వయసు విషయానికి వస్తే.. టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు 21–28 ఏళ్లు, అసిస్టెంట్‌ కమిషనర్‌ పోస్టులకు 28–42 ఏళ్లు, మిగతా పోస్టులకు 18–42 ఏళ్ల మధ్య ఉండాలి

పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.29,760 నుంచి రూ.93,780 వేతనం చెల్లిస్తారు. కంప్యూటర్‌ బేస్డ్‌ రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ధరఖాస్తు చేసుకునే వెబ్‌సైట్‌: https://psc.ap.gov.in. దరఖాస్తు ప్రారంభ తేది: 08.12.2021 అలాగే దరఖాస్తులకు చివరి తేది: 28.12.2021.

పోస్టుల వివరాలు: ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌(ఏపీ ఫిషరీస్‌ సర్వీస్‌)–11, సెరీకల్చర్‌ ఆఫీసర్‌(ఏపీ సెరీకల్చర్‌ సర్వీస్‌)–01, అగ్రికల్చర్‌ ఆఫీసర్‌(ఏపీ అగ్రికల్చర్‌ సర్వీస్‌)–06, డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌(ఏపీ వర్క్స్‌ అకౌంట్స్‌ సర్వీస్‌)–02, టెక్నికల్‌ అసిస్టెంట్‌(ఏపీ పోలీస్‌ సర్వీస్‌)–01, అసిస్టెంట్‌ కమిషనర్‌(ఏపీ ఎండోమెంట్స్‌ సర్వీస్‌)–03, అసిస్టెంట్‌ డైరెక్టర్‌(ఏపీ హార్టికల్చర్‌ సర్వీస్‌)–01.

రోజుకు రూ. 150 సంపాదన, ఇంగ్లీష్ రాలేదని ఏకంగా స్కూలునే కట్టించాడు, చిన్న పండ్ల వ్యాపారి పద్మశ్రీ అవార్డు గ్రహిత హరేకల హజబ్బాపై ప్రత్యేక కథనం

దీంతో పాటుగా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ విభాగంలోని..ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌–1 పోస్ట్‌ల భర్తీకి ఎంపిక ప్రక్రియ ప్రారంభించింది. హోంసైన్స్, ఫుడ్‌ సైన్స్, న్యూట్రిషన్, సోషల్‌ వర్క్‌ తదితర విభాగాల్లో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులైన మహిళలు ఈ కొలువులకు అర్హులు. ఖాళీగా ఉన్న ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ పోస్ట్‌ల భర్తీకి ఏపీపీఎస్సీ తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు. అకడమిక్‌గా ఆయా సబ్జెక్ట్‌లపై పట్టున్న వారు ఈ పరీక్షలో విజయం సాధించడం సులభమే అంటున్నారు నిపుణులు.

► మొత్తం పోస్ట్‌ల సంఖ్య: 22

► పోస్టుల వివరాలు: ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌–1(సూపర్‌వైజర్‌)

అర్హతలు

ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ న్యూట్రిషన్, ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్, అప్లైడ్‌ న్యూట్రిషన్‌ అండ్‌ పబ్లిక్‌ హెల్త్, క్లినికల్‌ న్యూట్రిషన్‌ అండ్‌ డైటిటిక్స్, ఫుడ్‌ సైన్సెస్‌ అండ్‌ క్వాలిటీ కంట్రోల్, ఫుడ్‌ సైన్సెస్‌ అండ్‌ మేనేజ్‌మెంట్, ఫుడ్‌ టెక్నాలజీ అండ్‌ న్యూట్రిషన్, ఫుడ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌ సబ్జెక్ట్‌లలో ఏదో ఒకటి గ్రూప్‌ సబ్జెక్ట్‌గా బీఎస్సీ (బీజెడ్‌సీ) ఉత్తీర్ణత ఉండాలి.

► హోంసైన్స్‌/సోషల్‌ వర్క్‌/సోషియాలజీ/ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ న్యూట్రిషన్‌లో.. ఉన్నత విద్య అర్హతలు ఉన్న అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

వయో పరిమితి

►వయసు జూలై 1, 2021 నాటికి 18–42ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల మేరకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.

ప్రారంభ వేతనం

► ఏపీపీఎస్సీ భర్తీ చేయనున్న మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలోని సబార్డినేట్‌ సర్వీస్‌లోని ఈ ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలను గ్రేడ్‌–1 హోదా పోస్ట్‌లుగా పేర్కొన్నారు. ఈ ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్లనే సూపర్‌వైజర్లుగా కూడా పిలుస్తారు. వీరికి వేతన శ్రేణి రూ.24,440–రూ.71,510గా ఉంటుంది.

ఎంపిక విధానం

ఆన్‌లైన్‌ విధానం(కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌)లో జరిగే రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక చేస్తారు. ఈ ఆన్‌లైన్‌ పరీక్షలో రెండు పేపర్లు మొత్తం 300 మార్కులకు ఉంటాయి. పేపర్‌ 1 జనరల్‌ స్టడీస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ 150 ప్రశ్నలు–150 మార్కులకు; పేపర్‌ 2 హోం సైన్స్‌ అండ్‌ సోషల్‌ వర్క్‌ 150 ప్రశ్నలు–150 మార్కులకు నిర్వహిస్తారు.

► ప్రశ్నలన్నింటినీ ఆబ్జెక్టివ్‌ తరహా బహుళైచ్ఛిక విధానంలోనే అడుగుతారు.

► ఈ రాత పరీక్ష కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌(సీబీటీ)గా నిర్వహిస్తారు.

► ఒక్కో పేపర్‌కు పరీక్ష సమయం రెండున్నర గంటలు ఉంటుంది.

► ప్రతి తప్పు సమాధానానికి సదరు ప్రశ్నకు కేటాయించిన మార్కుల నుంచి 1/3 తగ్గిస్తారు.

రాత పరీక్షలో మెరిట్‌

ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ పోస్ట్‌లకు అభ్యర్థులు రాత పరీక్షలో సాధించిన మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. అందుబాటులో ఉన్న పోస్ట్‌లు, రిజర్వ్‌డ్‌ కేటగిరీలకు కేటాయించిన పోస్ట్‌లు తదితర నిబంధనలను పరిగణనలోకి తీసుకొని.. ఆయా కేటగిరీల్లో మెరిట్‌ జాబితా రూపొందించి నియామకాలు ఖరారు చేస్తారు.

దరఖాస్తు విధానం:

► ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

► ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీలు: నవంబర్‌ 18–డిసెంబర్‌ 8, 2021

► అప్లికేషన్‌ ఫీజు చెల్లింపు చివరి తేదీ: సెంబర్‌ 7, 2021

► ఆన్‌లైన్‌ దరఖాస్తులో సవరణ:దరఖాస్తు చివరి తేదీ నుంచి ఏడు రోజుల లోపు సవరణలు చేసుకోవచ్చు.

వెబ్‌సైట్‌ https://psc.ap.gov.in/

సౌత్‌ ఈస్టర్న్‌ రైల్వేలో 1785 అప్రెంటిస్‌ ఖాళీలు

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన కోల్‌కతా ప్రధాన కేంద్రంగా ఉన్న సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వే... వివిధ వర్క్‌షాపుల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది

మొత్తం ఖాళీల సంఖ్య: 1785

► ట్రేడులు: ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, మెకానిక్, మెషినిస్ట్, పెయింటర్, కేబుల్‌ జాయింటర్‌ తదితరాలు.

► ఖాళీలున్న వర్క్‌షాపులు: ఖరగ్‌పూర్‌ వర్క్‌షాప్, సిగ్నల్‌ అండ్‌ టెలికామ్‌ వర్క్‌షాప్, ట్రాక్‌ మెషిన్‌ తదితరాలు.

► అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

► వయసు: 01.01.2022 నాటికి 15–24ఏళ్ల మధ్య ఉండాలి.

► ఎంపిక విధానం: అకడెమిక్‌ మెరిట్‌ ప్రాతిపదికన ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

► దరఖాస్తులకు చివరి తేది: 14.12.2021

వెబ్‌సైట్‌: https://www.rrcser.co.in