Mangalore, Nov 9: అతనో చిన్న వ్యాపారి..అయితేనేమి చదువు విలువ తెలుసుకుని తన రెక్కల కష్టంతో సంపాదించిన మొత్తంతో ఏకంగా స్కూలునే నిర్మించాడు. అతని కృషిని గుర్తించిన కేంద్రం భారతదేశపు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీతో (Padma Shri Harekala Hajabba) సత్కరించింది. రాష్ట్రపతి భవన్ లో జరిగిన పద్మ అవార్డుల వేడకల్లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నుండి ఈ విద్యా దాత (Harekala Hajabba) పద్మశ్రీని అందుకున్నాడు. ఆయన జీవితంలోకి ఓ సారి తొంగి చూస్తే ఎన్నో ఆసక్తికర విషయాలు తెలుస్తాయి.
కర్నాటకలోని మంగళూరుకు చెందిన 68 ఏళ్ల నారింజ పండ్ల వ్యాపారి అరెకల హజబ్బ తన రోజు వారీ రూ.150 సంపాదనతో ప్రాథమిక పాఠశాలను (An orange vendor who built a school with his Earnings) నిర్మించాడు. మంగళూరులోని హరేకల-న్యూపడ్పు గ్రామంలో పాఠశాలను నిర్మించడం ద్వారా గ్రామీణ విద్యలో విప్లవం తీసుకొచ్చినందుకు ఈ అవార్డును అందుకున్నారు. ఈ పాఠశాలలో ప్రస్తుతం గ్రామానికి చెందిన 175 మంది నిరుపేద విద్యార్థులు ఉన్నారు. 1977 నుండి మంగళూరు బస్ డిపోలో నారింజ పండ్లను విక్రయిస్తున్న హజబ్బ నిరక్షరాస్యుడు. పాఠశాలకు వెళ్ళలేదు.
అయితే 1978లో ఒక విదేశీయుడు నారింజ పండు ఖరీదు అడిగినప్పుడు అతనికి ఆ ధరను ఎలా చెప్పాలో అర్థం కాలేదు. ఆ రోజున అతని మదిలో బలంగా ఓ నిర్ణయం తీసుకున్నాడు. తనలాగే ఎవరూ ఇబ్బంది పడకూడదని తన రోజు వారి సంపాదనతో స్కూలును నిర్మించాలని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా పైసా పైసా కూడబెట్టి అనుకున్నది సాధించాడు. హరేకల హజబ్బ గ్రామం న్యూపడపులో చాలా సంవత్సరాలుగా పాఠశాల లేదు. గ్రామంలోని పిల్లలందరికీ విద్యాహక్కు లేకుండా పోయింది. ఆ తర్వాత 2000లో హరేకల హజబ్బ తన పొదుపు మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టి ఒక ఎకరం స్థలంలో పాఠశాలను ప్రారంభించాడు.
Here's President of India Tweet
President Kovind presents Padma Shri to Shri Harekala Hajabba for Social Work. An orange vendor in Mangalore, Karnataka, he saved money from his vendor business to build a school in his village. pic.twitter.com/fPrmq0VMQv
— President of India (@rashtrapatibhvn) November 8, 2021
నాకు విద్యను అభ్యసించే అవకాశం ఎప్పుడూ లేదు. గ్రామంలోని పిల్లలు అదే పరిస్థితిని అనుభవించాలని నేను కోరుకోలేదు" అని పద్మ శ్రీ అవార్డు గ్రహిత తెలిపాడు. నాకు కన్నడ మాత్రమే తెలుసు, ఇంగ్లీష్ లేదా హిందీ కాదు. కాబట్టి నేను విదేశీయులకు సహాయం చేయలేక నిరాశకు గురయ్యాను. మా గ్రామంలో పాఠశాలను నిర్మించిన తరువాత నేనే ఆశ్చర్యపోయాను అని అన్నారాయన.
పాఠశాలను నిర్మించాలన్న ఆయన కల రెండు దశాబ్దాల తర్వాత నెరవేరింది.
2020 జనవరిలో హరేకల హజబ్బా పద్మశ్రీ అవార్డును అందుకోనున్నట్లు ప్రకటించారు. అయితే మహమ్మారి కారణంగా ముందుగా వేడుకను నిర్వహించలేకపోయారు. సోమవారం రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పద్మ అవార్డులను ప్రదానం చేశారు. 2021 పద్మ అవార్డుల జాబితాలో ఏడు పద్మవిభూషణ్, 10 పద్మ భూషణ్ మరియు 102 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి, వీటిలో 29 అవార్డు గ్రహీతలు మహిళలు. ఒక లింగమార్పిడి వ్యక్తి. కళ, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, సైన్స్ మరియు ఇంజనీరింగ్, వాణిజ్యం మరియు పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం మరియు విద్య, క్రీడలు, పౌర సేవ మొదలైన వివిధ రంగాలలో పద్మ అవార్డులు అందించబడ్డాయి.
28 మంది విద్యార్థులతో ప్రారంభమైన ఈ పాఠశాల ఇప్పుడు 10వ తరగతి వరకు 175 మంది విద్యార్థులకు వసతి కల్పిస్తోంది. హజబ్బ ఈ అనేక సంవత్సరాలలో వివిధ అవార్డులను గెలుచుకున్న తర్వాత అందుకున్న ప్రైజ్ మనీని తన గ్రామంలో మరిన్ని పాఠశాలల నిర్మాణంలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు. అతని తదుపరి లక్ష్యం ఏమిటని అడిగినప్పుడు, 66 ఏళ్ల వ్యక్తి ఇలా అన్నాడు, "మా గ్రామంలో మరిన్ని పాఠశాలలు మరియు కళాశాలలను నిర్మించడమే నా లక్ష్యం. పాఠశాలలు, కళాశాలలు కోసం చాలా మంది డబ్బు విరాళంగా ఇచ్చారు.స్కూలు నిర్మాణానికి భూమిని కొనుగోలు చేసినందుకు నేను ప్రైజ్ మనీని ఉపయోగించాను అని చెప్పాడు.
మా గ్రామంలో ప్రీ-యూనివర్శిటీ కళాశాల (11 మరియు 12 తరగతుల విద్యార్థుల కోసం) నిర్మించాలని నేను ప్రధాని నరేంద్ర మోడీని అభ్యర్థించాను" అని ఆయన చెప్పారు. తన దాతృత్వ కార్యక్రమాలను గుర్తించిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, ఎంపీ నళిన్‌కుమార్ కటీల్, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కోట శ్రీనివాస పూజారి, ఎమ్మెల్యే యూటీ ఖాదర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.