Mikheil Saakashvili: ఈ పోలీసులు బూతులు తిడుతూ, జుట్టు పట్టుకుని నేల మీద పడేసి కొడుతున్నారు, జైలులోనే చంపేసాలా ఉన్నారు, సంచలన లేఖ రాసిన జార్జియా ప్రతిపక్ష నాయకుడు మిఖేల్ సాకాష్విలి
Pro-government demonstrators with Georgian national and Georgian Dream party flags gather in the central square in Tbilisi, Georgia (Photo: AP/PTI)

Tbilisi, Nov 9: జార్జియా జైలులో ఉన్న మాజీ అధ్యక్షుడు (Georgia ex-presiden), ప్రతిపక్ష నాయకుడు, యునైటెడ్ నేషనల్ మూవ్‌మెంట్ పార్టీ అధినేత మిఖేల్ సాకాష్విలి (opposition leader Mikheil Saakashvili) కొద్ది వారాలుగా నిరాహార దీక్షలో ఉన్నారు. ఈ నేపథ్యంలో జైలు గార్డులు తనపై దాడి చేయడంతో తన ప్రాణాలకు ముప్పు ఏర్పండిందని, ఏ క్షణమైనా నేను చనిపోయే అవకాశం ఉందని (abused in prison, fears for life) ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన తన లాయర్ కు లేఖ రాశారు. ఈ లేఖ ఇప్పుడు జార్జియా రాజకీయాల్లో ప్రకంపనలు రేకెత్తిస్తోంది.

2004, 2013 మధ్య అధ్యక్షుడిగా పనిచేసిన సాకాష్విలి (Mikheil Saakashvili) ఉక్రెయిన్‌లో ప్రవాసం నుండి తిరిగి వచ్చినప్పుడు అక్టోబర్ 1న అరెస్టు చేయబడ్డారు. తనను అకారణంగా జైలులో వేశారని ఆరోపించడమే కాకుండా, ఈ శిక్షను వ్యతిరేకిస్తూ 39 రోజుల పాటు ఆహారాన్ని నిరాకరించాడు. గత 39 రోజులుగా ఆయన ఆహారం తీసుకోకుండా దీక్ష కొనసాగిస్తున్నారు.ఇది రాజకీయ ప్రేరేపితమని, నన్ను జైలుకు పంపడంలో ఏదో కుట్ర దాగి ఉందని ఆయన ఆరోపిస్తూ వస్తున్నారు.

కాగా పాలక జార్జియన్ డ్రీమ్ పార్టీ గత ఎన్నికల్లో కొద్ది పాటి మెజారిటీతో అధికారాన్ని చేజిక్కించుకుంది. అయితే పార్లమెంటరీ ఎన్నికలలో జార్జియన్ డ్రీమ్ పార్టీ మోసానికి పాల్పడిందని ప్రతిపక్షం ఆరోపణలు గుప్పించింది. ఈ పరిణామాల మధ్య మిఖైల్ సాకాష్విలిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఇది జార్జియా రాజకీయాల్లో సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసింది.

చైనాలో ఆకలికేకలు, ముందస్తుగా ఆహారం నిల్వ చేసుకోవాలని చైనా సర్కారు ఆదేశం, మరో సంక్షోభానికి దారి తీస్తుందని ప్రపంచదేశాల ఆందోళన

తాజాగా ఆయన తన లాయర్ కి రాసిన లేఖలో గార్డులు "నన్ను మాటలతో దుర్భాషలాడారు, మెడపై కొట్టారు, నా జుట్టుతో నేలపైకి లాగారు" అని సాకాష్విలి పేర్కొన్నాడు. ‘జైలు సిబ్బంది నన్ను బూతులు తిడుతూ.. నా మెడ మీద కొట్టారు.. జుట్టు పట్టుకుని నేల మీద పడేసి లాక్కెళ్లారు. ఇలానే కొసాగితే.. త్వరలోనే నేను చనిపోతానని భయమేస్తుంది’’ అంటూ లేఖలో ఆందోళన వ్యక్తం చేశాడు. అంతేకాక అనారోగ్యంగా ఉన్న తనను జైలు ఆస్పత్రికి తీసుకెళ్లారని.. అక్కడ తనను చంపడమే వారి లక్ష్యమని సాకాష్విలి పేర్కొన్నాడు.

ప్రస్తుతం ఈ లేఖ జార్జియాలో సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో హక్కుల కార్యకర్తలు జైలు బయట కూర్చొని అధికారుల తీరుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. దాదాపు 40 వేల మంది కార్యకర్తలు నిరసలో పాల్గొని.. సాకాష్విలికి మద్దతు తెలిపారు. ఆయనను విడుదల చేయాల్సిందిగా కోరారు. ఈ నేపథ్యంలో జైలు అధికారులు ఆయన్ను జైలు ఆసుపత్రికి తరలించారు. సోమవారం ఉదయం, సాకాష్విలిని పరీక్షించిన వైద్యులు ఆయన శరీరంలో అనేక అవయవాలు పని తీరు ఇప్పటికే నెమ్మదించిందని.. నిరాహార దీక్ష మరి కొంత కాలం కొనసాగితే.. ఆయన ప్రాణాలకే ప్రమాదం అని ఆందోళన వ్యక్తం చేశారు.ప్రస్తుతం సాకాష్విలికి అత్యవసరంగా హైటెక్ క్లినిక్‌లో చికిత్స చేయవలసిన అవసరం ఉందని చెప్పారు.

మళ్లీ డేంజర్‌జోన్‌లోకి చైనా, ఒక్కసారిగా పెరిగిన కరోనా కేసులు, పలు ప్రావిన్స్‌ల‌లో లాక్‌డౌన్ నిబంధనలు అమల్లోకి, ఉల్లంఘించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు

సాకాష్విలికి అంతర్లీన రక్త రుగ్మత ఉన్నందున అతని నిరాహారదీక్ష ప్రమాదకరమైనదిగా మారినందున అతనికి మరణం సంభవించే ప్రమాదం ఉందని వైద్యులు చెప్పారు. సాకాష్విలిని జైలు ఆసుపత్రికి తరలించడాన్ని ఉక్రెయిన్ నిరసించింది. ఈ చర్య "అదనపు నష్టాలను సృష్టిస్తుంది" అని పేర్కొంది. "మిఖైల్ సాకాష్విలీని ఆలస్యం చేయకుండా పౌర వైద్య సదుపాయానికి బదిలీ చేయాలని మేము జార్జియన్ అధికార పార్టీకి పిలుపునిస్తాం అని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ టిబిలిసికి పంపిన నిరసన నోట్‌లో తెలిపింది.

జార్జియా రాజధాని టిబిలిసిలోని సెంట్రల్ ఫ్రీడమ్ స్క్వేర్‌లోకి సోమవారం సాయంత్రం సుమారు 40,000 మంది ప్రదర్శనకారులు సాకాష్విలి పేరును జపిస్తూ నిరసనలు జరిపారు. "జార్జియాలో ఒక సామూహిక, శాశ్వత నిరసన ఉద్యమం ప్రారంభమవుతుంది. మిఖైల్ సాకాష్విలిని విడుదల చేసి, ముందస్తు ఎన్నికలు వచ్చే వరకు ఈ ఉద్యమం ఆగదని సాకాష్విలి యొక్క యునైటెడ్ నేషనల్ మూవ్‌మెంట్ పార్టీ ఛైర్మన్ నికా మెలియా అక్కడి మీడియాతో తెలిపారు.

"మేము చెదిరిపోము, మా నిరసన  శాంతియుతంగా ఉంటుంది, అధికార పార్టీ మమ్మల్ని పౌర ఘర్షణకు రెచ్చగొట్టడానికి మేము అనుమతించమని యునైటెడ్ నేషనల్ మూవ్‌మెంట్ పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు. నిరసనకారులు బిల్డింగ్‌ను దిగ్బంధిస్తామని ప్రతిజ్ఞ చేస్తూ టిబిలిసి డౌన్‌టౌన్ గుండా ప్రధాన మంత్రి కార్యాలయం వైపు దూసుకువెళ్లారు. మా నిరసనతో ప్రధాన మంత్రి ఇరాక్లీ "గరీబాష్విలి తన కార్యాలయంలోకి వెళ్లలేరు లేదా ప్రవేశించలేరు" అని మెలియా చెప్పారు.

డెడ్ సీ ని కాపాడుకోవడానికి 300 మంది నగ్నంగా నిలబడ్డారు, సముద్రం వద్ద న్యూడ్‌గా ఫోటోలకు ఫోజులిచ్చిన వాలంటీర్లు, వీరిని తన కెమెరాలో బంధించిన అమెరికన్ ఫొటోగ్రాఫర్ స్పెన్సర్ టునిక్

ప్రదర్శనకారులలో ఒకరైన, వ్యాపారవేత్త నికో మ్గెలాడ్జే, 46, ఇలా అన్నాడు: "సాకాష్విలి రాజకీయ ప్రతీకారానికి బాధితుడు, అతను విముక్తి పొందే వరకు మేము ఆగమని తెలిపారు. ప్రభుత్వ భవనాల వెలుపల వందలాది మంది పోలీసులను మోహరించిన దృశ్యాలను  Mtavari TV స్టేషన్ ప్రసారం చేసింది. 2015లో  జార్జియన్ పాస్‌పోర్ట్ తీసివేయబడిన సాకాష్విలి ఇప్పుడు ఉక్రెయిన్ జాతీయుడు. అరెస్ట్ అయ్యే ముందు వరకు అక్కడ ప్రభుత్వ సంస్థ సంస్కరణలకు నాయకత్వం వహించాడు.

కస్టడీలో ఉన్న సాకాష్విలిని సందర్శించిన లాయర్ లోమ్జారియా, మిఖైల్ సాకాష్విలి ఇష్టానికి విరుద్ధంగా తనను జైలు ఆసుపత్రికి తరలించారని, తనను సివిల్ క్లినిక్‌కి బదిలీ చేయకుండా తప్పుదారి పట్టించారని చెప్పారు. ఇదిలా ఉంటే సాకాష్విలికి "ఆత్మహత్య చేసుకునే హక్కు ఉంది", అతను రాజకీయాలను విడిచిపెట్టడానికి నిరాకరించినందున ప్రభుత్వం అతనిని బలవంతంగా అరెస్టు చేయవలసి వచ్చిందని ప్రధాన మంత్రి ఇరక్లి గరీబాష్విలి ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. అది రాజకీయాల్లో కలకలం రేపుతోంది.